Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
Bedroom Secrets: సంబంధాన్ని స్వర్గంగా మార్చే బెడ్ రూమ్ సీక్రెట్స్..ఇవి పాటిస్తే తిరుగుండదు
బెడ్ రూమ్ అంటే కేవలం నాలుగు గోడల మధ్య గది,నిద్రపోయే గది అని సాధారణంగా అందరూ భావిస్తారు. వాస్తవానికి బెడ్ రూమ్ అనేది ఎన్నో భావోద్వేగాల సమాహారం. ఇక్కడ బంధాలు చిగురిస్తాయి, కొన్నిసార్లు సడలిపోతాయి. నిశ్శబ్ద రాత్రివేళ.. అలసిన మనస్సుకి, శరీరానికి ఉపశమనం కలిగించే ప్రదేశం బెడ్ రూమ్. బెడ్ రూమ్ అనేక రహస్యాలను దాచుకుంటుంది, కొన్నిసార్లు సంబంధాలను బలపరుస్తుంది, కొన్నిసార్లు వాటిని బలహీనపరుస్తుంది. భార్యాభర్తల మధ్య సంబంధం ఒకే పైకప్పు కింద అనేక ఒడిదుడుకులను ఎదుర్కొంటుంది. బెడ్ రూమ్ లో ఒకే మంచం పంచుకున్నప్పటికీ, కొన్నిసార్లు సంబంధంలో ఆప్యాయత మందగిస్తుంది.
బెడ్ రూమ్ లో దంపతులు ఒకే మంచంపై పడుకున్నా, మనసులు దూరమయ్యే ప్రమాదం ఉంది. శారీరక కోరికలు కూడా నెమ్మదిగా చల్లారవచ్చు. మీ సంబంధంలో గతంలో ఉండే వెచ్చదనాన్ని తిరిగి తీసుకురావాలనుకుంటున్నారా? బెడ్ రూమ్ అంటే ఎప్పుడూ శృంగారం అని కాదు..మీ బంధాన్ని బలోపేతం చేసేవి అంతకు మించి చాలా ఉన్నాయి. అవేంటో ఇక్కడ చూడండి. వీటిని పాటిస్తే సంసారం స్వర్గంగా మారిపోతుంది.

ఫోన్ ను దూరంగా ఉంచాలి
భాగస్వామితో కలిసి బెడ్ రూమ్ లో నిద్రపోవాలనుకున్న సమయంలో తప్పనిసరిగా మీ ఫోన్‌ను మీ దగ్గర పెట్టుకోవద్దు. ఫోన్ ను బెడ్ రూమ్ బయట పెట్టేయడం ఉత్తమం. మీ భాగస్వామి నుండి మీకు కొంత పర్శనల్ స్పేస్ అవసరమని చెప్పండి, అదే విధంగా వారికి కూడా కొంత సమయం ఇవ్వండి.
సంభాషణకు ప్రాధాన్యత ఇవ్వండి
పడుకునే ముందు మీ భాగస్వామితో ప్రేమగా,ఆప్యాయతగా మాట్లాడండి. సరదాగా కబుర్లు చెప్పుకోండి. కావాలనుకుంటే ఆఫీసు జరిగిన లేదా పని ప్రదేశంలో జరిగిన ఒక ఫన్నీ సంఘటనను కూడా షేర్ చెప్పుకొని నవ్వుకోండి. ఇది మీ సంబంధంలో స్నేహాన్ని చెక్కుచెదరకుండా ఉంచుతుంది.
ఒకే సమయంలో నిద్రపోవడం
ప్రతిరోజూ ఒకే సమయంలో మీ భాగస్వామితో నిద్రించడానికి ప్రయత్నించండి. ఇది ఒక మంచి అలవాటును ఏర్పరుస్తుంది. దీంతో మీరు మీ భాగస్వామితో వ్యక్తిగత సమయాన్ని గడపాలని కోరుకుంటారు, ఇది శారీరక సాన్నిహిత్యానికి కూడా దారితీస్తుంది. ఫలితంగా మీ మధ్య అనుబంధం బలంగా ఉంటుంది. ప్రతి రాత్రి పడుకునే ముందు పాత రోజుల్లో లాగా మీ భాగస్వామికి నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పండి. ప్రేమ అన్ని సంబంధాలను నిలబెట్టగలదు.
స్పర్శకు ప్రాధాన్యత ఇవ్వండి
ప్రతి రాత్రి శృంగారం అవసరం లేకపోయినప్పటికీ సంబంధంలో స్పర్శ చాలా ముఖ్యం. లైంగికేతర ఆప్యాయతలో మునిగిపోండి. మీ భాగస్వామిని ముద్దు పెట్టుకోండి, కౌగిలించుకోండి. ఇది మీ సంబంధంలో వెచ్చదనాన్ని కాపాడుతుంది.
టీవీలు, డెస్క్ టాప్ లు వద్దు
వీలైతే, బెడ్‌రూమ్‌లో టీవీ,ల్యాప్ టాప్, కంప్యూటర్ వంటివి ఉంచొద్దు. ఇవి భార్యాభర్తల ప్రైవేట్ సమయాన్ని నాశనం చేస్తాయి.
పిల్లలకు వేరే బెడ్ రూమ్
పిల్లల బెడ్‌రూమ్‌ను వేరుగా ఉంచండి. తల్లిదండ్రులకు కూడా వ్యక్తిగత సమయం అవసరమని వారికి వివరించండి. ఈ చిన్న మార్పులు మీ బెడ్ రూమ్‌లో కొత్త ఉత్తేజాన్ని నింపుతాయి, మీ బంధాన్ని మరింత బలపరుస్తాయి.



Click it and Unblock the Notifications