Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
మీ ఆవిడ ఎక్కువగా నిద్రపోతుందా? సైన్స్ చెప్పిన షాకింగ్ నిజం!
పొద్దున లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్రపోయే దాకా మన ఇళ్లల్లోని స్త్రీలు ఒక మెషీన్ లా కంటిన్యూగా పనిచేస్తూనే ఉంటారు. అమ్మగా, భార్యగా, కూతురిగా, ఉద్యోగినిగా ఎన్నో పాత్రలను ఏకకాలంలో పోషిస్తూ ఇంటిని ఒక గాడిన పెడతారు. అయితే రోజంతా ఇంట్లోనే ఉన్నా లేదా మీతో పాటే ఆఫీసు పని చేసినా, సాయంత్రానికి మగవారికంటే ఎక్కువగా అలసిపోతున్నారని మీరు ఎప్పుడైనా గమనించారా? అబ్బా నీరసంగా ఉంది అని వారు అన్నప్పుడు..ఏం చేశావని అంతగా అలసిపోయావు? అని తేలికగా తీసిపారేస్తున్నారా? అయితే మీరు కచ్చితంగా ఈ విషయం తెలుసుకోవాలి. ఇది కేవలం మాట కాదు దీని వెనుక బలమైన శాస్త్రీయ కారణం ఉంది.
మగవాళ్ల కంటే ఆడవాళ్లకే ఎక్కువ నిద్ర అవసరం అని మీకు తెలుసా? ఇది సైన్స్ చెబుతున్న నిజం. ఆడవాళ్ల బుర్రలో మల్కీ టాస్కింగ్ చేస్తుంటాయని ప్రముఖ ఫ్యామిలీ కౌన్సిలర్, సైకాలజిస్ట్ విజయ పెద్దిన చెప్పారు. అదేవిధంగా వాళ్ల హార్మోన్ల మార్పులు, బుతుక్రమం, ప్రెగ్నెన్సీ, డెలివరీ వీటన్నిటితో పాటు జర్నీ స్ట్రగులింగ్ కూడా కొద్దిగా ఎక్కువ ఉంటదని చెప్పారు. ఇంటిని మేనేజ్ చెయ్యడం, పిల్లల్ని చూసుకోవడం, జాబ్ ఉంటే అది చేయడం ఉంటది కాబట్టి మగవాళ్లతో పోల్చితే ఆడవాళ్ల బ్రెయిన్ మల్టీటాస్కింగ్ ఎక్కువ చేస్తుంటది.

ఉదయం టిఫిన్ ఏం చేయాలి అనే ఆలోచనతో మొదలై, పిల్లల హోంవర్క్, ఆఫీస్ ప్రజెంటేషన్, సాయంత్రం కూరగాయలు తేవాలన్న విషయం, ఇంట్లో జరగబోయే ఫంక్షన్.. ఇలా ఒకేసారి వారి మెదడులో ఎన్నో ఆలోచనలు మెదులుతుంటాయి. ఈ నిరంతర మానసిక శ్రమ, వారి మెదడు శక్తిని ఎక్కువగా వినియోగించుకుంటుంది. అందుకే వారికి శారీరక శ్రమతో పాటు మానసిక అలసట కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వాళ్లకు కనీసం ఒక అరగంట మగవాళ్ల కన్నా ఎక్కువ నిద్ర అవసరం అనేది సైన్స్ చెబుతోంది.
కాబట్టి ఈసారి ఎప్పుడైనా మీ ఆవిడ కానీ లేదా మీ అమ్మగారో లేదా మీ అమ్మాయి అబ్బా నేను అలసిపోయాను అన్నప్పుడు కాస్త వాళ్లకు రెస్ట్ తీసుకోనివ్వాలి. అలా కాకుండా ఏం చేశారని ఇంత అలసిపోయారు..ఇంట్లోనే కూర్చున్నారుగా అని అనవద్దు అని విజయ పెద్దిన సూచించారు. వాళ్లను అర్థం చేసుకొని వాళ్లకు రెస్ట్ ఇవ్వడానికి ట్రై చేయాలని సూచించారు. వారి కంటికి కనిపించని శ్రమను, వారి మానసిక ఒత్తిడిని అర్థం చేసుకోండి. కాసేపు విశ్రాంతి తీసుకో, నేను చూసుకుంటాలే అనే ఒక్క మాట వారికి ఎంతో ఉపశమనాన్ని ఇస్తుంది. వారికి అవసరమైన విశ్రాంతిని ఇవ్వడం ద్వారా మీరు వారికి ప్రేమను, గౌరవాన్ని పంచుతున్నారని గుర్తుంచుకోండి. వారి ఆరోగ్యం, మీ కుటుంబ ఆనందానికి పునాది.



Click it and Unblock the Notifications