For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అఘోరా సాధువుల గురించి తక్కువగా తెలిసిన 11 వాస్తవాలు

అఘోరా సాధువుల గురించి తక్కువగా తెలిసిన 11 వాస్తవాలుకుళ్ళిపోయిన మాంసం తినడం, నగ్నంగా తిరగడం, వంటి చర్యలు ద్వారా వారికి ఇతర ఐచ్చిక సుఖాల మీద వ్యామోహం లేదని బహిరంగ పరుస్తారు.

|

మనం తరచూ అఘోరా సాధువులు అని వింటూనే ఉంటాము. మరియు ఈ పదం శ్లోకాలతో, పురాణాలతో సంబంధం ఉందని కూడా మనకు తెలుసు. ఎక్కువగా శరీరాన్ని చితా భస్మంతో కప్పుకుని భయం గొల్పే వేషధారణతో ఉండే వీరు అతీంద్రియ శక్తులు లేదా దైవిక శక్తులు కలిగి ఉన్నవారిగా ప్రజలు నమ్ముతారు. ఇంత భయానక జీవనాన్ని గడుపుతున్న వీరు పరిశుద్దాత్ములుగా చెప్పబడుతున్నారు.

మానవాతీత శక్తులు కలిగిన వీరు, అవసరాన్ని బట్టి మనుషులకు సైతం హాని కలిగించే క్షుద్ర పూజలకు కూడా పూనుకోగలరని చెప్తారు. మరికొందరి పరిశోధనలు, మరియు ఇప్పటిదాకా ప్రాచుర్యంలో ఉన్న విషయాల ప్రకారం చితిమీది మానవ మృతదేహం నుండి విసర్జనల వరకు వీరికి ఆహారం కానిది లేదు. ఈమద్యే జరిగిన ఒక మీడియా రిపోర్టర్ పరిశోధనలో కూడా కొన్ని నిజాలు బహిర్గతమయ్యాయి. సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతున్న వీడియోలలో ఇది కూడా ఒకటి.

11 Lesser Known Facts About The Aghori Sadhus

ఇప్పుడు చెప్పబోయే 11 అంశాలు అఘోరాల గురించి తక్కువగా తెలిసిన వాస్తవాలు. ఇంకెందుకు ఆలస్యం, ఒకసారి మీరు కూడా చూడండి.

అఘోరా సాధువులు శివుని భక్తులు.

అఘోరా సాధువులు శివుని భక్తులు.

1. అఘోరా సాధువులు శివుని భక్తులు. వారు సన్యాస రూపాన్ని తీసుకొని, వింత వింత మార్గాల్లో శివుడిని పూజిస్తారు. వాస్తవానికి, ప్రజలు శివుని అవతారాలుగా కూడా నమ్ముతారు.

 అఘోరా సాధువుల ప్రకారం మానవుని ఆత్మలు

అఘోరా సాధువుల ప్రకారం మానవుని ఆత్మలు

2. అఘోరా సాధువుల ప్రకారం మానవుని ఆత్మలు అనేక లోప భూయిష్టాలుగా ఉంటాయని నమ్ముతారు. మానవులు లోపాలతో జన్మించారు లేదా భౌతిక ప్రపంచం యొక్క తీవ్ర ప్రభావంగా వీరి రూపాలు సంతరించుకున్నాయి అని భావన అఘోరాలది. ముఖ్యంగా ఈ లోపాలు ఇంద్రియాలకు సంబంధించిన ఆనందం, దురాశ, ద్వేషం, కామము, కోపం మొదలైన అంశాలతో కూడి ఉంటాయి.ఇవి ప్రధానమైన ఎనిమిది అష్టమహాపాశాలలో ముఖ్యమైనవిగా వ్యవహరించబడుతాయి. మిగిలిన లోపాలు కూడా ఇతర పేర్లతో పిలవబడుతున్నాయి. వీరి ప్రధాన లక్ష్యం ఈ దోషాలను నిర్మూలించడం, క్రమంగా అతీత శక్తిని మరియు శివానుగ్రహాన్ని పొందడం.

 ఈ లక్ష్యం సాధన కోసం,

ఈ లక్ష్యం సాధన కోసం,

3. ఈ లక్ష్యం సాధన కోసం, వారు స్మశానాలలో సాధన (తపస్సులు) చేస్తూ ఉంటారు. ఎనిమిది కోరికలు, అష్టమహాపాశాలు, బానిసత్వం నుంచి విముక్తి పొందడం అనేవి ప్రధానంగా మోక్ష ప్రాప్తికై సూచించబడిన అంశాలుగా ఉన్నాయి. శివానుగ్రహానికి సరైన మార్గంగా వీరు భావిస్తారు.

 సాధారణంగా వీరు చేసే సాధన మూడు రకాలుగా విభజించబడింది

సాధారణంగా వీరు చేసే సాధన మూడు రకాలుగా విభజించబడింది

4. సాధారణంగా వీరు చేసే సాధన మూడు రకాలుగా విభజించబడింది. శివ సాధన, శవ సాధన, మరియు స్మశాన సాధన. అనగా శివుని ముందు తపస్సు, శవo ముందు తపస్సు మరియు స్మశానంలో తపస్సు.

కుళ్ళిపోయిన మాంసం తినడం, నగ్నంగా తిరగడం, వంటి చర్యలు ద్వారా వారికి ఇతర ఐచ్చిక సుఖాల మీద వ్యామోహం లేదని బహిరంగ పరుస్తారు.

 మృతదేహం మీద ఒక కాలు మీద నిలబడి దైవ ప్రార్ధన చేస్తారని నమ్ముతారు.

మృతదేహం మీద ఒక కాలు మీద నిలబడి దైవ ప్రార్ధన చేస్తారని నమ్ముతారు.

5. మృతదేహం మీద ఒక కాలు మీద నిలబడి దైవ ప్రార్ధన చేస్తారని నమ్ముతారు. ఇక్కడ ప్రధాన ప్రేరణ పార్వతి శివుడిపై నిలబడి ఉంది అని భావించడమే. వారు చనిపోయిన శరీరాన్ని కూడా ప్రసాదంగా భావించి స్వీకరిస్తారు.

శ్మశాన సాధన చేస్తున్నప్పుడు,

శ్మశాన సాధన చేస్తున్నప్పుడు,

6. శ్మశాన సాధన చేస్తున్నప్పుడు, వారు సమాధి మీద ప్రార్ధనలు చేస్తారు మరియు సమాధికి స్వీట్లు, గంగాజలాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు. శవ సాధనలో మాంసాన్ని ప్రసాదంగా భావిస్తారు, అలా కాకుండా శ్మశాన సాధనలో పైన చెప్పిన వాటిని ప్రసాదంగా భావిస్తారు.

 మరో నమ్మకం ప్రకారం మృతదేహాల కోసం

మరో నమ్మకం ప్రకారం మృతదేహాల కోసం

7. మరో నమ్మకం ప్రకారం మృతదేహాల కోసం అఘోరా సాధువులు అన్వేషణ సాగిస్తుంటారు. చనిపోయి ఖననం చేయబడకపోయినా, లేదా మరుగునపడిపోయిన శవాలను సైతం సులభంగా కనుక్కోగల సామర్ధ్యం వీరిది. వీటిని ఆహారంగా లేదా ప్రసాదంగా స్వీకరిస్తారు.

వారు పగటి సమయములో నిద్రిస్తున్నప్పుడు,

వారు పగటి సమయములో నిద్రిస్తున్నప్పుడు,

8. వారు పగటి సమయములో నిద్రిస్తున్నప్పుడు, భయపెట్టే ఆచారాలను ప్రదర్శిస్తూ, స్మశానాలలో రాత్రులు మొత్తం ఖర్చు చేస్తారు. ఎక్కువగా వీరి సాధన స్మశానాలలోనే ఉంటుంది కాబట్టి, ఎక్కువగా అక్కడే ఉండుటకు మొగ్గు చూపుతుంటారు.

మరొక నమ్మకం ప్రకారం వారు చనిపోయినవారితో సైతం మాట్లాడగలరు

మరొక నమ్మకం ప్రకారం వారు చనిపోయినవారితో సైతం మాట్లాడగలరు

9. మరొక నమ్మకం ప్రకారం వారు చనిపోయినవారితో సైతం మాట్లాడగలరు. వారి ఆచారాల ద్వారా, దేహం నుండి వెళ్ళిపోయిన ఆత్మలతో సైతం తిరిగి సంబంధాలను ఏర్పరచుకోవచ్చు, క్రమంగా వారి ఆలోచనలను తెలుసుకునే ప్రయత్నం చేస్తారని నమ్మకం.

 కొంత మంది అఘోరా సాధువులు శవ సాధనని ప్రదర్శిస్తున్నప్పుడు,

కొంత మంది అఘోరా సాధువులు శవ సాధనని ప్రదర్శిస్తున్నప్పుడు,

10. కొంత మంది అఘోరా సాధువులు శవ సాధనని ప్రదర్శిస్తున్నప్పుడు, క్షుద్ర దేవత అయిన తారా దేవి తన అతీంద్రియ శక్తులతో వీరిని ఆశీర్వదిస్తుందని నమ్ముతారు. ప్రధానమైన 10 మంది క్షుద్ర దేవతలలో తారాదేవి కూడా ఒకరు. సిద్ది కోసం, అతీంద్రియ శక్తుల కోసం తారాదేవిని వశపరచుకునే క్షుద్ర పూజలను పాటిస్తారని నమ్మకం. కానీ ఎట్టిపరిస్థితుల్లోనూ తమ తాంత్రిక శక్తులను మానవాళికి హాని చేయడానికి వినియోగించరని చెప్తారు కూడా. కానీ ఎంతవరకు వాస్తవమో ఎవరికీ తెలీదు.

కొన్ని కథనాల ప్రకారం దత్తాత్రేయుడు అఘోరి సంప్రదాయం యొక్క స్థాపకుడు

కొన్ని కథనాల ప్రకారం దత్తాత్రేయుడు అఘోరి సంప్రదాయం యొక్క స్థాపకుడు

11. కొన్ని కథనాల ప్రకారం దత్తాత్రేయుడు అఘోరి సంప్రదాయం యొక్క స్థాపకుడు లేదా ఆది గురు అని చెబుతారు. దత్తాత్రేయుని హిందూ గ్రంథాలలో అఘోరా సాధువుగా వర్ణించబడింది, క్షుద్ర పూజలను, తాంత్రిక్ ఆచారాలను ఎడమ చేతితో ప్రదర్శిoచగల శక్తులు వీరి సొంతం.

పురాతన కాలం నుండి ప్రాచీన సంప్రదాయాలకు ముడిపడిన వ్యక్తులుగా ఈ అఘోరా సాధువులు ఉన్నారు. అప్పటి నుండి ఇప్పటి వరకూ అనేక సాంప్రదాయాలు, నాగరికతలలో మార్పులు చోటు చేసుకున్నా వీరి విధివిధానాలు పూజా పద్దతులలో మాత్రం ఎటువంటి మార్పులూ చోటు చేసుకోలేదు. వీరి గురించిన అనేక కథనాలు, వాస్తవాలే కాకుండా కొన్ని అవాస్తవాలు కూడా ప్రచారంలో ఉన్నాయి.

కుంభమేళా వంటివి జరిగినప్పుడు, వీరు ఎక్కువ మోతాదులో వచ్చి కార్యక్రమాలలో పాలుపంచుకుని తిరిగి వెళ్తారని, కొంత దూరం తర్వాత వీరు అదృశ్యమవుతారన్న పుకార్లు కూడా మనుగడలో ఉన్నాయి. కాని ఎంత వరకు వాస్తవం అనేది నేటికీ తేలని అంశంగా ఉన్నది. అనేక మంది ప్రకారం వీరి రూపంలో నరమాంసభక్షకుల ఉనికి ఉందని కూడా వాదిస్తారు.

ఈవ్యాసం మీకు నచ్చినట్లయితే, మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆసక్తికర, వింతైన, ఆధ్యాత్మిక, రాశిచక్ర, హస్త సాముద్రిక సంబంధిత అంశాలకోసం బోల్డ్స్కీ పేజీని తరచూ సందర్శించండి. మీ విలువైన వ్యాఖ్యలను అభిప్రాయాలను క్రింది వ్యాఖ్యల విభాగంలో తెలియజేయండి.

English summary

11 Lesser Known Facts About The Aghori Sadhus

Aghoris believe that all humans are born as Shiva, but they acquire flaws over time which become distractions in attaining salvation. In order to get rid of these flaws, which they denote as Ashtamahapasa, they perform three types of sadhanas: Shiva Sadhana, Shav Sadhana and Smashan Sadhana. They believe that these sadhanas (penances)
Desktop Bottom Promotion