Latest Updates
-
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే! -
ఆ సమయంలోనే దంపతుల మధ్య ఎక్కువగా గొడవలు.. కారణాలేంటంటే.? -
ఈ పొడిని డైలీ అన్నం లేదా టిఫిన్లోకి తిన్నారంటే.. ఇక మందుల జోలికి వెళ్లాల్సిన పనిలేదు.! -
Teachers day recipe :ఉపాధ్యాయ దినోత్సవం స్పెషల్.. గురువుల కోసం కమ్మని పనీర్ పాయసం చేయండిలా.. -
ఉడకబెట్టాల్సిన పని లేదు.. చిక్కుడుకాయను కేటరింగ్ స్టైల్లో ఇలా చేస్తే ఫుల్గా లాగించేస్తారు.! -
తండ్రి తన ఆస్తి మొత్తం కొడుకుకి రాసిస్తే కూతురు పరిస్థితి ఏంటి? చట్టం ఏం చెబుతోంది? -
జెన్ జెడ్ తరానికి శ్రీకృష్ణుడి సందేశం.. గీత నుంచి నేటి యువత నేర్చుకోవాల్సిన కీలక పాఠాలివే.! -
కేవలం 15 నిమిషాల్లో.. పైకి కరకరలాడుతూ, లోపల సాఫ్ట్ గా ఉండే ఎగ్ పకోడి ఎలా చేసుకోవాలంటే.. -
కొత్తగా తల్లయిన వారికి అలర్ట్.. పిల్లలకు రెండేళ్ల వరకు ఇదొక్కటి అస్సలు ఇవ్వకూడదు.! -
ఉట్టికి, చిన్ని కృష్ణుడికి సంబంధమేంటి.. కృష్ణాష్టమికి ఉట్లు ఎందుకు కొడతారో తెలుసా.?
మీ భార్యలో ఇలాంటి లక్షణాలు ఉంటే.. మీరు కచ్చితంగా అదృష్టవంతులే.. అవి ఏవంటే?
ప్రపంచంలోని అన్ని బంధాలలలో కంటే వివాహబంధం అనేది చాలా గొప్పనైనది. ఈ భార్య భర్తల బంధం జీవితంలో ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా, జీవితం ఎలాంటి మలుపు తిరిగినా ఒకరికి ఒకరు తోడు ఉంటుంది. అలాంటి గొప్పదైన ఈ బంధానికి గొప్ప వ్యక్తులు దొరకడం కూడా చాలా ముఖ్యం. భార్యాభర్తలిద్దరి గుణాలు మంచిగుంటేనే వారి జీవితంతో పాటు వారి భవిష్యుత్తు కూడా అమోఘంగా ఉంటుంది. అయితే ఈ స్టోరీలో మేము మంచి భార్యకు ఉండాల్సిన కొన్ని లక్షణాల గురించి వివరించాము. అవేంటో చూద్దాం రండి..
భర్త మాట వింటూనే..
భార్య, భర్తలు ఇద్దరూ ఒకరికొకరు గౌరవంగా ఉంటేనే వారికి విలువ ఉంటుంది. లేని యెడల ఆ బంధానికి ఎలాంటి విలువ ఉండదు. భర్తలు చెప్పే మాటలను భార్య గౌరవంగా వింటూ వారి మాటలను గౌరవిస్తూ తూచాతప్పకుండా పాటిస్తేనే భార్య తనానికి అర్ధం ఉంటుంది. అలా అని భర్తలు చేసే ప్రతి తప్పును అంగీకరించాలని కాదు.

భర్తలు తప్పుడు మార్గంలో వెళ్తున్నట్లు అనిపించినా, వారు ఏదైనా తప్పుడు పని చేస్తున్నట్లు ఉన్నా.. వారిని కచ్చితంగా నిలదీయాల్సి ఉంటుంది. ఇది తప్పు, ఇలాంటి పని చేయకూడదు అని వారితో వాదించాల్సి ఉంటుంది. అలాంటి భార్య మీకు దొరికినట్లు అయితే మీరు కచ్చితంగా అదృష్టవంతులే. ఎందుకంటే తల్లి స్థానంలో ఉండి మీ తప్పులను సరిదిద్దే భార్య దొరికితే ఏ భర్తకైనా అదృష్టమనే చెప్పుకోవాలి.
గౌరవం..
ఏ బంధంలోనైనా గౌరవం అనేది చాలా ముఖ్యం. బంధం బలంగా ఉండాలంటే పునాది లాంటి గౌరవం కూడా అంతే బలంగా ఉండాలి. ఒకరిపై ఒకరికి గౌరవం ఉన్నప్పుడే ఆ బంధం బలంగా ఉంటుంది. ఏ భార్య అయితే భర్తను అత్యుత్తమంగా గౌరవిస్తుందో ఆమె అత్యుత్తమ భార్యగా చెప్పుకోవచ్చు. ఏ భర్త అయితే తన భార్యను అత్యుత్తమంగా గౌరవిస్తాడో అతను అత్యుత్తమ భర్తగా చెప్పుకోవచ్చు. అలాంటి వ్యక్తులు దొరికితే మీరు కచ్చితంగా వారిని వదులుకోవద్దు.
సహాయపడే భార్య..
ఈ కాలంలో భార్యలెవరూ వంటింటికే పరిమితం అవ్వడం లేదు. వారు సైతం భర్తల మాదిరిగానే వంటింటితో పాటు బయట ప్రపంచంలో కూడా తమ సత్తా చాటుతున్నారు. భర్తలకు పోటీగా వారు కూడా భారీగానే డబ్బులు సంపాదిస్తున్నారు. కెరీర్, ఇల్లు రెండిటినీ సమానంగా బ్యాలెన్స్ చేస్తూ.. తమ జీవనాన్ని కొనసాగిస్తున్నారు. ఇలాంటి భార్య కనుక మీకు దొరికితే కచ్చితంగా మీరు అదృష్టవంతులే.
ఎందుకంటే వైవాహిక జీవితం అంటేనే ఒడిదుడుకుల జీవితం. వైవాహిక జీవితంలో సక్సెస్ కావాలంటే ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. వైవాహిక జీవితం అనేది ఎప్పుడూ ఒకేలా ఉండదు. అందుకే భర్త కష్టాల్లో ఉన్నప్పుడు భార్య నేనున్నా అని తోడుగా నిలబడితే ఆ బంధానికి అర్ధం ఉంటుంది. ఆర్ధిక కష్టాల్లో సైతం భర్తకు తోడుగా భార్య నిలబడితే.. ఆ భర్త ఎంతో అదృష్టవంతుడిగా చెప్పుకోవచ్చు. అలాంటి భార్యలు దొరకడం ఈ కాలంలో చాలా అరుదు.
భర్తలు ఎప్పుడూ.. ఓపెన్ మైండెడ్ భార్యలనే ఇష్టపడుతుంటారు. అలాంటి అమ్మాయిలు ఈ కాలంలో ఎలా జీవించాలో తెలిసినవారు. చదుకున్న అమ్మాయిలు, సమాజం గురించి తెలిసిన అమ్మాయిలైతే ఇంటితో పాటు సమాజంలో తమ గౌరవాన్ని కూడా కాపాడగలరు. అలాంటి అమ్మాయిలనే ఈ మధ్య కాలంలో అబ్బాయిలు కూడా వెతుకున్నారు. ఒకవేళ మీకు అలాంటి అమ్మాయి భార్యగా వస్తే మీరు కచ్చితంగా అదృష్టవంతులే.



Click it and Unblock the Notifications