For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నవరాత్రుల సందర్భంగా ఈ నాలుగు దుర్గా దేవి మంత్రాల గురించి తెలుసుకోండి.

నవరాత్రుల సందర్భంగా ఈ నాలుగు దుర్గా దేవి మంత్రాల గురించి తెలుసుకోండి.

|

దుర్గా దేవి శక్తి స్వరూపంగా కొలువబడుతుంది. క్రమంగా శక్తి స్వరూపిణి అన్న నామంతో పిలవబడుతుంది కూడా. విశ్వంలోని సకల చరాచర జీవకోటికి తల్లిగా, ప్రతి ఒక్క ప్రాణిని ఆదరించి కాపాడే కల్పతరువుగా కీర్తించబడుతుంది. దుర్గా దేవి అజ్ఞానాన్ని తొలగించి, ఆలోచనా స్థాయిలను పెంచగలిగే శక్తిని కలిగి ఉంటుందని చెప్పబడింది; వస్తుపరమైన ప్రేమలను కలిగి ఉన్న ప్రపంచాన్ని, అజ్ఞానాంధకారాల నుండి బయటవేసి, మానసిక చైతన్యాన్ని పెంపొందించడంలో దుర్గా దేవి కీలకపాత్ర పోషిస్తుందని నమ్మబడింది. మనసు పొరల్లో చీకటిని తొలగించి, సరైన నిర్ణయాలు తీసుకోవడంలో మార్గం సుగమం చేస్తుందని చెప్పబడింది. క్రమంగా జ్ఞాన సరస్వతి రూపంలో కూడా దుర్గాదేవిని పూజించడం జరుగుతుంది. అదేవిధంగా, భయం, అసూయ, ద్వేషం మరియు ఇతర దుష్ట శక్తుల ప్రతికూల ప్రభావాల నుండి తన భక్తులను రక్షిస్తున్న దుర్గా దేవి, మహాకాళిగా కూడా పిలువబడుతుంది.

దుర్గా దేవి ప్రశాంతతకు మారు పేరు, తన భక్తులను ప్రేమగా చూసుకుంటూ, వారి జీవితంలో ఒడిదుడుకులకు తావు లేకుండా, ప్రశాంత వాతావరణం నెలకొనేలా ఆశీస్సులను అందిస్తుంది. ఆమెను ఆరాధించే అత్యంత పవిత్రమైన కాలంగా భావించబడుతున్న నవరాత్రి సమయంలో, భక్తులు దుర్గా దేవిని ఆరాధించడం ద్వారా ఆమెపై ఉన్న భక్తి ప్రపత్తులను చాటుతుంటారు. పూలు, చీర, కొబ్బరి కాయ మరియు ఇతర వస్తువులను సమర్పించడం ద్వారా ఆమెను పూజించడం జరుగుతుంది. దేవతని స్మరిస్తూ, ఆమె ఆశీర్వాదాలను పొందే క్రమంలో మంత్రాలు జపించడం తప్పనిసరిగా చెప్పబడింది.

1. ద్యాన మంత్రం :

1. ద్యాన మంత్రం :

ఓం జటా జూట్ స్మాయుక్తమర్దేందుకృత లక్షణం !

లోచన్యాత్ర స్నాయుక్తం పద్మేందు సాధ్య షాణయం !!

అర్థం

అర్థం

ఈ మంత్రాన్ని ధ్యాన మంత్రం అని పిలుస్తారు, ఈ మంత్రం పూజా సమయంలో ఏకాగ్రత భగ్నం కాకుండా కాపాడుతుంది. దేవతని స్తుతిస్తూ, స్మరించడానికి మాత్రమే కాకుండా, అభ్యాస పఠనంలో ఏకాగ్రతను పెంపొందించుకోవటానికి విద్యార్థులకు దోహదపడే మంత్రంగా చెప్పబడింది.

2. దుర్గ శత్రు శాంతి మంత్రం :

2. దుర్గ శత్రు శాంతి మంత్రం :

రిపవ: సంక్షయం యాంతి కళ్యాణం చోపపద్యతే !

నందతే చ కులం పుంసాం మహాత్మ్యం మమశృణ్వతామ్ !!

శాంతికర్మాణి సర్వత్ర తథా దు:స్వప్న దర్శనే !

గ్రహపీడాసు చోద్రాసు మహాత్మ్యం శృణుయాన్మము!!

Most Read: దసరా నవరాత్రులు: దుర్గా దేవి 9 అలంకరణ రూపాలు ...Most Read: దసరా నవరాత్రులు: దుర్గా దేవి 9 అలంకరణ రూపాలు ...

అర్థం

అర్థం

ఈ దుర్గా దేవి శత్రు శాంతి మంత్రం, దుష్ట శక్తుల నుండి, ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనే క్రమంలో ఎంతగానో దోహదం చేస్తుంది. వ్యక్తి యొక్క జీవితంలో సంతోషాలను మెరుగుపరచడమే కాకుండా అసూయాపరుల నుండి వచ్చే ప్రతికూల శక్తులను నిరోధించడానికి దోహదం చేస్తుంది.

3. సర్వ బద్ద ముక్తి మంత్రం :

3. సర్వ బద్ద ముక్తి మంత్రం :

సర్వ బద్ద వినిర్ముక్తో ధనద్యాన శుతాన్వితః !

మనుష్యో మాత్ప్రసాదేన్ భవిష్యతి న సంశయః !!

అర్థం

అర్థం

ఈ దుర్గా దేవి మంత్రాన్ని సర్వ బద్ద ముక్తి మంత్రంగా చెప్పబడింది. సమస్యల నుండి ప్రజలను విముక్తులను చేయడానికి, పిల్లలు లేని వారికి సంతాన యోగం కలిగేందుకు, ఆరోగ్య, ఆర్దిక పరిస్థితులు మెరుగుపడేందుకు, వృత్తిపరమైన చికాకులు తొలగేందుకు మాత్రమే కాకుండా కుటుంబంలో శాంతిని నెలకొల్పడంలో కూడా ఈ మంత్రం దోహదపడుతుంది.

Most Read:మీ రాశి మీ అంతరాత్మ గురించి ఏం చెబుతోంది ? Most Read:మీ రాశి మీ అంతరాత్మ గురించి ఏం చెబుతోంది ?

4. దుర్గా దుః స్వప్న నివారణ మంత్రం :

4. దుర్గా దుః స్వప్న నివారణ మంత్రం :

శాంతి కర్మాణి సర్వత్ర తధా దుః స్వప్న దర్శనీ !

గ్రహ పిదాసు చోగ్రసు మహాత్మ్యాన్ శృణుయాన్మం !!

అర్థం

అర్థం

పీడ కలలు, భయాలు మరియు చెడు శోషణల మీద విజయం సాధించడానికి దుర్గా దుః స్వప్న నివారణ మంత్రం అని పిలువబడే ఈ మంత్రం జపించడం జరుగుతుంది. మరియు జన్మ కుండలిలో గ్రహాల అననుకూల స్థానాల సమయంలో, ఈ మంత్రం చదవడం ద్వారా సానుకూల ఫలితాలు సిద్ధిస్తాయని భక్తుల నమ్మకం. ఈ మంత్రం భక్తులకు విశ్వాసాన్ని కలిగిస్తుంది, ఎందుకంటే దుర్గా దేవి, వ్యక్తిలో ఆత్మ విశ్వాసం నింపే దేవతగా కీర్తించబడుతుంది కాబట్టి. జీవితంలో సమస్యలను ఎదుర్కొంటున్నప్పుడు ఈ మంత్రం జపించడం ద్వారా సానుకూల ఫలితాలు కలుగుతాయని నమ్మబడింది.

ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆద్యాత్మిక, జ్యోతిష్య, ఆసక్తికర, ఆరోగ్య, జీవన శైలి, ఆహార, వ్యాయామ, లైంగిక తదితర సంబంధిత విషయాల కోసం బోల్డ్స్కై పేజీని తరచూ సందర్శించండి. ఈ వ్యాసం పై మీ అభిప్రాయాలను, వ్యాఖ్యలను క్రింద వ్యాఖ్యల విభాగంలో తెలియజేయండి.

Most Read: పిల్లలు కలగాలంటే ఈ ఆహారాలను తప్పక తినండిMost Read: పిల్లలు కలగాలంటే ఈ ఆహారాలను తప్పక తినండి

English summary

4 Powerful Maa Durga Mantras That You Need To Know

Goddess Durga can remove all types of problems from the lives of her devotees. She bestows the devotees with power and removes ignorance. She takes one from the illusionary world of darkness to enlightenment. It is said that chanting some mantras can remove major problems from the lives of devotees.
Desktop Bottom Promotion