Latest Updates
-
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే!
పెళ్లైన వెంటనే ఆర్థిక సమస్యలా? అందుకు అతి పెద్ద కారణాలు, ఇలాంటి తప్పలు ఎప్పటికీ చేయొద్దు..
వివాహం అనేది జీవితంలో ఒక ఒక మధుమైన అనుభూతి అదే విధంగా ఒక ముఖ్యమైన మలుపు కూడా. ఇది వరకు బ్యాచులర్స్ గా ఉన్నవారు వివాహ బంధంతో ఒకటి అవుతారు. ఇందులో ఇద్దరు వ్యక్తులు తమ జీవితాన్ని కలిసి గడపడానికి సంప్రదాయ బద్దంగా జరుపుకునే ఒక వేడుక, అంతటితో ముగిస్తే బాగుటుంది. ఇక అక్కడ కదా అసలు జీవితం ప్రారంభం అయ్యేది. ఎందుకంటే అప్పటి వరకు అమ్మానాన్న ముద్దుగా గారాభంగా పెరిగిన వారు ఇక కొత్త మనుషులు, కొత్త భాద్యతలను చేపటబోయే సమయం. పెళ్లి తంతు ముగిసిన తర్వాత కొంత మంది వ్యక్తిగత జీవితాన్ని ఎంపిక చేసుకుంటారు. అందులో ఎన్నో బాధ్యతలు ఉంటాయి. ముఖ్యంగా ఆర్థిక పరిస్థితి.
కొంత మంది జంటలు వివాహం తర్వాత డబ్బు కొరతను ఎదుర్కోవల్సి వస్తుంది. ఇలాంటి సమయంలో ఆందోళన పెరుగుతుంది. చేతిలో సరిపడా డబ్బు లేకపోతే అనేక సమస్యలు ఎదుర్కోవల్సి వస్తుంది. దీనంతటీకి ముఖ్యమైన కారణాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

1. డబ్బుల విషయంలో ప్లానింగ్ లేకపోవడం
వివాహానికి ముందు చాలా మంది జంటలు పెళ్ళికి ముందు జరిగే కొన్ని ముఖ్యమైన వేడుకలకనీ కొంత డబ్బును బడ్జెట్ వేసుకుంటారు. అందులో బ్యాచులర్ పార్టీస్ , హల్దీ వేడుక, మెహందీవేడుక, పెళ్లి రోజు, వివాహ వేడుక, రిసెప్షన్ మరియు అతిథుల కోసం చాలా ప్లాన్ చేస్తారు, కానీ వారు వేసుకున్న బడ్జైట్ ను మించిపోవడంతో ఊహించని విధంగా తమకు తెలియకుండానే డబ్బు ఖర్చు చేస్తారు, ఇది వివాహం తర్వాత వారిని తీవ్రంగా దెబ్బతీస్తుంది.
2. పెళ్లి ఖర్చులపై ఒత్తిడి
ఈ రోజుల్లో వివాహానికి బారీగా ఖర్చు చేస్తుంటారు. పెళ్లి ప్రారంభం కాక ముందునుండే చాలా డబ్బు నీళ్ళులా ఖర్చు అవుతుంటాయి. కళ్యాణ మంటపాలకనీ, బట్టలు, జ్యువలరీస్, క్యాటరింగ్, ఫోటో గ్రపీ, బ్యూటీషియన్లు, కట్నంగా ఇచ్చుపుచ్చుకునే వ్యవహారాల వల్ల ఆర్థిక పరిస్థితిని బాగా ప్రభావితం చేస్తారు. ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఘనంగా పెళ్ళి చేసుకోవాలని కోరుకునే వారు ముందస్తుగా లోన్ లేదా పొదుపు నుండి కొంచెం డబ్బు తీసుకుంటుంటారు. కొంత మంది అప్పు కూడా చేయాల్సి వస్తుంది. ఇవన్నీ పెళ్ళి తర్వాత వైవాహిక జీవితంపై ఖర్చులు భారం పెరిగి డబ్బు కొరత ఏర్పడుతుంది.
3. హనీమూన్ ఖర్చులు
ఇక పెళ్లి తర్వాత హానీమూన్ వెళ్ళడం సర్వసాధారణం. దీని కోసం కూడా బారీ మొత్తంలో డబ్బు ఖర్చుచేయాల్సి వస్తుంది. వెళ్ళే ప్రదేశాలను బట్టి ప్రయాణపు ఖర్చులు, హోటల్ ఖర్చులు మరియు ఫుడ్ ఖర్చులు ఇతర కార్యకలపాల ఖర్చులు జంటల యొక్క ఆర్థిక పరిస్థితిని ప్రభావితం చేస్తాయి. హానీమూన్ కోసం వెళ్ళినప్పుడు కొత్తగా జంటలకు ఎందులోనూ రాజీపడాల్సిన అవసరం ఉండదు, అప్పుడు అదనంగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. అది మీ బడ్జెట్ ను పాడు చేస్తాయి.
4. కొత్త ఇల్లు మరియు ఇంటికి కావాల్సినవి
పెళ్లి తర్వాత భాద్యత మరింత పెరుగుతుంది. ఉద్యోగస్తులు ఇతర ప్రదేశాల్లో ఉద్యోగం చేయాలంటే ఇక కొత్త ఇల్లు కొనాలి లేదా కట్టుకోవాలి. అదే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అద్దె ఇంట్లో ఉండాల్సి వస్తుంది. ఏ ఇంట్లో ఉన్నా సంతోషంగా జీవించడానికి ఇంట్లో మినిమం ఉండాల్సిన వస్తువులు తప్పనిసరిగా కొనుగోలు చేస్తారు. ఇవి కాకండు ఇంటిని అందంగా తీర్చుదిద్దుకోవడం కోసం పునర్నిర్మాణం మరియు రిపేరీలు వంటి వాటికి అదనపు డబ్బు ఖర్చుచేయాల్సి వచ్చినప్పుడు ఆర్థికంగా డబ్బ కొరతతో ఒత్తిడి ఎదుర్కోవల్సి వస్తుంది.
5. బాధ్యతలు పెరుగుతాయి
వివాహం తర్వాత కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. ఇప్పటి వరకు అమ్మనాన్న మధ్య పెరినవారు, పెళ్లి తర్వాత బాధ్యతగా వ్యవహరించాల్సి ఉంటుంది. పరిస్థితులు డిఫరెంట్ గా ఉంటాయి. ఇంటి బాధ్యతలు తీసుకోవల్సి వస్తుంది. ఇది ఎంతో కొంత ఆర్థిక పరిస్థితిని దిగజార్చుతుంది. దాంతో వారు ఆర్థికంగా మానసిక సంక్షోభాన్ని ఎదుర్కొంటారు.
పెళ్లి తర్వాత డబ్బు మస్యలు ఎదుర్కోకుండా బడ్జెట్‌ను ఎలా ప్లాన్ చేసుకోవాలి
1. మీ ఆదాయం మరియు మీ ఖర్చులను బట్టి బడ్డెను రూపొందించుకోండి.
చదువు తర్వాత కెరీర్ ను మొదలు పెట్టినప్పటి నుండే కొంత డబ్బును పొదుపు చేస్తూ, ఖర్చులను తగ్గించుకోండి. అనవసరమైన ఖర్చుల జోలికి వెళ్ళకూడదు. ఫ్రెండ్స్, పార్టీలు, ట్రిప్పులు అంటూ అనవసర ఖర్చుల జోలికి పోకూడదు. మీకు వచ్చే సంపదానలో ఎంతో కొంత మీ భవిష్యత్ ప్రనాళికల కోసం పొదుపుచేసుకోవాలి. ఈ ప్రణాళికి వివాహం తర్వాత కూడా వర్తిస్తుంది.
2. పొదుపులు మరియు పెట్టుబడులు
వివాహం తర్వాత మీ ఆదాయాన్ని బట్టి పెట్టుబడులు, పొదుపులపై ద్రుష్టి పెట్టండి. ఉదాహరణకు మీకు వచ్చే ఆదాయంలో సంగం ఖర్చులు, అద్దె, నెల ఖర్చు, నిత్యవసర వస్తువులుకు ఖర్చు చేయండి. ఇక మిగిలిన సగంలో సగం పొదపు చేయండి, బ్యాంక్ లో ఫిక్స్డ్ చేయడం లేదా ఆర్టిజియస్ చేయడం వడ్డి వచ్చేలా ప్లాన్ చేసుకోండి. మిగిలిన బాగం భవిష్యత్ ఆరోగ్యం , అత్యవసర పరిస్థితులను ఎదుర్కోవడానికి హెల్త్ ఇన్యూరెన్స్, పాలసీలు వంటివి ప్లాన్ చేసుకోవాలి. ఇలాంటివి మీరు భవిష్యత్ లో ఆర్థిక సంక్షోభం ఎదుర్కోకుండా చేస్తుంది.
4. బ్యాంక్ రుణాలు , లేదా ఇతరు వద్ద అప్పులు చేయడం మానుకోండి
వివాహం ముందు లేదా తర్వాత కానీ అప్పులు చేయాల్సి వస్తే దానికి తగ్గట్లుగా ముందుగానే ప్లాన్ చేసుకోండి. అత్యవసర పరిస్థితుల్లో తప్ప లోన్ కానీ, అప్పుకానీ చేయకూడదు. వీటితో వడ్డి భారం పడి ఆర్థికంగా మరింత ఒత్తిడికి గురికావాల్సి ఉంటుంది.
5. ఇద్దరి ఆదాయం ప్రణాళిక ప్రకారం ఉండేలే చూసుకోండి
ఒక వేళ ఇద్దరు సంపాదిస్తున్నట్లైతే కూర్చొని మాట్లాడుకుని, బాధ్యతలను ఇద్దరూ సమంగా తీసుకోండి. అందుకు సరైన ప్రణాళికను అనుసరించండి. దాంతో భవిష్యత్తులో డబ్బు కొరత ఉండదు



Click it and Unblock the Notifications











