Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
నువ్వు చాలా మంచోడివి అంటారు..కానీ మరోకడిని పెళ్లి చేసుకుంటారు?..దీని వెనుక రహస్యం ఇదే
ఆ అబ్బాయి చాలా మంచివాడు, కానీ అతడు కేవలం నా ఫ్రెండ్ మాత్రమే.. మన మధ్య స్నేహం తప్ప మరేమీ లేదు వంటి మాటలు చాలా మంది అబ్బాయిల చెవుల్లో ఒక పీడకలలా ప్రతిధ్వనిస్తూనే ఉంటాయి. అప్పటివరకు ఎంతో అందంగా సాగిపోతున్న వారి ప్రపంచం ఒక్కసారిగా తలక్రిందులవుతుంది. సినిమా డైలాగ్ లా ఏక్ లడ్కా ఔర్ లడ్కీ కభీ దోస్త్ నహీ హో సక్తే(ఒక అబ్బాయి, ఒక అమ్మాయి ఎప్పటికీ స్నేహితులుగా ఉండలేరు) అని తేలిగ్గా చెప్పొచ్చు, కానీ నిజ జీవితంలో ముఖ్యంగా మంచి అబ్బాయిల విషయంలో ఇది కఠినమైన వాస్తవం. తమ ప్రియమైన వారి దృష్టిలో ఈ మంచి అబ్బాయిలు ఎందుకు కేవలం మంచి స్నేహితులుగా మిగిలిపోతున్నారు? ప్రేమికులుగా ఎందుకు మారలేకపోతున్నారు? దీని వెనుక ఉన్న కొన్ని మానసిక కారణాలు ఏంటో ఇక్కడ చూడండి.
స్నేహాన్ని కోల్పోతామనే భయం
ప్రధాన కారణాల్లో ఒకటి..భావాలను వ్యక్తపరచడంలో భయం. ఒకవేళ నా ప్రేమను ఒప్పుకోకపోతే? ఈ ఉన్న స్నేహం కూడా దూరమవుతుందేమో? అనే భయం వారిని నిరంతరం వెంటాడుతుంది. ఆ అమూల్యమైన స్నేహబంధాన్ని కోల్పోవడానికి ఇష్టపడక, తమ మనసులోని మాటను మనసులోనే సమాధి చేసేస్తారు. అయితే అడగందే అమ్మైనా పెట్టదు కదా అన్నట్లుగా మౌనంగా ఉంటే ప్రేమను ఎవరూ గుర్తించలేరు కదా. మాటలతో చెప్పలేకపోయినా, కనీసం మీ ప్రవర్తనలో చిన్నపాటి సూచనలు ఇవ్వడం ద్వారా అవతలి వారికి మీ మనసులోని మాటను చేరవేయవచ్చు. ఆ మౌనం అనే పొగను తొలగించవచ్చు.

ఆత్మవిశ్వాసం లోపించడం
రెండవ ముఖ్యమైన అడ్డంకి ఆత్మవిశ్వాసం లోపించడం. చాలామంది మంచి అబ్బాయిలు తమపై తమకు సరైన నమ్మకం లేకుండా, ఒకరకమైన ఆత్మన్యూనతా భావంతో ఉంటారు. తను దేవతలాంటిది, నేను తన పక్కన సరిపోను లేదా నాలాంటి వాడిని తను ప్రేమిస్తుందా? వంటి ఆలోచనలతో తమను తాము తక్కువ చేసుకుంటారు. ఆకర్షణకు పునాది ఆత్మవిశ్వాసమే. మిమ్మల్ని మీరు గౌరవించుకున్నప్పుడే, ఇతరులు కూడా మిమ్మల్ని గౌరవిస్తారు, ఇష్టపడతారు. మీ కలల రాకుమారి మీకు దక్కదని మీరే నిర్ణయించుకుంటే అది నిజమయ్యే అవకాశాలే ఎక్కువ.
తిరస్కరణ, పరువు భయం
ఇక మూడోది తిరస్కరణ భయం. ప్రేమను వ్యక్తపరిస్తే అందరి ముందు నా పరువు పోతుందేమో.. తన దృష్టిలో నా గౌరవం సున్నా అయిపోతుందేమో అనే భయం అబ్బాయిల మనసుల్లో గూడుకట్టుకుని ఉంటుంది. ఇది సహజమే అయినా ఈ భయం అనే సంకెళ్లను తెంచుకుంటేనే ప్రేమ అనే స్వేచ్ఛా ప్రపంచంలోకి అడుగుపెట్టగలరు. ఓటమిని అంగీకరించడానికి సిద్ధపడినవాడే గెలుపుకు అర్హుడు. అలాగే తిరస్కరణకు భయపడనివాడే ప్రేమ సముద్రంలో ఆనందంగా ఈదగలడు.

అతిగా అందుబాటులో ఉండటం
చివరిగా అతి మంచితనం. మంచి మనసున్న వ్యక్తులు తమ గురించి కంటే ఇతరుల సంతోషానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఇది గొప్ప గుణమే అయినా ప్రేమ విషయంలో కొన్నిసార్లు ఇది నెగిటివ్ గా మారుతుంది. ఎప్పుడూ, ఏ సమయంలోనైనా అవతలి వ్యక్తికి అందుబాటులో ఉండటం, వాళ్లు ఏది అడిగినా కాదనకుండా చేయడం వల్ల మీ విలువ తగ్గిపోయే ప్రమాదం ఉంది. మిమ్మల్ని వారు తేలికగా తీసుకుంటారు. అప్పుడప్పుడు కొంచెం దూరం పాటించండి. మీ ప్రాముఖ్యతను, మీ లేని లోటును వారికి అర్థమయ్యేలా చేయండి. అప్పుడే మీపై గౌరవం, ఆరాధన పెరుగుతాయి.



Click it and Unblock the Notifications