Latest Updates
-
జెన్ జెడ్ తరానికి శ్రీకృష్ణుడి సందేశం.. గీత నుంచి నేటి యువత నేర్చుకోవాల్సిన కీలక పాఠాలివే.! -
కేవలం 15 నిమిషాల్లో.. పైకి కరకరలాడుతూ, లోపల సాఫ్ట్ గా ఉండే ఎగ్ పకోడి ఎలా చేసుకోవాలంటే.. -
కొత్తగా తల్లయిన వారికి అలర్ట్.. పిల్లలకు రెండేళ్ల వరకు ఇదొక్కటి అస్సలు ఇవ్వకూడదు.! -
ఉట్టికి, చిన్ని కృష్ణుడికి సంబంధమేంటి.. కృష్ణాష్టమికి ఉట్లు ఎందుకు కొడతారో తెలుసా.? -
గుడిలో పెట్టే ప్రసాదం రుచితో.. ఈ జన్మాష్టమికి ఇంట్లోనే కమ్మని పంచామృతం చేసుకోండిలా.. -
చుక్క నూనె లేకుండా లంచ్ బాక్స్‌లోకి ఈజీగా చేసెయొచ్చు.. రక్తహీనతని సైతం తరిమికొట్టేస్తుంది.! -
Powerful Krishna Mantras: కృష్ణాష్టమి నాడు ఈ మంత్రాలు జపిస్తే.. మీ కోరికలన్నీ ఇట్టే నెరవేరుతాయి! -
యదా యదా హి ధర్మస్య.. శ్రీకృష్ణుడి స్ఫూర్తితో మీ బంధుమిత్రులకు జన్మాష్టమి శుభాకాంక్షలు చెప్పండిలా! -
బుధ గ్రహ గోచారం: అదృష్టం అంటే వీరిదే.. సెప్టెంబర్ 7 నుంచి ఈ నాలుగు రాశుల వారికి గోల్డెన్ డేస్.! -
కృష్ణాష్టమి స్పెషల్ అటుకులు నువ్వుల లడ్డూ..10 నిమిషాల్లోనే ఎలా చేసుకోవాలంటే..
బుద్దుని గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ..!
ఙానోదయమైన గురువులలో బుద్ధుడు చాలా ప్రసిద్ధి.ఈ ప్రపంచం యొక్క నిజ స్వరూపాన్ని తెలుసుకోవడానికి బుద్ధుడు చిన్న వయస్సులోనే ఇల్లు వదిలిపెట్టి ఆనాడు అమలులో ఉన్న వివిధ మార్గాలు, పద్ధతులని అనుసరించి,అనేక మంది ఆధ్యాత్మిక గురువులతో సాంగత్యం చేసి చివరికి 35 సంవత్సరాల వయస్సులో ఙానోదయాన్ని పొందాడు.
ఆ తరువాత బౌద్ధాన్ని గురించి తెలుసుకుని ప్రపంచమంత పర్యటిస్తూ ధర్మ ప్రచారం చేసి 80 సంవత్సరాల వయస్సులో నిర్యాణమొందాడు.
బుద్ధుని గురించి 12 ఆసక్తికర వాస్తవాలు:

బుద్దుని జీవితం గురించి కొన్ని ఆసక్తికర విషయాలు..
మొదట్లో బుద్ధుడు ఆడవారిని సన్యాసాశ్రమంలోకి అనుమతించలేదు. కానీ తనని పెంచి పెద్ద చేసిన మేనత్త తనకి సన్యాసమిమ్మని వచ్చేసరికి కాదనలేక అప్పటినుండీ ఆడవారికి కూడా సన్యాసాశ్రమ ప్రవేశాన్ని కల్పించాడు.

బుద్దుని జీవితం గురించి కొన్ని ఆసక్తికర విషయాలు..
ఆడవారు కూడా తాను స్థాపించిన బౌద్ధంలోకి రావడం మొదలయ్యాకా 2500 సంవత్సరాలపాటు మనగలిగిన బౌద్ధం 500 సంవత్సరాలపాటు మాత్రమే ఉంటుందని చెప్పాడు.

బుద్దుని జీవితం గురించి కొన్ని ఆసక్తికర విషయాలు..
బుద్దుడు మరియూ మహావీరుని(జైన తీర్థంకరులలో చివరి వాడు) మతంలో దాదాపు నలభై వేల మంది సన్యాసినులు ఉండేవారు.వీరి సంఖ్య పురుష సన్యాసుల కంటే ఎక్కువ. ఆడ మరియూ మగ సన్యాసుల నిష్పత్తి 3:1లో ఉండేదిట.

బుద్దుని జీవితం గురించి కొన్ని ఆసక్తికర విషయాలు..
బుద్ధుడు పుట్టగానే బుద్ధుని తండ్రితో చాలా మంది జ్యోతీష్కులు ఈయన పేరొందిన మహారాజు లేదా సాధువు అవుతాడని చెప్పారు.కానీ ఒక్క యువ జ్యోతీష్కుడు మాత్రం ఈయన ఖచ్చితం పెద్ద ఆధ్యాత్మిక సాధువు అవుతాడని చెప్పాడుట.కానీ బుద్ధుని తండ్రి ఈ యువ జ్యోతీష్కుని మాటలు పెడ చెవిన పెట్టి తన కొడుకు సన్యాసం స్వీకరించకుండా ఏమి చెయ్యాలని ఇతర జ్యోతీష్కులని అడిగాడు.చావు అంటే ఏమిటో తెలియకుండా చేస్తే మంచిది అనడంతో అసలు ఎవ్వరూ మరణించడం లేదా రోగగ్రస్తులవ్వడం బుద్ధుడు చూడకుండా పెంచారు. ఎంత కట్టుదిట్టంగా పెంచారంటే పెరటిలో రాలి పడిన ఎండు ఆకులు కూడా బుద్ధుని కంట పడకుండా చూసేవారుట.

బుద్దుని జీవితం గురించి కొన్ని ఆసక్తికర విషయాలు..
గత జన్మలో బుద్ధుడు ఙానోదయమైన ఒక ఆధ్యాత్మిక గురువు పాదాలని స్పృశించగానే ఆ గురువు తిరిగి బుద్ధుని పాదాలు పట్టుకున్నాడు. తాను సామాన్యుడిని మాత్రమే కావున గురువు గారు ఇలా ఎందుకు చేసారని బుద్ధుడు అడుగగా ఆ గురువుగారు నీవు ఈ జన్మలో ప్రస్తుతం కాలం బుద్ధుడిని చూస్తున్నావు కానీ నేను రాబోయే బుద్ధుని పాదాలు పట్టుకుంటున్నాను, నువ్వే బుద్ధునిగా జన్మిస్తావు అని పలికారుట.

బుద్దుని జీవితం గురించి కొన్ని ఆసక్తికర విషయాలు..
"బుద్ధుడు" అనే మాట ఙానోదయమైన అందరికీ వాడే ఒక పదం మాత్రమే.ఒక మనిషి బుద్ధుడు అయ్యాడు అంటే బుద్ధు(అవివేకం) నుండి బుద్ధి(వివేకం) లోకి ప్రయాణించడమే.ప్రతీ ఒక్కరు ఎప్పుడో ఒకప్పుడు ఈ ప్రయాణం మొదలెట్టాల్సిందే. మనందరిలోనూ ఈ మార్గంలో వెళ్ళడానికి కావాల్సిన శక్తి దాగి ఉంది.బుద్ధుని చివరి సందేశం "మీ పట్ల మీరు జాగురూకులై ఉండండి".అనగా మీలోనికి వెలుతురుని ప్రసరింపచేసుకుని అనేక జన్మలనుండీ ఉన్న అఙాన చీకట్లని పారద్రోలమని.

బుద్దుని జీవితం గురించి కొన్ని ఆసక్తికర విషయాలు..
బుద్ధుడు తనని తాను తెలుసుకునేందుకు ఇల్లు విడిచిపెట్టినప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు ఎందుకంటే ఇది అస్సలు ఎవరూ ఊహించనిది పైగా అప్పుడే బుద్ధుని భార్య మగపిల్లవాడిని(రాహులుడు) ప్రసవించింది కూడానూ.తప్పించుకోలేని జనన మరణ చక్రం గురించి తెలుసుకున్న బుద్ధుడు ఈ బాధల నివారణకు ఉపాయం కనుగొనదలచి తన ఇంట్లో వాళ్ళకేవరికీ కనీసం భార్యకి కూడా తెలియచేయకుండా ఇల్లు విడిచిపెట్టేసాడు.

బుద్దుని జీవితం గురించి కొన్ని ఆసక్తికర విషయాలు..
బీహార్లోని బోధ్ గయ ప్రాంతంలో బుద్ధునికి ఙానోదయమయ్యింది. ఆ స్థలం ఇప్పటికీ సంరక్షింపబడుతోంది.కానీ ఏ బోధి చెట్టు క్రింద బుద్ధునికి ఙానం కలిగిందో ఆ చెట్టు కాల గర్భంలో కలిసిపోయింది.కానీ అదృష్టవశాత్తూ ఆ చెట్టు యొక్క ఒక కొమ్మని అశోకుడు శ్రీలంకకి పంపి బౌద్ధ వ్యాప్తికి తోడ్పడ్డాడు.ప్రస్తుతం గయలో ఉన్న బోధి చెట్టు శ్రీలంకకి అశోకునిచే పంపబడిన చెట్టు నుండి కొమ్మ తీసుకుని పాతగా వెలిసిన చెట్టు.

బుద్దుని జీవితం గురించి కొన్ని ఆసక్తికర విషయాలు..
దేవుడున్నాడని బుద్ధుడు విశ్వసించలేదు.

బుద్దుని జీవితం గురించి కొన్ని ఆసక్తికర విషయాలు..
పొరపాటున విషపూరితమైన పుట్టగొడుగులు తినడంవల్ల బుద్ధుని భౌతిక శరీరం విడిచిపెట్టబడినది.

బుద్దుని జీవితం గురించి కొన్ని ఆసక్తికర విషయాలు..
బుద్ధుడు చక్కగా బోధించగల్గిన ఆచార్యుడు అందువల్లే వేలకొలదీ శిష్యులు బౌద్ధం గురించి ఆయన ద్వారా తెలుసుకోగలిగారు.ఆయన నిర్యాణం తరువాత కూడా అనేక మంది శిష్యులకి ఙానం కలిగింది. ఎందుకంటే ఒక బుద్ధుడు నిర్యాణమొందాకా ఆయన చుట్టూ ఉన్నవారిలో ఙానం ప్రకాశిస్తుందిట.ఇలా అనేకమంది గొలుసుకట్టు చర్యలాగ ఒకరినుండి మరొకరు ఙానం పొందారుట(బుద్ధుడు నిర్యాణమొందాకా ఆత్మ ఙానం కలిగిన మొట్టమొదటి శిష్యుని నుండి మొదలుకొని).ఈ చెయిన్ రియాక్షన్ గురించి తెలుసుకోవాలంటే క్వాంటం ఫిజిక్స్ చదవండి.

బుద్దుని జీవితం గురించి కొన్ని ఆసక్తికర విషయాలు..
ఒక మిత్రుని రూపంలో బుద్ధుడు మరల వస్తాడని చాలా మంది నమ్మకం.తత్వ వేత్త జిడ్డు కృష్ణ మూర్తిగారు కూడా ఇదే నమ్మారు.గౌతమ బుద్ధుని ఆత్మ ఈయన ద్వారా వస్తుందని నమ్మినవారున్నారు.



Click it and Unblock the Notifications