Latest Updates
-
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే! -
ఆ సమయంలోనే దంపతుల మధ్య ఎక్కువగా గొడవలు.. కారణాలేంటంటే.? -
ఈ పొడిని డైలీ అన్నం లేదా టిఫిన్లోకి తిన్నారంటే.. ఇక మందుల జోలికి వెళ్లాల్సిన పనిలేదు.! -
Teachers day recipe :ఉపాధ్యాయ దినోత్సవం స్పెషల్.. గురువుల కోసం కమ్మని పనీర్ పాయసం చేయండిలా.. -
ఉడకబెట్టాల్సిన పని లేదు.. చిక్కుడుకాయను కేటరింగ్ స్టైల్లో ఇలా చేస్తే ఫుల్గా లాగించేస్తారు.! -
తండ్రి తన ఆస్తి మొత్తం కొడుకుకి రాసిస్తే కూతురు పరిస్థితి ఏంటి? చట్టం ఏం చెబుతోంది? -
జెన్ జెడ్ తరానికి శ్రీకృష్ణుడి సందేశం.. గీత నుంచి నేటి యువత నేర్చుకోవాల్సిన కీలక పాఠాలివే.! -
కేవలం 15 నిమిషాల్లో.. పైకి కరకరలాడుతూ, లోపల సాఫ్ట్ గా ఉండే ఎగ్ పకోడి ఎలా చేసుకోవాలంటే..
సంసారంలో చిచ్చుపెట్టిన చాట్ జీపీటీ..ఎఫైర్ బట్టబయలు చేయడంతో విడాకులు!
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI)టూల్స్ ప్రస్తుతం మన రోజువారీ జీవితంలో భాగంగా మారిపోయాయి. స్కూల్ పిల్లల దగ్గర నుంచి పనులకు వెళ్లే కూలీలు కూడా ఏఐ టూల్స్ ని ఉపయోగిస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఉద్యోగాలు పోతాయ్ అని ఇప్పటిదాకా విని ఉంటారు. అయితే AI వల్ల కాపురాలు కూడా కూలిపోతున్నాయి. ఏఐ చాట్ బాట్ తో ప్రేమలో పడి మహిళలు భర్తలకు విడాకులు ఇస్తున్నారు..తాజాగా ఏఐ ఇచ్చిన సమాచారంతో ఓ మహిళ తన భర్తకు విడాకులు ఇచ్చింది. గ్రీస్ లో ఈ వింత కేసు వెలుగులోకి వచ్చింది.
గ్రీస్ కు చెందిన ఓ మహిళకు 12 ఏళ్ల క్రితం వివాహం అయింది. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఈ మహిళ చాట్ జీపీటీని వాడుతుంది. ఇటీవల ఈమె తన భర్త కాఫీ కప్పు అవశేషాలను విశ్లేషించి తనకు రీడింగ్ ఇవ్వమని చాట్ బాట్ ను కోరింది. కాఫీ కప్పు అవశేషాలను విశ్లేషించి చెప్పడమనం ఏంటిది వింతగా ఉంది అనుకుంటున్నారా? వాస్తవానికి కప్పు అడుగున ఉన్న మడ్డిని చదవడం అనేది టాన్సియోగ్రఫీ అని పిలువబడే భవిష్యవాణి పద్ధతి. ఇది సాధారణంగా జాతకం చెప్పేటోళ్లు చేస్తుంటారు.

మహిళ తన భర్త కాఫీ కప్పు అడుగున ఉన్న ఫొటోను చాట్ జీపీటీలో అప్ లోడ్ చేసింది. అయితే ఈ ఏఐ టూల్ మహిళ భర్తకు E అక్షరంతో ప్రారంభమయ్యే పేరు గల మహిళతో వివాహేతర సంబంధం ప్రారంభించాలని ఆలోచిస్తున్నట్లు సమాధానం ఇచ్చింది. చాట్ జీపీటీ మరింత ముందుకెళ్లి కాఫీ గ్రౌండ్ ని అర్థం చేసకొని ఇప్పటికే అతను భార్యను మోసం చేస్తున్నాడని చెప్పింది. తన భర్త కాఫీ కప్పు గురించి చాట్ జీపీటీ చదివిన విషయాన్ని గుడ్డిగా నమ్మేసిన మహిళ భర్త నుంచి విడాకులు కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
అయితే తనకు ఎవరితో ఏ ఎఫైర్ లేదని,తన భార్యకు జ్యోతిష్యం వంటి వాటిపై నమ్మకం ఉందని మహిళ భర్త తెలిపారు. చాట్ జీపీటీ దానిని తాను అర్థం లేనిదిగా నవ్వుకున్నాను కానీ తన భార్య దానిని సీరియస్ గా తీసుకుందని మహిళ భర్త చెప్పాడు. ప్రముఖ సోషల్ మీడియా రెడ్డిట్ లో వచ్చిన ఈ కథనంపై నెటిజన్లు భిన్న రకాలుగా స్పందిస్తున్నారు.
టెక్నాలజీ దంపతుల బంధంలో చిచ్చుపెట్టడం ఇదేం మొదటిసారి కాదని, ఫోన్లు, సోషల్ మీడియా వచ్చాక రోజు వందల కాపురాలు నాశనమవుతున్నాయని కొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. AI చాట్ బాట్ ల వంటి టూల్స్ కారణంగా సెన్సిటివ్ వ్యక్తులు వాస్తవికత,కల్పనల మధ్య తేడాను చెప్పడం కష్టమవుతోందని మరికొందరు నెటిజన్లు కామెంట్స్ చేశారు.



Click it and Unblock the Notifications