Latest Updates
-
రిలేషన్ షిప్ పై త్రిప్తి డిమ్రి ఆసక్తికర వ్యాఖ్యలు..అది ఉంటే తప్ప వర్కౌట్ కాదంట..! -
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న 10 నిమిషాల ఎగ్ కుర్మా..ఎలా చేయాలో చూడండి.. -
మైగ్రేన్‌తో గుండెకి ప్రమాదం.. ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.! -
రోజుకు ఎన్నిసార్లు గ్యాస్ వదలడం నార్మల్? మహిళలు, పురుషుల్లో ఎవరికి ఎక్కువంటే..! -
అద్భుతమా, మూఢ నమ్మకమా.? దశాబ్దాల సంప్రదాయం, లక్షలాది ప్రజల నమ్మకం.. చేప ప్రసాదం వెనకున్న కథేంటి.? -
కుక్కర్ విజిల్ వేసినప్పుడు పప్పు పొంగుతోందా? ఈ పాతకాలపు చిట్కాతో చెక్..! -
ఈ 5 రాశుల వారికి కెరీర్లో బంపర్ ఆఫర్.. అకస్మాత్తుగా ధనలాభం ఖాయం! -
విష్కుంభ యోగం ముగింపు.. ప్రీతి యోగంతో ఈ రాశుల వారికి అదృష్టం, పనుల్లో విజయం ఖాయం! -
తిరుపతి లడ్డూ ఎందుకు అంత ప్రత్యేకం? దాని వెనుక ఉన్న పవిత్ర రహస్యం చాలామందికి తెలియదు! -
జూన్ 8 గ్రహాల గోచారం: మీన రాశిలో శని-చంద్రుల కలయిక.. ఈ రాశుల వారికి ఊహించని మార్పులు!
ఈ 5 లక్షణాలు ఉన్న స్త్రీలు కచ్చితంగా మోసం చేస్తారు.. మీ ప్రేయసిలో ఈ లక్షణాలు ఉన్నాయా?
ఒక ప్రేమ బంధమైనా, వివాహబంధమైనా ఇతర ఎలాంటి బంధాలైనా అది ముక్కలవ్వటానికి ముఖ్యమైన కారణం ఏదైనా ఉందంటే అది ద్రోహం, అవిశ్వాసం. ఈ రెండు వల్ల ఎంత బలమైన బంధమైనా చిన్నాభిన్నం అవుతుంది. అప్పటి వరకు మీ జీవితంలోని ఆనంద భరితమైన క్షణాలన్నిటినీ నాశనం చేస్తాయి. అలాగే మీకు ఎక్కడ లేని దుఃఖాన్ని మిగులుస్తాయి.
ఈ అవిశ్వాసం అనేది లింగ భేదం లేకుండా ఉంటుంది. ఆడ లేదా మగ ఎవరైనా ఈ అవిశ్వాన్ని చూపించగలుగుతారు. అలాగే ఇతర వ్యక్తులపై ద్రోహాన్ని వ్యాపించజేయగలుగుతారు. అయితే ఈ పోస్టులో ఎలాంటి లక్షణాలు ఉన్న స్త్రీలు మిమ్మల్ని మోసం చేస్తారు? వారు మోసం చేస్తున్నారని ఎలా తెలుసుకోవాలనేది వివరించాము. పూర్తిగా చదివి తెలుసుకోండి.

దేనితోనూ సంతృప్తి చెందని స్త్రీ
మీ గర్ల్‌ఫ్రెండ్/భార్య నిరంతరం అసంతృప్తిని వ్యక్తం చేస్తుంటే, వారు మోసం చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి స్త్రీలు గిఫ్ట్స్, ఎమోషనల్ అటాచ్మెంట్స్, ప్రేమ, మీరు వారికి ఇచ్చే సమాయంతో సంతృప్తి చెందరు. వారికి కావాల్సిన వాటికోసం మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటారు. మీరు చూపించే ప్రేమ, వారిని మీరు రక్షించుకునే విధానం వారికి ఏమాత్రం నచ్చకపోతే అలాంటి స్త్రీలు మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఎక్కువగా ఉంటాయి.
హద్దులు లేకుండా బాధ్యతారహితంగా బతికే స్త్రీలు
మగవారైనా, ఆడవారైనా ఈవారి హద్దుల్లో వారు తప్పకుండా ఉండాలి. ముఖ్యంగా రిలేషన్‌షిప్‌లో ఉన్నప్పుడు ఆ హద్దులు చాలా బలంగా ఉండాలి. రిలేషన్‌షిప్‌లో తమ భాగస్వామితో సంబంధం లేకుండా ఎలాంటి హద్దులు లేకుండా ఇష్టానుసారంగా జీవించే స్త్రీలు కచ్చితంగా మోసం చేస్తారు. బాధ్యతారహితమైన ప్రవర్తనలో నిమగ్నమైన స్త్రీ, సంబంధంలో విశ్వాసపాత్రంగా ఉండకపోవచ్చు. అది చివరికి బంధం విచ్చిన్నమవడానికి కారణం కావచ్చు.
ఇప్పటికే ఓసారి మోసం చేసిన మహిళ
ప్రేమలో లేదా వైవాహిక బంధంలో మోసం అనుకోకుండా జరగదు. మోసం జరిగిందంటే అది ఎదుటి వ్యక్తి ప్రమేయంతోనే జరుగుతుంది. లేదా వారి ఇష్టానుసారంగానే జరుగుతుంది. ఒకసారి మిమ్మల్ని మోసం చేసిన స్త్రీ మరోసారి మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఆ మోసానికి తగిన ప్రతిఫలం ఆమెకు తెలుసు, ఆ ప్రతిఫలం కోసం ఆమె మిమ్మల్ని మరోసారి మోసం చేయడానికి వెనుకాడదు. అందుకే ఒకసారి మోసం చేసిన మహిళను గుడ్డిగా నమ్మడం ఏమాత్రం మంచిది కాదు.
థ్రిల్లింగ్ కోరుకునే స్త్రీలు
సాధారణంగా ప్రతి అడ్రినల్ రష్ ఉంటుంది. దానికి అనుగుణంగా కొన్ని కొన్ని సార్లు థ్రిల్లింగ్ పనులు చేయాలని అనుకుంటూ ఉంటారు. అయితే అది తరచూ కావాలనుకుంటే అది వ్యసనమవుతుంది. ఎందుకంటే ప్రతీసారి అది సాధ్యపడకపోవచ్చు కాబట్టి. అందుకే థ్రిల్లింగ్ ఎక్కువగా కోరుకునే స్త్రీలు ఎప్పుడూ తమ భాగస్వామితో సంతృప్తి పడలేరు. క్రమంగా వారు అవిశ్వాసానికి పాల్పడే అవకాశం ఉంటుంది. అలాగే భాగస్వామి నుంచి దూరంగా ఉండేందుకు ప్రయత్నించే ఛాన్సుంది. అలాంటి స్త్రీలు కూడా ఎక్కువగా మోసం చేసే అవకాశం ఉంది.
శృంగారంపై భిన్నమైన దృక్పథం ఉన్న మహిళలు
శృంగారంపై భిన్నమైన దృక్పథం ఉన్న స్త్రీలు కచ్చితంగా భాగస్వామిని మోసం చేయడం తీవ్రమైన నేరం కాదని నమ్ముతుంటారు. అలాంటి స్త్రీలు కచ్చితంగా తమ భాగస్వామిని మోసం చేసే అవకాశం ఉంటుంది. అలాగే వేరొకరిని వెతుక్కునే ఛాన్స్ కూడా ఉంటుంది.
గమనిక: ఈ కథనంలో మేము పొందుపరిచిన అంశాలు పలు అధ్యయనాలు, ఇంటర్నెట్‌లో మాకు దొరికిన సమాచారం ఆధారంగా అందించబడింది. వీటి శాస్త్రీయతను మేము నిర్ధారించడం లేదు. వీటిని ఎంతవరకు విశ్వసించడం అనేది పూర్తిగా మీ బాధ్యత. దీనికి బోల్డ్ స్కై తెలుగుకు ఎటువంటి సంబంధం లేదు.



Click it and Unblock the Notifications