Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
Chanakya Niti: జీవిత భాగస్వామిని ఎంచుకునేటప్పుడు ఈ తప్పులు చేయకండి!
ఆచార్య చాణక్యుడు కేవలం గొప్ప ఆర్థికవేత్త, రాజకీయ దురంధరుడు మాత్రమే కాదు మానవ సంబంధాల లోతులను క్షుణ్ణంగా పరిశీలించిన గొప్ప సామాజిక తత్వవేత్త కూడా. కొన్ని వందల ఏళ్ల క్రితం ఆయన చెప్పిన చాణక్య నీతి నేటికి కూడా అక్షర సత్యంలా వర్తిస్తుంది.
మనిషి విజయానికి, పతనానికి కారణం ఎంచుకునే మార్గం మాత్రమే కాదు..ఎంచుకునే జీవిత భాగస్వామి కూడా అని చాణక్యుడు బలంగా విశ్వసించాడు. ప్రేమ, పెళ్లి అనేవి జీవితాన్ని మలుపు తిప్పే కీలక ఘట్టాలు. అందుకే జీవిత భాగస్వామిని ఎంచుకునే విషయంలో ఏమాత్రం అజాగ్రత్త పనికిరాదని ఆచార్యుడు హెచ్చరించాడు.

చాణక్యుడి ప్రకారం సుఖవంతమైన దాంపత్య జీవితం కోసం మీరు ఎలాంటి వ్యక్తులను ఎంచుకోవాలి? ఎవరికి దూరంగా ఉండాలి? అనే విషయాలను ఇక్కడ చూడండి.
సమాన స్థాయి ఉన్నవారితోనే సంబంధం
చాణక్యుడి ప్రకారం ఫ్రెండ్ షిప్ లేదా పెళ్లి ఎప్పుడూ ఇద్దరు సమాన స్థాయి వ్యక్తుల మధ్యే ఉండాలి. ఇక్కడ సమానత్వం అంటే కేవలం ఆర్థిక స్థితి మాత్రమే కాదు..వయసు, ఆలోచనా విధానం, కుటుంబ నేపథ్యం, విద్యా అర్హతలు కూడా.
అసమాన వ్యక్తుల మధ్య సంబంధం ఎప్పుడూ నిలవదు అని చాణక్యుడు స్పష్టం చేశాడు. ఆలోచనల్లో లేదా అంతస్తులో విపరీతమైన తేడాలు ఉన్నప్పుడు వారి మధ్య అవగాహన లోపిస్తుంది. ఒకరి పట్ల మరొకరికి న్యూనతా భావం లేదా ఆధిపత్య ధోరణి ఏర్పడి, ఆ బంధం ముక్కలయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి మీ ఆలోచనలకు, మీ స్థాయికి దగ్గరగా ఉండేవారితో ప్రేమ సంబంధం పెంచుకోవడం ఉత్తమం.
సహనం..విజయానికి సోపానం
చాణక్యుడి ప్రకారం స్త్రీకైనా, పురుషుడికైనా ఉండాల్సిన ప్రధాన లక్షణం సహనం. పెళ్లికి ముందే మీ భాగస్వామి సహనాన్ని పరీక్షించాలని చాణక్యుడు సూచించాడు. ఎవరైతే ఓర్పు కలిగి ఉంటారో, వారు కష్టకాలంలో భయపడి పారిపోరు. క్లిష్ట పరిస్థితుల్లో మీకు కొండంత అండగా నిలబడతారు.
తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా, కుటుంబాన్ని కాపాడుకునే శక్తి ఓర్పు ఉన్నవారికే ఉంటుంది. అలాంటి వారు మిమ్మల్ని ఎప్పటికీ మోసం చేయరు.
కోపిష్టి వారికి దూరంగా ఉండటమే మేలు
కోపం తన శత్రువు..శాంతమే తనకు రక్ష అనే నానుడి మనకు తెలిసిందే. చాణక్యుడు కూడా ఇదే విషయాన్ని చెప్పాడు. విపరీతమైన కోపం ఉన్న వ్యక్తితో ప్రేమ సంబంధం లేదా వివాహం, నిప్పుతో చెలగాటం లాంటిది. కోపం మనిషి విచక్షణను చంపేస్తుంది.
అమితమైన కోపం ఉన్నవారు తమ చుట్టూ ఉన్న ఆనందాన్ని, ప్రేమని గుర్తించలేరు. చిన్న చిన్న విషయాలకే గొడవలు పడుతూ, మీ మానసిక ప్రశాంతతను దెబ్బతీస్తారు. కోపంలో వారు తీసుకునే నిర్ణయాలు బంధాలను శాశ్వతంగా తెంచేస్తాయి. కాబట్టి జీవితంలో ఆనందం కోరుకునేవారు ముక్కోపులకు దూరంగా ఉండటమే శ్రేయస్కరం.



Click it and Unblock the Notifications