Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
ఆ వయసులోని భార్య భర్త నుంచి ఏమి కోరుకుంటుందో తెలుసా..?
పెళ్లి చేసుకున్న తరువాత ఆ జంట ఎన్నో కష్టాలను ఎదుర్కొంటారు. కానీ పెళ్ళికి ముందే కొన్ని విషయాలను ఖచ్చితంగా చేసుకోవాలి. ఈ విషయాలు తెలియకపోతే చాలా పెళ్లిళ్లు పెట్టాకులవుతాయ్. భార్య మనసులో ఏముందో భర్తలకు తెలుసుకోవడం అంత సులువైన విషయం ఏమీ కాదు. వారి ఆలోచనలు కొన్ని సార్లు అంతుచ్చిక్కవు. ముప్పై ఏళ్ల వయసు దాటిన ఆడవాళల్లో కొన్ని ప్రత్యేక ఆలోచనలు కోరికలు ఉంటాయ్.
30 ఏళ్ళ తరువాత మహిళల ఆలోచన తీరులో చాలా మార్పు వస్తుంది. దీనికి చాలా కారణాలు ఉంటాయి. ఇలాంటి సమయంలో భార్యలను అర్థం చేసుకోవడం భర్తకు చాలా ముఖ్యం. భర్త ఒక్క డు మాత్రమే ఆమె మనసును అర్థం చేసుకోగలడు. ఇవి పాటిస్తే వైవాహిక జీవితం భార్యతో సంబంధం చాలా బాగుంటుంది.

1. ప్రేమ అనగానే చాలా మంది భర్తలు రొమాన్స్, శృంగారం అని అనుకుంటారు. అలా గనుక అనుకుంటే పప్పులో కాలు వేసినట్టే. దీనిని సరిగ్గా అర్థం చేసుకోకపోతే చాలా గొడవలు మనస్పర్థలు వస్తాయ్. భార్యతో బంధం బాగుంటాలంటే ముందుగా భర్తలు తమ ప్రేమను మనసుతో చూపించడం చేయాలి. ప్రేమ అంటే కౌగిలింతలు, ముద్దులు మాత్రమే కాదని అర్థం చేసుకోవాలి.
2. ఈకాలంలో భార్యలు మహిళలు చాలా మారిపోయారు. ఏ పని చేయాలన్నా తమకు భర్తల అనుమతి అవసరం లేదనే నిర్ణయానికి వచ్చేసారు. స్త్రీలు స్వేచ్చగా తిరగాలనుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో భర్తలు తమ భార్యలకు ఏమి కావాలో అడిగి తెలుసుకోవాలి. వారి మనసులో ఏమి ఉందో అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి.
3. భార్య కు ఏమంటే ఇష్టం ఏదంటే ఇష్టం లేదో అడిగి తెలుసుకోవాలి. బెడ్రూమ్ లో కూడా భార్య ఇష్టా అయిష్టాలను అడిగి తెలుసుకోవాలి. వారితో గొడవపడుతున్నట్టు కాకుండా ప్రేమతో మాట్లాడుతూ వారికి కావలసింది ఏంటో తెలుసుకోవాలి. అప్పుడు మాత్రమే భార్యను పూర్తిగా అర్థం చేసుకోగలరు.

4. భార్యా భర్త మధ్య ఏదైనా గ్యాప్ వస్తే దానికి కారణాన్ని తెలుసుకోవాలి. ఈ సమస్య గురుంచి మనసు విప్పి భార్యతో మాట్లాడాలి. భార్యకు మాట్లాడటం ఇష్టం లేకపోయినప్పటికీ భర్త మాట్లాడాలి. ఈ సందర్భంలో భార్యలో కలిగే మార్పులను గుర్తించి అర్థం చేసుకోవాలి. ఒకవేళ భార్యకు తట్టుకోలేని కోపం వచ్చినా భర్త దానిని అర్థం చేసుకోవాలి.
5. భవిష్యత్తులో భార్యకు ఎలాంటి భరోసాను కల్పిస్తున్నారో చెప్పాలి. ఇది వారిలో ఆత్మస్తైర్యాన్ని తీసుకొని వస్తుంది. భార్యలు తమ భర్తలు తమతో నిత్యం మాట్లాడాలని కోరుకుంటారు. భర్తలు తమ పనుల్లో తాము బిజీగా వుంటారు. కానీ కొంత సమయాన్ని భార్య కోసం కేటాయించి వారికి అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. భార్య చెప్పిన చాలా విషయాలకు భర్తలు అంగీకారం తెలపాలని కూడా భార్యలు అనుకుంటారు.
6. భార్యతో ఎప్పుడూ నవ్వుతూనే సంభాషించాలి. ఉదయం లేవగానే ఐలవ్‌యూ లాంటివి ప్రేమతో చెప్పాలి. ఇది భార్య మూడ్‌ను పూర్తిగా మార్చివేస్తుంది. భార్యను అర్ధం చేసుకోవడం ఇప్పటికి కూడా చాలా మంది భర్తలకు ఒక చాలెంజ్‌గా మారింది. పైన చెప్పిన ఈ పనులన్నింటినీ గనుక సక్రమంగా మీరు నిర్వర్తించగలిగితే మీ వైవాహిక జీవితం సంతోషంగా వుంటుంది.



Click it and Unblock the Notifications