Latest Updates
-
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.!
స్వార్థపరమైన భార్య తన భర్తకు వేసే 5 ఉచ్చులు!
పెళ్లి అంటే నూరేళ్ల బంధం అనేది గతంలో మాట..ఇప్పటి జనరేషన్ లో పెళ్లికి రోజుకో కొత్త అర్థం పుట్టుకొస్తుంది. ప్రజెంట్ జనరుషన్ లో చివరివరకు భార్యాభర్తలు కలిసి ఉండటమంటే అదొక వరల్డ్ వండరే అన్నట్లు పరిస్థితులు వచ్చాయి. ఇటీవల కాలంలో వివాహేతర సంబంధాలు పెరిగి కాపురాలు కూలిపోతున్నాయి. భర్త భార్యను చంపేయడం, భార్య భర్తను చంపేయడం అనేది కామన్ అయిపోయింది.
అయితే బంధంలో ఒకరి స్వార్థం మరొకరి ఉనికినే ప్రశ్నార్థకం చేస్తుంది. ముఖ్యంగా స్వార్థపూరితమైన భార్య తన భర్తను మానసికంగా నియంత్రించడానికి కొన్ని పన్నాగాలను పన్నుతుంది. ఇవి పైకి కనిపించని ఉచ్చులని రిలేషన్ షిప్ కోచ్ పద్మ పావని తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన ఒక వీడియోలో తెలిపారు. అవేంటో ఇక్కడ చూడండి.

అపరాధ భావన అనే ఉచ్చు
భర్త తనకోసం తాను కొద్దిగా టైం కేటాయించుకోవాలనుకున్నా, విశ్రాంతి తీసుకోవాలని ట్రై చేసినా లేదా తనకు ఇష్టం లేని పనికి నో అని చెప్పినా.. వెంటనే భార్య అతన్ని ఒక స్వార్థపరుడిగా చిత్రీకరిస్తుంది. నేను ఇంత కష్టపడుతుంటే, నువ్వు హాయిగా కూర్చుంటావా? వంటి మాటలతో అతనిలో నేర భావనను రేకెత్తిస్తుంది. ఫలితంగా అతను ఇంట్లో గొడవలు ఎందుకులే అని సర్దుకుపోయి తన సంతోషాన్ని తాకట్టు పెట్టి ఆమె చెప్పినట్టల్లా చేస్తూ పోతాడు.
నలుగురిలో నాటకం
ఫ్రెండ్స్, చుట్టాల ముందు మా ఆయన బంగారం, నన్ను చాలా బాగా చూసుకుంటాడు అని గొప్పగా పొగుడుతుంది. కానీ ఇంటికి వచ్చాక, ఏకాంతంలో ఉన్నప్పుడు అతని ప్రతి పనిలోనూ వంకలు వెతుకుతుంది. ఏదీ సరిగ్గా చేయలేవని నిందిస్తుంది. దీంతో అతనికి ఏది నిజమో, ఏది అబద్ధమో అర్థం కాదు. నేను నిజంగానే చెడ్డవాడినా? అని తనను తానే అనుమానించుకోవడం మొదలుపెడతాడు.
సమస్య అంతా నీతోనే అనే నింద
రిలేషన్ లో ఏ చిన్న ప్రాబ్లమ్ వచ్చినా, గొడవ జరిగినా, చివరికి తప్పు మొత్తం భర్త మీదే మోపబడుతుంది. ఆమె తన వైపున్న పొరపాటును అస్సలు అంగీకరించదు. అంతకుమించి నువ్వే ప్రతీదానికీ ఎక్కువగా స్పందిస్తావు,నీకు అర్థం చేసుకునే శక్తి లేదు అంటూ అతని వ్యక్తిత్వాన్నే కించపరుస్తుంది. కాలక్రమేణా భర్త తనలో ఏదో లోపం ఉందని, తనే సరిపోని వాడినని నమ్మడం మొదలుపెడతాడు. ఇది అతని ఆత్మవిశ్వాసాన్ని పూర్తిగా దెబ్బతీస్తుంది.

గుడ్డి నమ్మకం అనే పరీక్ష
ఆమె ఏం చేసినా, ఎంత పెద్ద తప్పు చేసినా, భర్త తనను గుడ్డిగా నమ్మాలని, తనవైపే నిలబడాలని ఆశిస్తుంది. ఒకవేళ భర్త వాస్తవాన్ని గ్రహించి నువ్వు చేసింది తప్పు అని చెప్పడానికి ప్రయత్నిస్తే మాత్రం దాన్ని క్షమించరాని ద్రోహంగా పరిగణిస్తుంది. నన్ను కాదని వాళ్ళ మాటలు నమ్ముతావా? అంటూ ఎమోషనల్ డ్రామాతో భర్తని లొంగదీసుకుంటుంది. దీంతో భర్త నిజం చెప్పడానికి భయపడి, ఆమె తప్పులను కూడా సమర్థించాల్సిన దుస్థితికి చేరుకుంటాడు.
నువ్వు నాకు రుణపడి ఉన్నావు అనే బంధనం
తాను కుటుంబం కోసం చేసిన ప్రతి చిన్న పనినీ, త్యాగాన్ని ఒక అప్పుల పట్టికలా గుర్తుపెట్టుకుంటుంది. సమయం వచ్చినప్పుడు నేను నీ కోసం, ఈ ఇంటి కోసం ఎంత చేశానో తెలుసా? అంటూ దాన్ని ఒక బ్రహ్మాస్త్రంలా ప్రయోగిస్తుంది. అతను ఎప్పుడూ ఆమెకు రుణపడి ఉన్నాననే భావనతో బతకాల్సి వస్తుంది. ఆ రుణం తీర్చుకోవడానికి నిరంతరం ఆమెను సంతోషపెట్టే ప్రయత్నంలో అతను తన సొంత ఉనికిని, సంతోషాన్ని కోల్పోతాడు.
ఈ ఉచ్చులన్నీ కలిసి భర్తను మానసికంగా పతనం వైపు నడిపిస్తాయి. అతని ఆత్మగౌరవం దెబ్బతింటుంది, నిర్ణయాలు తీసుకునే శక్తి సన్నగిల్లుతుంది. తనపై తనకే నమ్మకం పోయి, నిరంతర భయం, ఆందోళనలతో జీవించే ఒక నీడగా మిగిలిపోతాడు.



Click it and Unblock the Notifications