Latest Updates
-
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.!
భార్యలు.. ఈ విషయాలు భర్తతో అస్సలు చెప్పకూడదు, చెప్తే అతను పిచ్చోడు అయిపోవడం ఖాయం!
ప్రేమ, కోపం, పగ వంటి ఎమోషన్స్ అన్నీ సంబంధాలలో సహజం. ఈ అంశాలన్నీ సంబంధాలను బలంగా, అందంగా చేస్తాయి, కానీ కొన్నిసార్లు మీ సంబంధాలు విడిపోవడానికి దీర్ఘకాలిక కోపం, పగ వంటివి కూడా కారణం అవ్వొచ్చు. వీటి కారణంగా భార్యాభర్తల మధ్య సంబంధం ఎల్లప్పుడూ ఒడిదుడుకులతో మారిపోవచ్చు. వివాహ సంబంధం అన్ని సంబంధాల కంటే ప్రత్యేకమైనది. అంతటి ప్రత్యేకమైన బంధంలో కోపం, బాధ, చిరాకు వంటివి చాలా సహజం. అయితే వివాహ బంధంలో ఉన్నప్పుడు భార్య భర్తకు కొన్ని విషయాల గురించి అస్సలు చెప్పకూడదు. అవి భర్తను వెంటాడుతూనే ఉంటాయి. అలాగే మీ బంధంలో గొడవలకు కూడా కారణమవుతాయి. ఆ విషయాలు ఏంటి? ఏ విషయాలను చెప్పకూడదు అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
ఇతర పురుషులను పొగడడం, వారి పొగడ్తలు పొందడం
మీ భర్త ఎంత విశాల దృక్పథం కలిగి, స్నేహపూర్వకంగా ఉన్నా.. మీరు ఇతర పురుషులను అతని ముందు పొగడడం, లేదా వేరే పురుషుడు మిమ్మల్ని మీ భర్త ముందు పొగిడినా అది వారికి అస్సలు నచ్చదు. ముఖ్యంగా మీరు వేరే పురుషుడి ఆస్తి, అందం, వారి ఆర్ధిక ప్రభావం గురించి మీ భర్త ముందు ప్రస్తావిస్తే అది వారిని ఎల్లప్పుడూ వెంటాడుతూనే ఉంటుంది. ఈ విషయాన్ని మీ భర్తలు మీతో చెప్పకపోయినా, వారి మనసులో దీని గురించి మాట్లాడుకునే ఉంటారు.

ఇతరులతో పోల్చడం
మీరు మీ భర్తను ప్రశంసించకపోయినా, అతను బాధపడడు, కానీ అతన్ని ఎప్పుడూ వేరొకరితో పోల్చకండి. పోల్చడం వల్ల వారు మీ గురించి ఆందోళన చెందుతారు. అది మీ సంబంధాన్ని నాశనం చేసే విధంగా దారితీస్తుంది. వేరొకరియం పోలుస్తూ మీరు చెప్పే ప్రతి మాట వారి జ్ఞాపకంలో ఉంటుంది. దీనివల్ల సంబంధాలు దెబ్బతినే అవకాశం ఎక్కువ. ముఖ్యంగా మీరు మీ భర్త ఆర్థిక స్థితి, ఆస్తులు, కుటుంబాన్ని వేరొకరితో పోల్చినప్పుడు వారికి అస్సలు నచ్చదు.
మీ భర్త దగ్గర వేరొకరి గురించి అడిగి తెలుసుకోవడం
మీ భర్త నుండి ఏదైనా సమస్య గురించి లేదా వేరే వ్యక్తుల గురించి సమాచారం అడిగి తెలుసుకోవడం మీ భర్తను మానసికంగా కుంగిపోయే విధంగా చేస్తుంది. తమ భార్యలు వేరొకరి గురించి సమాచారం అడిగితే పురుషులు తట్టుకోలేరు. ఇది మీ సంబంధంలో చీలికకు కూడా కారణమవుతుంది. మీరు ఈ విధంగా వేరొకరి గురించి సమాచారాన్ని ఎందుకు సేకరిస్తున్నారో రహస్యంగా తెలుసుకోవడానికి ప్రయత్నించే అవకాశం పెరుగుతుంది. తద్వారా మీ బంధంలో సమస్యలు పెరిగిపోతాయి.



Click it and Unblock the Notifications