Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
మన ఇండియన్స్ పాటించే కొన్ని శుభ...అశుభ సూచకములు..!
హిందు సాంప్రదాయంలో ఉన్న శుభ....అశుభ శకునాలు..!
మీరు ఏదైనా కార్యం తలెపెట్టేటపుడు మంచి సమయం, శుభ శకునాలను చూస్తారా? అలాంటి వారైతే.. శుభశకునాన్ని ఎలా గుర్తిస్తారు. మంచి శుభ శకునం ఏదైన విషయాన్ని తెలుసుకోవడం ఎలా? వాస్తు శాస్త్రాన్ని అనుసరించే వారు ఇత్యాది విషయాలను తెలుసుకోవడం ఎంతైనా అవసరం. మీరు బయటకు వెళ్ళేసమయంలో ఆకస్మికంగా ఎదురుపడే శకునమే శుభశకునంగా కొందరు వాస్తు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇలాంటి వాటిలో కొన్నింటిని పరిశీలిద్దాం.

హిందు సాంప్రదాయంలో కొన్ని శుభ...అశుభ సూచకములు
మెడలో తాలిబొట్టు, నుదుటన కుంకుమతో మంగళకరంగా కనిపించే ముత్తైదువు ఎదురుగా వస్తే అది మంచి శకునం. ఒక వేళ ముత్తైదువైనప్పటికీ వెంట్రుకలను విరబోసుకుని అమంగళంగా ఎదురుపడితే అశుభ శకునంగా గుర్తించాలని వాస్తుశాస్త్రం చెబుతోంది.

హిందు సాంప్రదాయంలో కొన్ని శుభ...అశుభ సూచకములు
మంచి నీటి బిందె, పాల బిందె, పెరుగు పాత్ర, కల్లుకుండ మోసుకుని వచ్చే వారు, వేశ్య, చాకలివాడు, చెరకు కట్టను మోసుకెళుతున్న వ్యక్తి, జంట బ్రాహ్మణులు వంటివి ఎదురు వచ్చినట్లైతే శుభ సూచకంగా భావించవచ్చు. అయితే ఒంటి బ్రాహ్మణుడు ఎదురురావటం అశుభం.

హిందు సాంప్రదాయంలో కొన్ని శుభ...అశుభ సూచకములు
ఇక పోతే పశుపక్ష్యాదుల్లో నెమలి, కోడి, చిలుక, కొంగ, కుందేలు, నక్క, గ్రద్ద, ఆవు, జింక, ఉడుత, చిరుత వంటివి ఎడమ నుంచి కుడి వైపుగా వెళ్ళాయంటే వీటన్నిటిని శుభశకునాలుగా గుర్తించవచ్చని వాస్తు శాస్త్రం చెబుతోంది.

హిందు సాంప్రదాయంలో కొన్ని శుభ...అశుభ సూచకములు
మనం నడిచే దారిలో వితంతువు ( ఒక వేళా గుండు చేయించు కొన్న) మనలల్ని దాటుకుని వెళ్ళిన అధి అశుభం.

హిందు సాంప్రదాయంలో కొన్ని శుభ...అశుభ సూచకములు
. మనం నడిచే దారిలో మంగళివాడు తన సామగ్రితో మనకు ఎదురు పడినా అధి శుభ సూచకం.

హిందు సాంప్రదాయంలో కొన్ని శుభ...అశుభ సూచకములు
ఎవరైనా మన దారిలో ఒక మైనా పక్షుల జంటను చూసినా అధి శుభ సూచకం .

హిందు సాంప్రదాయంలో కొన్ని శుభ...అశుభ సూచకములు
మన ప్రవేశ ద్వారం(ఇంటి గడప ) మీద నిలబడి తుమ్మిన అధి అశుభం.దీన్ని నివారించాలంటే అదే గడప మీద నిలబడి నెత్తిన పసుపు నీటిని చల్లు కోవాలి.

హిందు సాంప్రదాయంలో కొన్ని శుభ...అశుభ సూచకములు
మన ఇంటిలోకి ప్రవేశించుచున్న ఆవు శుభ సూచకంగా మన పెద్దలు చెప్పుతారు.

హిందు సాంప్రదాయంలో కొన్ని శుభ...అశుభ సూచకములు
మన దేవాలయంలో దేవుడికి వేసిన పూలు,దేవుడికి కుడి ప్రక్కన క్రింద పడినచో అది శుభ సూచకం.

హిందు సాంప్రదాయంలో కొన్ని శుభ...అశుభ సూచకములు
మనం నడిచే దారిలో ఆవును, ఆవుతో పాటు దూడను ఒకే సారి చూచిన ఎడల అది శుభ సూచకం.

హిందు సాంప్రదాయంలో కొన్ని శుభ...అశుభ సూచకములు
మన ఇంటిలో కానీ, కార్యాలయాల్లో కానీ బల్లి అరిచిన అది అశుభం.

హిందు సాంప్రదాయంలో కొన్ని శుభ...అశుభ సూచకములు
మన ఇంటి ఆరు బయట కాకి ,అదే పనిగా అరుస్తుంటే మన ఇంటికి ఎవరో బంధువులు వస్తున్నారు అని సంకేతంగా చెప్పుకోస్తారు మన పెద్దలు

హిందు సాంప్రదాయంలో కొన్ని శుభ...అశుభ సూచకములు
మన ఇంటిలో పెంచుకొనే పెంపుడు కుక్క మనం బయటకు వెళ్ళేతప్పుడు తుమ్మిన అది మనకు శుభ సూచకం.

హిందు సాంప్రదాయంలో కొన్ని శుభ...అశుభ సూచకములు
మనం ఎక్కడికైన బయలుదేరినప్పుడు ఎదురుగా పిల్లి అడ్డు వస్తే అది అశుభ సూచకం. ఆ పనిని వాయిదా వేసుకోవడం మంచిది.

హిందు సాంప్రదాయంలో కొన్ని శుభ...అశుభ సూచకములు
మన రహదారిలో ముంగిస కనపడిన ఎడల అది శుభ సూచకం.

Click it and Unblock the Notifications