Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
Couples Separate Bank accounts : భార్యా భర్తలిద్దరికీ సెపరేట్‌గా బ్యాంక్ అకౌంట్..?
భార్యా భర్త లిద్దరూ కలిసి జీవన సముద్రంలో ఈదుతుంటారు. సుఖదుఖాలన్నీ కూడా కలిసే అనుభవిస్తారు. డబ్బు విషయంలో, ఇంటి విషయంలో, ఆహార విషయంలో, పిల్లల విషయంలో కలిసే నిర్ణయం తీసుకుంటారు. అలాంటి పరిస్థితిలో కొత్తగా కొన్ని నియమాలను మేధావులు సూచిస్తున్నారు. భార్యా భర్తలిద్దరికి వేరువేరుగా బ్యాంక్ అకౌంట్లు ఉండాలని అంటున్నారు.
ఇలా వేరువేరుగా బ్యాంక్ అకౌంట్లు ఉండడం వల్ల సమస్యలను ఎదుర్కొంటారని పలువురు చెబుతున్నా, మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉందని అంటున్నా ఇలా చేయడం వల్ల వారికే అనేక లాభాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.
వ్యక్తిగతంగా ఏర్పరుచుకున్న లక్ష్యాలను నెరవేర్చుకోవడానికి
భార్యా భర్తలిద్దరికీ అభిప్రాయాలు ఒకటే అయినా వారి అభిరుచుల్లో కొంత విభిన్నంగా ఉండవచ్చు. వారికి ఉన్న హాబీలు, లక్ష్యాలు ప్రత్యేకంగా ఉంటాయ్. వాటిని సాధించడానికో లేక అనుభవించడానికో వారికి ప్రత్యేకంగా ఎవరిది వారికి బ్యాంక్ అకౌంట్ ఉండాలని సూచిస్తున్నారు.

ఖర్చుల్లో గొడవ
ఇరువరికీ ఖర్చుల్లో గొడవలు రాకుండా కూడా ఈ సెపరేట్ బ్యాంక్ అకౌంట్లు మేలు చేస్తాయంటున్నారు. వేరుగా బ్యాంక్ అకౌంట్లు ఉంటే, ఎవరు ఏ ఖర్చులు చేశారో స్పష్టం తెలిసిపోతుంది. దీంతో ఇద్దరి మధ్య ఖర్చు విషయంలో గొడవలు తలెత్తవు.
కష్టాలను ఎదుర్కోవడానికి
ప్రస్తుతం బయట ఎలాంటి పరిస్థితులైనా ఎదురుకావచ్చు. ఉద్యోగం పోవడమో, డబ్బు పోగొట్టుకోవడమో, అనుకోని భారీ ఖర్చు వచ్చు మీదపడ్డమో జరగవచ్చు. అలాంటి పరిస్థితుల్లో ఈ సెపరేట్ బ్యాంక్ అకౌంట్లు మేలు చేస్తాయంటున్నారు. ఒకరి దగ్గర డబ్బులు ఖర్చైనా ఇంకొకరి దగ్గర ఉంటాయి కాబట్టి ఆర్థిక సమస్యలను ఎదుర్కొనే అవకాశం తక్కువగా ఉంటుంది.
గుర్తింపు
ఇద్దరి మధ్య వైషమ్యాలు వచ్చినప్పుడు వాటిని తగ్గించుకోవడానికి కూడా ఉపయోగపడతాయ్. ఇద్దరి ఆత్మగౌరవాన్ని కాపాడే పరిస్థితి కూడా ఉంటుంది. ఎవరి అకౌంట్ల నుంచి ఎంత డబ్బు వెళ్లిందనే విషయాలు స్పష్టం కళ్లముందంటుంది కాబట్టి సమస్యలు రావు.
ఖర్చులపై అదుపు
ఆర్థిక అంశాల్లో ఇద్దరూ మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తారు. చూసి ఖర్చులు పెడతారు. ప్రతీ లెక్క కళ్ల ముందుంటుంది. ఎవ్వరు అనవసర ఖర్చులు చేసిన పక్కాగా తెలిసిపోతుంది కాబట్టి భార్యా భర్తలిద్దరికీ సెపరేట్ అకౌంట్లు మంచివేనంటున్నారు.



Click it and Unblock the Notifications