Latest Updates
-
స్త్రీల శరీరంలో అత్యంత సున్నితమైన భాగాలు.. ఇక్కడ తాకితే మీ రాత్రి రసవత్తరమే! -
కరకరలాడే చిట్టి మురుకులు..పెద్దలకే కాదు, పిల్లలకు కూడా భలే నచ్చేస్తాయి..ఈజీగా చేసుకోండిలా.. -
ఈ పిండితో చేసిన రోటీ, చపాతీలు తింటే షుగర్ లెవల్స్ పెరగవు, ఫ్యాటీ లివర్ దరిచేరదు! -
‘ప్రొబేషన్ ముగిసినా ఆఫర్ లెటర్ లేదు.. ఇలాంటి కాల్ వస్తుందని ఊహించలేదు’- యువతి వైరల్ వీడియో.! -
ఈ ఐదు ఇంటి చిట్కాలను ప్రయత్నించారంటే.. ఇక జుట్టుకి హెయిర్ డైలు పూయడం ఆపేస్తారు.! -
రిలేషన్షిప్లో మహిళలు నిజంగా ఏం కోరుకుంటారు.. టాప్ 5 సీక్రెట్స్ ఇవే.! -
నోరూరించే స్వచ్ఛమైన పాలకోవా.. కేవలం 3 పదార్థాలతో మీ ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
సంతానోత్పత్తికి అడ్డంకిగా ఫెలోపియన్ ట్యూబ్స్ బ్లాకేజీ.. మహిళల్లో ఈ సమస్యను ఎలా నివారించాలి.! -
ఎటు చూసినా కష్టాలేనా? ఈ పవర్ ఫుల్ మంత్రాలు చదివితే లైఫ్ ఛేంజ్! -
ప్రపంచ మెదడు దినోత్సవం.. బ్రెయిన్ హెల్త్‌కి, విటమిన్ బి1కి సంబంధం ఉందా.. ఈ లక్షణాలు కనిపిస్తే చాలా డేంజర్.!
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా?
ప్రతిసారీ కొత్త పరిచయం.. మొదట్లో అంతా అద్భుతంగానే అనిపిస్తుంది. కానీ కొన్నాళ్లకే మళ్లీ అదే పాత కథ.. భాగస్వామి ప్రవర్తనలో మార్పు రావడం, అర్థం చేసుకోకపోవడం, చివరకు ఆ బంధం ముగిసిపోయి గుండె పగిలిపోవడం.
ఇలా మీ జీవితంలో పదే పదే జరుగుతుంటే.. నా అదృష్టమే చెడ్డది, నాకు మంచి వారు దొరకరు అని మీరు బాధపడుతున్నారా? అయితే సైకాలజీ ప్రకారం, దీనికి కారణం మీ అదృష్టం కాదు.. మీ మనస్తత్వం, ముఖ్యంగా మీ బాల్య అనుభవాలేనని నిపుణులు చెబుతున్నారు.

బాల్యమే ప్రేమకు పునాది
మన చిన్నతనంలో మన కుటుంబంలో చూసిన వాతావరణమే, మన భవిష్యత్తు సంబంధాలకు ఒక బ్లూ ప్రింట్ గీస్తుంది. ఇంట్లో తల్లిదండ్రుల మధ్య ప్రేమ, గౌరవం, ఒకరినొకరు అర్థం చేసుకోవడం చూసి పెరిగిన పిల్లలు, పెద్దయ్యాక తమ భాగస్వామిలోనూ అవే లక్షణాలను వెతుకుతారు.
కానీ నిరంతరం గొడవలు, ఎడబాటు లేదా ప్రేమ కరువైన వాతావరణంలో పెరిగితే.. తెలియకుండానే భవిష్యత్తులో అలాంటి సంక్లిష్టమైన సంబంధాలవైపే ఆకర్షితులవుతారు. చిన్నప్పుడు నిర్లక్ష్యానికి గురైన వాళ్లు పెద్దయ్యాక తమను సరిగ్గా పట్టించుకోని భాగస్వాముల వెంట పడుతూ నేను కొంచెం సర్దుకుపోతే అంతా సెట్ అవుతుంది అనే భ్రమలో బతుకుతుంటారు.
గందరగోళమే పరిచయమైనప్పుడు..
ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. మన మెదడు ఎప్పుడూ తనకు పరిచయం ఉన్న పరిస్థితులనే కోరుకుంటుంది. బాల్యంలో ఇంట్లో ఎప్పుడూ ఉద్రిక్తతలు, వాదనలు చూసిన వ్యక్తికి.. ప్రశాంతమైన, సంతోషకరమైన ప్రేమ చాలా వింతగా, బోరింగ్ గా అనిపిస్తుంది.
కొద్దిగా నాటకీయత, కోపం లేదా భావోద్వేగాలకు దూరంగా ఉండే భాగస్వాములే వారికి తమవారిలా అనిపిస్తారు. ఆ అలవాటు వల్లే వారు పదే పదే తప్పులో కాలు వేస్తుంటారని నిపుణులు చెబుతున్నారు.
ఆత్మవిశ్వాసం లోపించడం
తక్కువ ఆత్మవిశ్వాసం ఉన్నవారు నేను మంచి ప్రేమకు, గౌరవానికి అర్హుడిని కాను అనే అభద్రతాభావంతో ఉంటారు. దీనివల్ల తమను సరిగ్గా చూసుకోని వారిని, అవమానించే వారిని కూడా భరిస్తుంటారు. ఇది ఒక విషవలయం. చెడు సంబంధం వల్ల ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది, ఆ ఆత్మవిశ్వాస లోపం మళ్లీ చెడు సంబంధానికే దారితీస్తుంది.
దీనికి తోడు, పరిచయం అయిన వెంటనే ఎదుటి వ్యక్తిని పూర్తిగా అర్థం చేసుకోకుండానే మానసికంగా తీవ్రంగా అతుక్కుపోవడం కూడా తీవ్రమైన మనస్తాపానికి గురిచేస్తుంది.
మార్పు మీతోనే మొదలవ్వాలి
ఈ విషవలయం నుంచి బయటపడాలంటే.. ముందుగా మీ గత సంబంధాలను ఒకసారి విశ్లేషించుకోండి. మీరు ఎలాంటి వారిని ఎంచుకుంటున్నారో, అందులో ఎలాంటి తప్పులు పునరావృతం అవుతున్నాయో గుర్తించండి. అవసరమైతే స్నేహితులు, కుటుంబ సభ్యులు లేదా మానసిక నిపుణుల సహాయం తీసుకోండి.
గుర్తుంచుకోండి.. మిమ్మల్ని మీరు ప్రేమించుకుని, గౌరవించుకుని, మీకంటూ కొన్ని స్పష్టమైన హద్దులు ఏర్పరచుకున్నప్పుడే సరైన భాగస్వామిని ఎంచుకోగలరు. ప్రేమంటే కేవలం ఆకర్షణ కాదు.. అది నమ్మకం, గౌరవం, అర్థం చేసుకోవడం అనే బలమైన పునాదులపై నిలబడే బంధం అని నిపుణులు చెబుతున్నారు.



Click it and Unblock the Notifications