Latest Updates
-
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే! -
ఆ సమయంలోనే దంపతుల మధ్య ఎక్కువగా గొడవలు.. కారణాలేంటంటే.? -
ఈ పొడిని డైలీ అన్నం లేదా టిఫిన్‌లోకి తిన్నారంటే.. ఇక మందుల జోలికి వెళ్లాల్సిన పనిలేదు.! -
Teachers day recipe :ఉపాధ్యాయ దినోత్సవం స్పెషల్.. గురువుల కోసం కమ్మని పనీర్ పాయసం చేయండిలా.. -
ఉడకబెట్టాల్సిన పని లేదు.. చిక్కుడుకాయను కేటరింగ్ స్టైల్లో ఇలా చేస్తే ఫుల్‌గా లాగించేస్తారు.! -
తండ్రి తన ఆస్తి మొత్తం కొడుకుకి రాసిస్తే కూతురు పరిస్థితి ఏంటి? చట్టం ఏం చెబుతోంది? -
జెన్ జెడ్ తరానికి శ్రీకృష్ణుడి సందేశం.. గీత నుంచి నేటి యువత నేర్చుకోవాల్సిన కీలక పాఠాలివే.! -
కేవలం 15 నిమిషాల్లో.. పైకి కరకరలాడుతూ, లోపల సాఫ్ట్ గా ఉండే ఎగ్ పకోడి ఎలా చేసుకోవాలంటే.. -
కొత్తగా తల్లయిన వారికి అలర్ట్.. పిల్లలకు రెండేళ్ల వరకు ఇదొక్కటి అస్సలు ఇవ్వకూడదు.! -
ఉట్టికి, చిన్ని కృష్ణుడికి సంబంధమేంటి.. కృష్ణాష్టమికి ఉట్లు ఎందుకు కొడతారో తెలుసా.?
New Year 2025: మీకు ప్రియమైన వారికి ఈ గిఫ్ట్స్ ఇచ్చి విషెస్ తెలపండి.. దెబ్బకు ఫ్లాట్ అవుతారంతే!
ఇప్పుడైతే అంతా ఆన్లైన్ విషెస్ అయిపోయాయి కానీ, ఓ పది సంవత్సరాల క్రితం న్యూ ఇయర్ వచ్చిందంటే చాలు ప్రతి ఒక్కరూ గ్రీటింగ్ కార్డ్స్ ఇచ్చుకుంటూ శుభాకాంక్షలు తెలియజేసుకునేవారు. ఆ గ్రీటింగ్ కార్డుల్లో ఎదో ఒక బహుమతి పెట్టి మరీ మనకు కావాల్సిన వాళ్లకు ఇచ్చి న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలియజేసేవాళ్ళం. ఆరోజులు మళ్ళీ రావాలంటే రావనే చెప్పుకోవచ్చు. అయితే ఈ కొత్త సంవత్సరానికి మీ ఆత్మీయులకు లేదా లవర్లకు, భర్త లేదా భార్యకు కొంచెం కొత్తగా విషెస్ తెలియజేయండి. విషెస్‌తో పాటు ఈ బహుమతులు ఇచ్చి వారిని సర్‌ప్రైజ్ చేయండి. ఎలాంటి గిఫ్ట్స్ ఇవ్వాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం రండి.
ఫోటో ఫ్రేమ్స్
మీ ప్రియమైన వారిని లేదా మీకు ఇష్టమైన వారిని ఇంప్రెస్ చేయాలంటే పర్సనలైజ్డ్ గిఫ్టులు ఇవ్వడం చాలా బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. ఫోటో ఫ్రేమ్స్, ఫోటో క్యాండిల్స్, పిల్లో ఫ్రేమ్స్, ఇలా ఎన్నో రకాల పర్సనలైజ్డ్ గిఫ్టులు ఇచ్చి వారికి శుభాకాంక్షలు తేలియాజేయడం వల్ల వారు మీకు ఇంప్రెస్ అవుతారు. అలాగే మీ ప్రేమను గ్రహించే అవకాశం ఉంటుంది. పైగా ఎక్కువ ఖర్చు లేకుండా వారిని సంతోషపరిచినట్లు అవుతుంది.

యాక్ససరీస్
సాధారణంగా మనకు ఇష్టమైన వారికి ఎక్కువగా యాక్ససరీస్ ఇస్తేనే వారు సంతోషంగా ఫీల్ అవుతారనే భావన ఉంది. అందుకే ఈ కొత్త సంవత్సరం రోజున మీ ప్రియుడు లేదా ప్రేయసికి వాచెస్, స్మార్ట్ గ్లాసెస్, స్మార్ట్ రింగ్స్, చైన్స్, బ్రైస్‌లెట్ వంటివి ఇవ్వడం కూడా ఒక ఉత్తమైన ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. ఇవి వారికి ఉపయోగపడంతో పాటు మీరు వారిని ఎంతగా ప్రేమిస్తున్నారో అనే దానికి చిహ్నంగా పనికొస్తాయి.
ఆభరణాలు
ఆభరణాలు అనేది ఎవరికైనా ఇష్టం ఉంటుంది. అదే కొత్త సంవత్సరం రోజున సరికొత్తగా ఆభరణాలు బహుమతులుగా ఇస్తే మాత్రం మీ భార్య, లేదా ప్రేయసి ఎగిరి గంతేసి మిమ్మల్ని కౌగిలించుకోవడం ఖాయం. బ్రాస్‌లెట్‌లు, నెక్లెస్‌లు లేదా చెవిపోగులను బహుమతులగా ఇవ్వడం వల్ల మీ మీద మంచి ఇంప్రెషన్ కలుగుతుంది. లేకపోతే వారికి ఎలాంటి బహుమతి ఇష్టమో సీక్రెట్‌గా తెలుసుకొని ఆ బహుమతులు ఇవ్వడం వల్ల కూడా వారు ఇంప్రెస్ అవుతారు.
గిఫ్ట్ బాక్సులు
మీకు ఇష్టమైన వారికి ఎలాంటి బహుమతులు ఇవ్వాలో అనే విషయంలో కన్ఫ్యూజ్ అవుతున్నారా? మీ మనసులో ఎన్నో రకాల బహుమతులు ఇవ్వాలని ఆలోచిస్తున్నారా? కానీ ఏ బహుమతి ఇవ్వాలో తెలియడం లేదా? అయితే గిఫ్ట్ బాక్సులు ఇవ్వడం అనేది మంచి ఆప్షన్. అందులో మీరు ఇవ్వాలని అనుకుంటున్న బహుమతులను అందులో ఉంచాలి. అలాగే మీరు ఇవ్వాలనుకుంటున్న వ్యక్తికి ఎలాంటి బహుమతులు ఇష్టమో కూడా తెలుసుకొని అందులో ఉంచడం వల్ల మీపై మంచి ఇంప్రెషన్ కలుగుతుంది. అలాగే వారు ఇంప్రెస్ అవుతారు కూడా.



Click it and Unblock the Notifications