Latest Updates
-
వాతావరణ మార్పులతో మోకాళ్ల నొప్పుల బాధలు.. ఉపశమనం కోసం ఇంట్లోనే ఇలా చేయండి.! -
తిరోగమనం నుంచి బయటపడ్డ బుధ గ్రహం.. ఇక ఈ రాశుల వారి దశ తిరిగినట్లే.! -
సోషల్ మీడియాలో పరిచయాలు నిజమా కాదా.?.. డేటింగ్‌కి వెళ్లేముందు ఈ విషయాలు గమనించండి.! -
ముఖంపై మొటిమలు రావడానికి కారణాలు ఇవే.. వీటిని ఎలా నివారించాలంటే.! -
‘సర్’ కలిపిన బంధం.. ముప్పై ఏళ్ల తర్వాత మళ్లీ తల్లిదండ్రులను చేరిన కుమారుడు.! -
ప్యాకెట్ చిప్స్ కు గుడ్ బై..ఎలాంటి రసాయనాలు లేకుండా ఇంట్లోనే కరకరలాడే ఆలూ చిప్స్ చేసుకోండిలా.. -
మీ పాదాలపై ఇలా ఉందా?.. లివర్ డ్యామేజ్ కి ముందస్తు హెచ్చరిక! -
ఆఫీస్ నుంచి రాగానే అలసటగా ఉందా? 15 నిమిషాల్లో ఈ క్రీమీ పనీర్ గ్రేవీ ట్రై చేయండి..చపాతీ, రైస్ లోకి కేక -
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.!
డార్క్ చాక్లెట్ తింటే పడగ్గదిలో రెచ్చిపోతారు, కామోద్దీపన కలిగి మరింత ఎంజాయ్ చేస్తారు
శృంగారాన్ని ఆస్వాదించడానికి దంపతులు ఇద్దరిలో కోరికలు ఉండాల్సిందే. ఒత్తిడి, ఆందోళన లాంటి కారణాల వల్ల కోరికలు కలగక చాలా మంది శృంగారానికి దూరమైపోతారు. ఒకవేళ సెక్స్ లో పాల్గొన్నా.. తక్కువ సెక్స్ డ్రైవ్ వల్ల సుఖాన్ని పొందలేరు. అయితే సెక్స్ డ్రైవ్ ను పెంచడానికి అనేక మార్గాలు ఉన్నాయి.
శృంగార కోరికలను, లిబిడోను పెంచి లైంగిక పనితీరును మెరుగుపరచడానికి ఆహారాలు కీలక పాత్ర పోషిస్తాయి. అలాంటి ఆహారాల్లో చాక్లెట్లు ముఖ్యమైనవి. చాక్లెట్లు తినడం వల్ల కామోద్దీపన కలుగుతుంది. కోరికలు పెరుగుతాయి. శృంగార కోరికలను కలిగించే ఆహారాలను అప్రోడిసియాక్ ఫుడ్స్ గా పిలుస్తారు. అప్రోడిసియాక్ ఫుడ్స్ జాబితాలో చాక్లెట్లు కూడా ఉంటాయి.

లైంగిక హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది:
ఫెనిలేథైలమైన్, సెరోటోనిన్ అనేవి లైంగిక ప్రేరేపణలను పెంచే ప్రాథమిక హార్మోన్లు. కొన్ని కారణాల వల్ల ఈ హార్మోన్లు తగినంతగా ఉత్పత్తి కావు. దీని వల్ల లైంగిక కోరికలు కలగవు. కొన్ని రకాల ఆహారాలు తీసుకోవడం వల్ల ఈ హార్మోన్లు విడుదలై కోరికలు కలగడంతో పాటు సెక్స్ డ్రైవ్ మెరుగుపడుతుంది. డార్క్ చాక్లెట్లను అప్రోడిసియాక్ ఫుడ్(కామోద్దీపన కలిగించే ఆహారం) గా పరిగణిస్తారు.
డార్క్ చాక్లెట్లు తినడం ద్వారా శరీరంలో రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. దీని వల్ల అంగం మరింతగా గట్టిగా స్తంభిస్తుంది. ఇదో సహజ వయాగ్రాగా పని చేస్తుంది. అలాగే చాక్లెట్లలోని పోషకాలు లైంగిక హార్మోన్లు అయిన ఫెనిలేథైలమైన్, సెరోటోనిన్ లను ఉత్పత్తి చేస్తాయి. దీని వల్ల కోరికలు కలగడం, సెక్స్ డ్రైవ్ పెరగడం జరుగుతుంది.
డార్క్ చాక్లెట్లలో కెఫిన్, శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. డార్క్ చాక్లెట్లలోని కెఫిన్ రక్త ప్రసరణను పెంచుతుంది. అలాగే లిబిడోను బలపరుస్తుంది. డార్క్ చాక్లెట్లలో L-ఆర్జినైన్, అమైనో యాసిడ్ లు ఉంటాయి. ఇవి కామోద్దీపనను కలిగిస్తాయి.
డార్క్ చాక్లెట్లు సెక్స్ ప్రయోజనాలు:
- డార్క్ చాక్లెట్లు శరీరంలో ఎండార్భిన్లను, ఇతర సంతోషకరమైన హార్మోన్లను విడుదల చేస్తాయి. అలా చాక్లెట్లు సెక్స్ డ్రైవ్ ను పెంచుతాయి. అలసట, ఒత్తిడిని తగ్గిస్తాయి.
- డార్క్ చాక్లెట్లు సహజ వయాగ్రాగా పని చేస్తాయి. ఇది శరీరంలో నైట్రిక్ ఆక్సైడ్ ఉత్పత్తిని సులభతరం చేస్తుంది. అధిక రక్తపోటు ప్రమాదాన్ని తగ్గిస్తుంది. సెక్స్ డ్రైవ్ ను మెరుగుపరుస్తుంది.
- చాక్లెట్లు కామోద్దీపనగా పని చేస్తుంది. మహిళలకు లైంగిక ఆనందాన్ని పెంచుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి.
- డార్క్ చాక్లెట్లలో ఫ్లేవనాయిడ్లు ఉంటాయి. డార్క్ చాక్లెట్లలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. డార్క్ చాక్లట్లు తింటే తక్షణ శక్తి లభిస్తుంది. దాంతో పడగ్గదిలో రెచ్చిపోయి శృంగారం చేయవచ్చు.
- డార్క్ చాక్లెట్లు పురుషాంగానికి రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి. దీంతో అంగం మరింత గట్టిగా స్తంభిస్తుంది.
Disclaimer: ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications