Latest Updates
-
లంచ్ తర్వాత విపరీతంగా నిద్ర మత్తు.. వీటిని అలవాటు చేసుకుంటే ఇక కునుకు మాటే ఉండదు.! -
వాతావరణ మార్పులతో మోకాళ్ల నొప్పుల బాధలు.. ఉపశమనం కోసం ఇంట్లోనే ఇలా చేయండి.! -
తిరోగమనం నుంచి బయటపడ్డ బుధ గ్రహం.. ఇక ఈ రాశుల వారి దశ తిరిగినట్లే.! -
సోషల్ మీడియాలో పరిచయాలు నిజమా కాదా.?.. డేటింగ్‌కి వెళ్లేముందు ఈ విషయాలు గమనించండి.! -
ముఖంపై మొటిమలు రావడానికి కారణాలు ఇవే.. వీటిని ఎలా నివారించాలంటే.! -
‘సర్’ కలిపిన బంధం.. ముప్పై ఏళ్ల తర్వాత మళ్లీ తల్లిదండ్రులను చేరిన కుమారుడు.! -
ప్యాకెట్ చిప్స్ కు గుడ్ బై..ఎలాంటి రసాయనాలు లేకుండా ఇంట్లోనే కరకరలాడే ఆలూ చిప్స్ చేసుకోండిలా.. -
మీ పాదాలపై ఇలా ఉందా?.. లివర్ డ్యామేజ్ కి ముందస్తు హెచ్చరిక! -
ఆఫీస్ నుంచి రాగానే అలసటగా ఉందా? 15 నిమిషాల్లో ఈ క్రీమీ పనీర్ గ్రేవీ ట్రై చేయండి..చపాతీ, రైస్ లోకి కేక -
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది!
భర్త ఎందుకు మౌనంగా ఉన్నాడో తెలుసుకోకుంటే మొదటికే మోసం వస్తుంది
వివాహం జరిగి తరువాత చాలా సందర్బాల్లో దంపతులు ఒకరి మీద ఒకరు ఫిర్యాదులు, ఆరోపణలు చేసుకోవడం సర్వసాధారంగా జరుగుతుంటాయి. అయితే చాలా సందర్బాల్లో గొడవలు జరిగిన తరువాత భర్తలు సైలెంట్ గా ఉండిపోతారు. భర్త సైలెంట్ గా ఉండిపోయాడు అంటే తనకు అతను భయపడ్డాడు అని భార్యలు గుడ్డిగా నమ్మితే పోరపాటుపడినట్లే అవుతుంది. భర్త ఎందుకు మౌనంగా ఉన్నాడు అని భార్య అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి.
చాలా ఫ్యామిలీల్లో భార్యల కంటే భర్తలు చాలా తక్కువగా మాట్లాడుతుంటారు. భర్త ఎందుకు తక్కువగా మాట్లాడుతున్నాడు అని భార్య అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. భర్త మౌనంగా ఉన్నాడని భార్య చిరాకుగా మాట్లాడితే భర్తల నుంచి కఠినమైన సమాధానాలు వచ్చే అవకాశం ఉంటుంది. అలాంటి సందర్బంలో మీకు ఊహించని సమాధానం వచ్చే అవకాశం ఉంటుంది. చాలా మంది భార్యలు తమ వివాహ జీవితంలో తమ భర్తలు ఎందుకు తక్కువ మాట్లాడతారో అర్థం కాదు.

భర్త మౌనం వారి జీవితాన్ని అనేక విధాలుగా ప్రభావితం చేస్తుంది. ఈ కారణంగా భాగస్వాముల మధ్య దూరం పెరగడమే కాకుండా తీవ్ర గందరగోళానికి దారితీస్తుంది. ఈ సమస్య మూలకారణాన్ని అర్థం చేసుకోవడం ద్వారా భార్యలు తమ భర్త మౌనాన్ని ఎలా ఎదుర్కోవాలో అర్థం చేసుకుంటారు. అలా చెయ్యకపోతే వారి వైవాహిక జీవితం కూడా వేడెక్కుతుంది. ఇలాంటి వివాదాలు వారి సంసారంలో శాంతిని నాశనం చేస్తాయి. భర్త మౌనంగా ఉన్నాడంటే రకరకాల కారణాలు ఉంటాయి.
ఒక భార్య ఉద్యోగం నుండి ఇంటికి వచ్చిన తరువాత ఉత్సాహంగా తన భర్తకు ఆరోజు ఆఫీసులో ఏం జరిగింది అనే వివరాలను చెప్పినప్పుడు పరిస్థితులు వేరే రకంగా ఉంటాయి. కొన్నిసార్లు భర్త ప్రతిస్పందనగా గొణుగుడు వినపడతుంది. కొన్నిసార్లు భర్త నుండి అలాంటి స్పందనకూడా ఉండదు. కొన్ని సందర్బాల్లో భర్త ఇంతకు ముందు నువ్వు ఏం చెప్పావో మరోసారి చెప్పమని అడగవచ్చు. ఆ సమయంలో బహుశా భర్త ఇతర ఆలోచనలలో ఉన్నాడని, తాను ఇంతకు ముందు చెప్పిన విషయాలను తన భర్త వినలేదని అతని భార్య అర్థం చేసుకోవాలి.

ఇలాంటి సంఘటనలు ఎదురైనప్పుడు మహిళలకు పెద్ద సమస్య అని చెప్పవచ్చు. స్త్రీలు కూడా భర్త మౌనాన్ని బట్టి నేను చెప్పిన మాటల వినడానికి తన భర్త ఆసక్తి చూపడం లేదని అర్థం చేసుకుంటారు. అలాంటి సమయంలో భార్యలను ఆ విషయం చాలా బాధపెడుతుంది. కానీ అలాంటి పరిస్థితులకు ఎలా స్పందించాలో భర్తకు తెలియకపోవచ్చు. లేదా తన అంతర్గత భావాలను ఎలా వ్యక్తపరచాలో ఆ భర్తకు తెలియకపోవచ్చు.
ఇలాంటి విషయాలు దంపతుల మధ్య చీలికకు కారణమవుతుంది. భర్తల మౌనం వెనుక చాలా కారణాలున్నాయి. పురుషులు ఎలా ఉండాలనే పెద్దగా రూల్స్ లేవు అనే విషయం తెలిసిందే. భర్త మౌనంగా ఉన్నాడని మొదట భర్త అర్థం చేసుకోవాలి తరువాత భర్తను ఆ మూడ్ లో నుంచి బయటకు తీసుకురావడానికి అతని భార్య ప్రయత్నించాలి.
భర్తకు అతని మూడ్ మార్చిన తరవాత భార్య ఇంతకు ముందు ఏం చెప్పాలని అనుకుందో ఆ విషయం నీట్ గా మరోసారి అతనికి చెప్పాలి. అలా చెయ్యకపోతే దంపతుల మధ్య మనస్పర్థలు వస్తే లేనిపోని సమస్యలు ఎదురౌతాయి. భర్త మౌనంగా ఉన్న సమయంలో భార్య తెలివిగా వ్యవహరిస్తే సమస్యలు పెద్దవికాకుండా ఆ సమయ్యలు వెంటనే పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుంది.



Click it and Unblock the Notifications