Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
పెళ్ళైన మహిళలు వేరే వ్యక్తులతో సంబంధం ఎందుకు పెట్టుకుంటారో తెలుసా? ఈ సమస్యలే కారణం!
పెళ్లి అనేది ఒక పవిత్రమైన బంధం. పెళ్ళైన తరువాత మహిళలు ఒక లోకం నుంచి మరో లోకంలోకి వెళ్తారు. అప్పటి నుంచి తాను గడిపిన క్షణాలను, తన వాళ్ళను వదిలేసి వేరే ప్రపంచంలో బతకాల్సి వస్తుంది. మొదట్లో అంతా బాగానే ఉంటుంది. కానీ రోజులు గడుస్తున్నా కొద్దీ ఆ మహిళ జీవితంలో కొన్ని కొన్ని సమస్యలు మొదలవుతాయి. దీంతో మానసికంగా కృంగిపోతారు. అలాగే ఆనారోగ్యం బారిన పడతారు. అయితే అసలు మహిళలకు ఎలాంటి సమస్యలు వస్తాయి? వాటికి కారణం ఎవరు అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
రహస్యాలను బయటపెట్టేవారు..
కొత్త ప్రాంతం, కొత్త ప్రపంచంలోకి వెళ్లిన తరువాత ఎవరు ఎలాంటి వారో ఎవరికీ స్పష్టమైన అవగాహనా ఉండదు. అందులో భాగంగానే చాలా మంది మహిళలు తమ రహస్యాలను వేరే వ్యక్తులతో పంచుకుంటారు. వారు ఆ రహస్యాలను దాచుకోకుండా బయటపెట్టేస్తారు. ఇది ప్రతి మహిళను ఇబ్బందులకు గురిచేస్తుంది. దీని కారణంగా ఆ మహిళకు మానసిక క్షోభ కలిగే అవకాశం ఉంటుంది. కొన్ని కొన్నిసార్లు వివాదాల్లో కూడా చిక్కుకుంటారు.

గొడవలు పెట్టేవారు..
కొంతమంది ఓ శునకానందం ఉంటుంది. ఒక ఇంట్లో గొడవ జరిగే వారికి చాలా సంతోషంగా ఉంటుంది. ఆ గొడవ పెట్టేందుకు వారు దేనికైనా వెనకాడరు. అందులో భాగంగానే కొంతమంది ఇంట్లోని వ్యక్తులకు ఉన్నది, లేనిది చెప్పి గొడవ పెట్టడానికి ప్రయత్నిస్తారు. దీని కారణంగా మహిళలకు, ఇంట్లోని వ్యక్తులకు గొడవలయ్యే అవకాశాలు ఉంటాయి. వారి వల్ల కూడా వీరు ఎక్కువగా బాధపడుతుంటారు.
వివాహేతర సంబంధాలు
మహిళలకు భూదేవికి ఉన్నంత ఓర్పు ఉంటుంది అని చెబుతుంటారు. అందులో భాగంగానే వారు ఎలాంటి కష్టాలను సైతం తట్టుకొని నిలబడతారు. కానీ తన భర్త వివాహేతర సంబంధం పెట్టుకున్నారంటే మాత్రం అస్సలు తట్టుకోలేరు. కొంతమంది పెళ్ళాన్ని కాదని వేరే మహిళలతో సంబంధంలో ఉంటారు. దాని కారణంగా మహిళలు మానసికంగా కుంగిపోతారు. కొన్ని కొన్ని సార్లు భర్తకు విడాకులు ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది.
అత్త వల్ల..
ప్రతి ఇంట్లో కచ్చితంగా అత్త, కోడళ్ల గొడవలు ఉంటాయి. ముఖ్యంగా అత్త కారణంగా ఎక్కువగా సమస్యలు వస్తాయని వింటూ ఉంటాము. అందరూ అలానే ఉండరు కానీ.. కొందరు మాత్రం అలానే ఉంటారని అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఇంట్లో చాడీలు చెప్పే అత్త ఉంటే కచ్చితంగా గొడవలు అవుతాయి. ఆ మహిళకు మానసిక క్షోభ కలుగుతుంది. సంతోషంగా తన జీవితాన్ని నడపలేదు. అలాగే ప్రతి పనిపై ఆసక్తి లేకుండాపోతుంది. ఈ కారణాల వల్ల పెళ్లి తరువాత మహిళలు ఎక్కువగా ఇబ్బందులు పడుతుంటారు.



Click it and Unblock the Notifications