Latest Updates
-
ఈరోజు సిద్ధి యోగం: ఈ రాశుల వారికి అదృష్టం, ఆర్థిక లాభాలు ఖాయం! -
స్లోవేకియా స్పీకర్ కు ప్రధాని మోదీ గిఫ్ట్ గా ఇచ్చిన బీహార్ స్పెషల్ థేకువా..మీ ఇంట్లోనే చేసుకోండిలా.. -
బుధాదిత్య యోగం: ఈ రాశుల వారికి జూన్ 22 వరకు తిరుగేలేదు, భారీ లాభాలు ఖాయం! -
ఆ పురాతన దేవాలయంలో 500 సంవత్సరాలుగా ఒకే పొయ్యి మీద వండుతున్న ప్రసాదం -
సింహరాశిలోకి చంద్రుడి ప్రవేశం: ఈ రాశుల వారికి అదృష్టం, ఆత్మవిశ్వాసం రెట్టింపు కాబోతోంది! -
సింహం, ధనుస్సు రాశుల వారికి రాజయోగం.. శని దేవుని అనుగ్రహం ఎవరికి? - శనివారం, 20 జూన్ 2026 -
అష్టమి తిథిఎందుకు అంత శక్తివంతమైనది? -
మునగాకు నువ్వుల పచ్చడితో ఎముకలు ఉక్కుగా మారాల్సిందే.. సింపుల్‌గా ఇలా చేసేయండి.! -
పట్టులా మెరిసే జుట్టు కోసం ఇంట్లోనే హెయిర్ కండిషనర్.. చిటికెలో ఇలా చేసేయండి.? -
అదే పనిగా స్మార్ట్‌ఫోన్ చూస్తున్నారా.. డ్రై ఐ సిండ్రోమ్కి దారి తీసే లక్షణాలివే.!
Relationship Tips: శృంగారం రాత్రి కంటే ఉదయమే బాగుంటుందట! ఎందుకో తెలుసా?
శృంగారంతో సుఖంతో పాటు చాలా ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉంటాయి. తరచూ లైంగిక చర్యల్లో పాలుపంచుకునే వారికి నిద్ర కూడా బాగా పడుతుంది. వారంలో రెండుసార్ల కంటే ఎక్కువగా సెక్స్ లో పాల్గొనే మగవారికి గుండెపోటు బారిన పడే అవకాశం చాలా తక్కువని అధ్యయనాలు చెబుతున్నాయి.

సుఖానికి సుఖం, ఆరోగ్యానికి ఆరోగ్యం అందించే శృంగారాన్ని కొంత మంది పలు కారణాల వల్ల దూరం పెడుతుంటారు. ఆఫీసు పని ఒత్తిడి, లేట్ నైట్స్ వరకు పని వేళల వల్ల రాత్రుళ్లు శృంగారం పాల్గొనరు. అలాగే ఎప్పుడు ఒకేరకంగా శృంగారాన్ని ఆస్వాదిస్తుంటే కొన్ని రోజులకు అది బోర్ కొట్టేస్తుంది.
మీరు కూడా అలాంటి సమస్యతోనే శృంగారానికి దూరమైతే ఇప్పుడు కొద్దిగా కొత్తగా ప్రయత్నించి చూడండి. అదే ఉదయం పూట శృంగార కార్యకలాపాల్లో నిమగ్నమవ్వండి. ఉదయం పూట శృంగారం చేయడం వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
అధిక శక్తి:
సాధారణంగా ఎవరైనా రాత్రి పూట కంటే ఉదయం పూట చాలా చురుకుగా ఉంటారు. కంటి నిండా నిద్రపోయిన తర్వాత శరీరానికి అవసరమయ్యే శక్తిని తిరిగి పొందుతుంది. అలా ఉదయం పూట మరింత ఎనర్జిటిక్ గా ఉన్నట్లు అనిపిస్తుంది. పని వల్ల సరిగ్గా నిద్రలేని వారు రాత్రుళ్లు నిద్రకు కేటాయించి తెల్లవారుజామున శృంగారానికి కేటాయించండి.
హార్మోన్ల మార్పులు:
సంతృప్తికరమైన లైంగిక జీవితానికి టెస్టోస్టెరాన్ హార్మోన్ అవసరం. టెస్టోస్టెరాన్ హార్మోన్ స్థాయిలు పురుషులు, మహిళలు ఇద్దరిలో ఉదయం ఎక్కువగా ఉంటాయి. ఇది లిబిడో, లైంగిక కోరికను పెంచుతుంది. ఈ సమయంలో శృంగారం చాలా మజాను అందిస్తుంది. దంపతులు ఇద్దరూ ఉత్సాహంగా ఉన్న సమయంలో శృంగారం కోసం లూబ్రికేషన్ తో సమస్య ఉండదు.
రిఫ్రెష్మెంట్:
రాత్రంతా కంటి నిండా నిద్ర పోయాక ఉదయం చాలా రిఫ్రెష్‌గా అనిపిస్తుంది. ఇది సానుకూల మానసిక స్థితిని సృష్టిస్తుంది. లైంగిక సాన్నిహిత్యాన్ని అనుభవించే అవకాశాన్ని పెంచుతుంది. మార్నింగ్ సెక్స్ వారి లైంగిక జీవితంలో జంటలను పునరుజ్జీవింపజేస్తుంది.
ప్రశాంతత:
ఉదయం పూట కొద్దిగా ముందుగా నిద్ర లేవగలిగితే ప్రశాంత సమయాన్ని ఎక్స్‌పీరియన్స్ చేయవచ్చు. రోజంతా బిజీగా ఉండటానికి ఈ సమయం కొంత ప్రశాంతతను అందిస్తుంది. లైంగిక సాన్నిహిత్యాన్ని అనుభవించే అవకాశాన్ని పెంచుతుంది.
మంచి ప్రారంభం:
భాగస్వామితో సెక్స్ చేయడం ద్వారా రోజును ప్రారంభించడం కంటే కూడా మంచి ప్రారంభం మరొకటి ఉండదు. సుఖాన్ని, సంతృప్తిని అందించే శృంగారం వల్ల మనసుకు కూడా మంచి అనుభూతి కలుగుతుంది. ప్రారంభం మంచిదైతే సగం పని పూర్తయినట్లే అనే పెద్దల మాట మార్నింగ్ సెక్స్‌కు సరిగ్గా సరిపోతుంది. ఈ భావాలు మీకు రోజును సరిగ్గా ప్రారంభించడంలో సహాయపడతాయి. మిగిలిన రోజంతా అదే మూడ్‌లో గడపొచ్చు.
సెక్స్ లో పాల్గొంటే ఒత్తిడి తగ్గుతుంది. మానసికంగా మీరు ప్రశాంతంగా ఉంటారు. మార్నింగ్ సెక్స్ చేయడం వల్ల ముందు రోజు ఒత్తిడి దూరమై రోజును ఉత్సాహంగా ప్రారంభించవచ్చు. తరచూ సెక్స్ లో పాల్గొనే వారు ఎలాంటి ఒత్తిళ్లకు లోనుకాకుండా ఉంటారని కొన్ని పరిశోధనల్లో తేలింది. చాలా సంతోషకరంగా ఉంటారని వెల్లడైంది.



Click it and Unblock the Notifications