Latest Updates
-
Powerful Krishna Mantras: కృష్ణాష్టమి నాడు ఈ మంత్రాలు జపిస్తే.. మీ కోరికలన్నీ ఇట్టే నెరవేరుతాయి! -
యదా యదా హి ధర్మస్య.. శ్రీకృష్ణుడి స్ఫూర్తితో మీ బంధుమిత్రులకు జన్మాష్టమి శుభాకాంక్షలు చెప్పండిలా! -
బుధ గ్రహ గోచారం: అదృష్టం అంటే వీరిదే.. సెప్టెంబర్ 7 నుంచి ఈ నాలుగు రాశుల వారికి గోల్డెన్ డేస్.! -
కృష్ణాష్టమి స్పెషల్ అటుకులు నువ్వుల లడ్డూ..10 నిమిషాల్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
కృష్ణాష్టమి స్పెషల్: కన్నయ్య మనసు దోచే అటుకుల పాయసం..ఇంట్లోనే చేయండిలా -
మగవారూ అలర్ట్ : మూత్రం పోశాక కూడా చుక్కలు కారుతున్నాయా? ఈ 3 వ్యాధులకు సంకేతం కావచ్చు! -
ఈ కృష్ణాష్టమికి ఇంట్లోనే.. 100% పవిత్రమైన పంచామృత కేక్ తయారు చేయండిలా! -
రోడ్ సైడ్ స్టైల్ ఎగ్ శార్వా..చపాతీ, దోశ, పరోటాల్లోకి అమృతంలా! -
గ్యాస్, అజీర్తి అని ట్యాబ్లెట్లు వేసుకుంటున్నారా? ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ముప్పు కావచ్చు, జాగ్రత్త! -
ఆడవారైనా, మగవారైనా అస్సలు తాగకూడని డ్రింక్ ఏంటో తెలుసా.. డాక్టర్ సలహా ఇదే.!
భార్య చెబితే నో అంటారు..స్నేహితురాలు చెప్తే ఎగేసుకెళ్లారు..భర్తల వింత ప్రవర్తన వెనుక 5 రహస్యాలు
ఏమండీ కాస్త సరదాగా బయటకి వెళ్దామా అని భార్య అడిగితే ఇప్పుడేనా తర్వాత చూద్దాంలే అనే భర్త..అదే స్నేహితురాలు ఒక కాఫీ తాగుదామా? అనగానే క్షణం కూడా ఆలోచించకుండా వెంటనే వస్తున్నా అని అంటాడు. తనకు ఎంత అర్జెంట్ పని ఉన్నా దాన్ని వదిలేసి స్నేహితురాలు పిలిచిందని వెళ్లిపోతారు. చాలా ఇళ్లలో ఇది సర్వసాధారణంగా కనిపించే దృశ్యం. వైవాహిక జీవితంలో భార్య మాటను తేలికగా తీసుకునే భర్తలు..అదే స్నేహితురాలి చిన్న కోరికను కూడా ఆజ్ఞగా భావించి నెరవేర్చడానికి ఎందుకు ఉత్సాహం చూపిస్తుంటారో తెలుసా?
కొత్తలో వింత.. పాతలో రోత
ఏ బంధమైనా కొత్తగా ఉన్నప్పుడు దానిలో ఒక తెలియని ఆకర్షణ, ఉత్సాహం ఉంటాయి. స్నేహితురాలితో బంధం సరిగ్గా అలాంటిదే. ప్రతి మాట, ప్రతి కలయిక ఒక కొత్త అనుభూతిని పంచుతుంది. ఆ మాయలో ఆమెను నిరాశపరచకూడదనే తపనతో మగాళ్లు ఆమె చెప్పిన దేనికైనా యస్ అనేస్తారు. అదే భార్యతో ఏళ్ల తరబడి కలిసి జీవించడం వల్ల ఆ కొత్తదనం స్థానంలో ఒక రకమైన అలవాటు, దినచర్య వచ్చి చేరతాయి. బంధం బలపడినా, ఆరంభంలో ఉన్న ఆ ఉత్సాహం సాధారణమైపోతుంది. దీంతో ప్రతిదానికీ వెంటనే స్పందించాల్సిన అవసరం లేదనే భావన కలుగుతుంది.

ఆమె మెప్పు పొందాలనే తపన
మగాళ్లు తమ స్నేహితురాలి ముందు తమ ఇమేజ్‌ను కాపాడుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తారు. ఆమె దృష్టిలో తానొక హీరోలా కనిపించాలని, తన విలువ తగ్గకూడదని భావిస్తారు. అందుకే ఆమె కోరికను నిరాకరిస్తే ఎక్కడ ఆ బంధం దెబ్బతింటుందో, ఆమెకు తనపై అపనమ్మకం కలుగుతుందోనని భయపడతారు. అయితే వివాహ బంధం విషయంలో భర్తలకు ఆ భయం ఉండదు. పెళ్లి అనేది ఒక బలమైన పునాది అని, చిన్న చిన్న విషయాలకు అది కూలిపోదని వారికి తెలుసు. ఆ భద్రతా భావమే కొన్నిసార్లు భార్య మాటను తేలికగా తీసుకునేలా చేస్తుంది.
బాధ్యతల బరువు,ప్రేమ
స్నేహితురాలి కోరికలు చాలా సరళంగా, ఆనందాన్నిచ్చేవిగా ఉంటాయి. సినిమా, ఒక డిన్నర్ డేట్, గిఫ్ట్ వంటివి పురుషులకు ఒత్తిడిని తగ్గించి, ఆహ్లాదాన్ని పంచుతాయి. కానీ భార్య అంచనాలు అలా ఉండవు. ఇంటి బాధ్యతలు, పిల్లల భవిష్యత్తు, ఆర్థిక ప్రణాళికలు వంటి గంభీరమైన విషయాలతో ముడిపడి ఉంటాయి. దాంతో భర్తలకు స్నేహితురాలితో సంభాషణలు శృంగారభరితంగా అనిపిస్తే, భార్య సంభాషణలు బాధ్యతల బరువుగా తోచి వాటిని దాటవేయాలని చూస్తారు.

స్వేచ్ఛ అనే ప్రపంచం
స్నేహితురాలితో ఉన్నప్పుడు పురుషులు ఎలాంటి హద్దులు, బాధ్యతలు లేకుండా స్వేచ్ఛగా ఫీల్ అవుతారు. అక్కడ వారు కేవలం ఒక వ్యక్తిగా ఉంటారు. ఈ స్వేచ్ఛ వారికి మానసిక ఉపశమనాన్ని ఇస్తుంది. అదే వైవాహిక జీవితంలో కుటుంబం, బంధువులు, సమాజం వంటి అనేక కట్టుబాట్లు ఉంటాయి. ఈ బాధ్యతల వలయంలో ఉన్నప్పుడు భార్య చెప్పే ప్రతి మాటకు తల ఊపడం కష్టంగా భావిస్తారు.
అతి చనువు.. బంధానికి చేటు
భార్య ఎలాగూ అర్థం చేసుకుంటుందిలే..ఈరోజు కాకపోతే రేపు ఒప్పిస్తానులే అనే ధీమా వచ్చేస్తుంది. ఈ అతి చనువు, అతి విశ్వాసం వల్ల ఆమె కోరికలను వాయిదా వేసినా ఫర్వాలేదనుకుంటారు. కానీ స్నేహితురాలి విషయంలో అంత రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడరు. బంధం ఇంకా సున్నితంగా ఉన్న దశలో చిన్న పొరపాటు కూడా దూరాన్ని పెంచుతుందని భయపడతారు. అందుకే వెంటనే ఆమె కోరికను నెరవేర్చడానికి సిద్ధపడతారు.



Click it and Unblock the Notifications