Latest Updates
-
నార్త్ స్టైల్ చోలే మసాలా.. పూరీ, చపాతీలోకి వేళ్లు చప్పరిస్తూ లాగించేస్తారు.! -
చికెన్, మటన్ కంటే 50 రెట్లు బలం..ఏడాది పాటు నిల్వ ఉండే బోడకాకరకాయ పచ్చడి ఇలా చేయండి -
వయసు పైబడితేనే అల్జీమర్స్ వస్తుందా.. మతిమరుపునకు దారితీసే ప్రమాదకర కారకాలివే.! -
ఉద్యోగం వదిలి వ్యాపారం చేస్తే... ఈ రాశుల వారు కోటీశ్వరులు అవ్వడం పక్కా! -
నాన్‌వెజ్ అనుకుంటే పప్పులో కాలేసినట్లే.. వెజ్ ప్రియుల కోసం స్పెషల్ లివర్ ఫ్రై.. రెస్టారెంట్ టేస్ట్‌తో.! -
అమ్మమ్మల నాటి చిట్కా..గ్యాస్, ఎసిడిటి,అజీర్తి సమస్యలకు చెక్! -
కృష్ణాష్టమి ఉపవాసం ఉంటున్నారా? అయితే నీరసం రానివ్వని ఈ సగ్గుబియ్యం వడలు ట్రై చేయండి! -
పెళ్లిళ్లు, పండుగల్లో అమ్మాయిలూ జాగ్రత్త.. మెహందీ పెట్టుకుంటే పొట్ట ఇన్ఫెక్షన్ల ప్రమాదం.! -
ఉప్మా తినడం ఇష్టం లేని వారికి రవ్వతో ఇలా చేసి పెట్టండి.. లొట్టలేసుకుంటూ తినేస్తారు.! -
జన్మాష్టమి రోజు ద్వాపర యుగం నాటి అరుదైన సంఘటన.. ఈ ఐదు రాశుల వారిపై కృష్ణయ్య కటాక్షం.!
మీ భాగస్వామి ఈ విషయాల్లో మీకు దూరంగా ఉంటున్నారా.. ఈ సంకేతాలతో చాలా డేంజర్.!
ప్రేమ, పెళ్లి బంధం ఏదైనా భాగస్వాముల మధ్య భావోద్వేగపరంగా ఇద్దరి మధ్య సరైన అవగాహన ఉండాలి. లేదంటే ఆ బంధానికి అర్థమే ఉండదు. కాగా, మీ బంధంలో భాగస్వామి మీతో భావోద్వేగపరంగా దూరంగా ఉన్నాడని తెలిపే కొన్ని సంకేతాలను హెచ్చరికగా భావించాలని మనస్తత్వ నిపుణులు సూచిస్తున్నారు.

ప్రతి రిలేషన్‌షిప్ భిన్నంగా ఉంటుంది. ప్రతి బంధంలో భాగస్వాములు ఎప్పుడూ ఒకే విధంగా ప్రవర్తించరు. కానీ వారి మధ్య శారీరకంగా, మానసికంగా సరైన అవగాహన ఉండాలి. అది వారి వారి ప్రవర్తన మీద ఆధారపడి ఉంటుంది. ఈ క్రమంలో ఇద్దరి మధ్యా బావోద్వేగ దూరం, సంభాషణ లోపం, గౌరవం కోల్పోవడం వంటి కారణంగా రిలేషన్‌షిప్ క్షీణించిపోతుందని నిపుణులు పేర్కొంటున్నారు.
బంధం ఎప్పుడూ 'విడిపోవడం' అనే మాటతోనే ముగిసిపోదని నిపుణులు చెబుతున్నారు. విడాకులు తీసుకోవాలనుకునే నిర్ణయానికి ముందే మనసులో ఒక నిర్ణయానికి వస్తారు. గతంలో ఉన్న ఆత్మీయత, ప్రేమ తగ్గిపోతుంది.
భావోద్వేగ పరంగా దూరం..
బంధంలో కొందరు భాగస్వామితో కలిసి ఉండాలని భావించలేనప్పుడు వారు నేరుగా ఆ విషయాన్ని చెప్పలేరు. తమ చేష్టలు, ప్రవర్తన ద్వారా వారికి తమ ఉద్దేశాన్ని తెలియజేయాలని భావిస్తారు. ఫోన్ కాల్స్‌కి దూరంగా ఉండటం, చాటింగ్, మెసేజ్‌లలో తక్కువగా స్పందించడం, భాగస్వామితో సమయం కేటాయించలేకపోవడం, మానసికంగా వారికి దూరంగా ఉండటం, ఏ విషయాలూ చెప్పుకోవడానికి ఇష్టపడకపోవడం వంటి వాటి ద్వారా తమ ఉద్దేశాన్ని తెలియజేస్తారు. వీటిని సాధారణ సంకేతాలుగా భావించాలని నిపుణులు సూచిస్తున్నారు.

గౌరవం ఇవ్వకపోవడం
ప్రతి బంధానికి ప్రేమ తర్వాత గౌరవం పునాదిగా ఉంటుంది. ఒకరిపై ఒకరికి గౌరవం ఉండటం ద్వారా బంధం కలకలం నిలుస్తుంది. అయితే మీ భాగస్వామి మీ భావాలను పట్టించుకోకపోవడం, మీ లిమిట్స్‌ను గౌరవించకోవడం, పదే పదే మీరు అపరాధ భావానికి గురిచేయాలని ప్రయత్నించడం వంటి వాటిని తీవ్రమైన సంకేతాలుగా గమనించాలి. ప్రతి బంధంలో అభిప్రాయ భేదాలు వస్తుంటాయి. కానీ ప్రతిసారి మీపై అసహనం, అగౌరవం ప్రదర్శిస్తే భాగస్వామి ప్రవర్తన పట్ల అప్రమత్తంగా ఉండాలి.
మీ భాగస్వామి మీతో తరచూ గొడవ పడటానికి ప్రయత్నిస్తున్నప్పుడు మీరు ఆ బంధాన్ని కాపాడుకోవడానికి నిరంతరం ప్రయత్నిస్తూ ఉంటారు. రిలేషన్‌షిప్‌ను చక్కదిద్దుకోవడానికి ప్రయత్నిస్తారు. కానీ ఎదుటి వ్యక్తి ఆ భావన లేకుండా ఉన్నప్పుడు, మీ నుంచి దూరం పాటించాలని భావించినప్పుడు ఆ సంబంధాన్ని కాపాడుకోలేరు.
అనుమానమొస్తే ఏం చేయాలి..
మీ భాగస్వామి నిరంతరం మీతో భావోద్వేగపరమైన దూరాన్ని పాటిస్తున్నారని మీకు అనిపించినట్లయితే.. ముందుగా మీరు తనతో బహిరంగంగా, గౌరవప్రదంగా మాట్లాడటానికి ప్రయత్నించండి. మీ ఆలోచనలను స్పష్టంగా తెలియజేయండి. తర్వాత ఎదుటి వ్యక్తి ఆలోచనలను, అభిప్రాయాలను వినండి. అయినప్పటికీ మార్పు లేకపోతే మీ ఆత్మగౌరవానికి, మానసిక ఆరోగ్యానికి, భావోద్వేగ భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ నిర్ణయం తీసుకోవడం మంచిది.



Click it and Unblock the Notifications