Latest Updates
-
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి! -
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి! -
ఎండల తీవ్రత: ఢిల్లీ స్కూళ్లలో 'వాటర్ బెల్'.. మీ పిల్లలను వడదెబ్బ నుంచి కాపాడుకోవడం ఎలా? -
గంగా సప్తమి రోజున ఈ చిన్న తప్పులు చేస్తున్నారా? పూజ ఫలితం దక్కాలంటే ఈ ముహూర్తాలు తప్పనిసరి! -
నోరూరించే స్టఫ్డ్ టమాటో కర్రీ.. తక్కువ శ్రమతో అదిరిపోయే రుచి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి అదృష్ట యోగం..! - గురువారం, 23 ఏప్రిల్ 2026 -
చికెన్, మటన్ రుచిని మైమరిపించే ఎగ్ టమాటో గ్రేవీ..ఇలా ఈజీగా చేసేయండి! -
ఇంట్లో ఎవరూ లేరని పిలిచింది, ఫారిన్ స్టైల్ అని బట్టలిప్పేసి దారుణం భయ్యా..వీడియో.. -
ఎండలు మండిపోతుంటే దంపతుల మధ్య గొడవలు ఎందుకు? వేసవిలో మీ బంధాన్ని కాపాడుకునే మార్గాలివే!
Avataras of Lord Shiva: శివుడి 5 రూపాలు..సృష్టి రహస్యాలు
హిందూమతంలోని ముఖ్యమైన దేవుళ్లలో శివుడు ఒకరు. ఆయనను త్రిమర్తుల్లో(బ్రహ్మ, విష్ణు, మహేశ్వర)లో లయకారుడిగా భావిస్తారు. సృష్టి,స్థితి,లయ అనే మూడు కార్యాలకు శివుడు అధిపతి అని హిందూ పురాణాలు చెబుతున్నాయి. సాధారణంగా శివుడిని ఎక్కువగా లింగం రూపంలోనే పూజిస్తారు. లింగం అనేది సృష్టి శక్తికి,అనంతత్వానికి చిహ్నం. శివుడుకి అనేక రూపాలు,పేర్లు ఉన్నాయి. ఒక్కో రూపం ఒక్కో శక్తిని, లక్షణాన్ని సూచిస్తుంది. అయితే శివుడి 5 రూపాలు, వాటి ప్రాముఖ్యత గురించి ఇప్పుడు చూద్దాం
పశుపతినాథ్
పశుపతినాథ్ రూపం శివుని సర్వశక్తిమత్వానికి,కరుణకు,జీవుల పట్ల ఆయనకున్న ప్రేమకు చిహ్నం. శివుడి ఈ రూపం అన్ని జీవుల పట్ల దయను చూపుతుంది. ఈ రూపంలో శివుడికి 5 ముఖాలు ఉంటాయి,ఇవి వివిధ దిక్కులను చూస్తూ ఉంటాయి. శివుడి ఈ 5 ముఖాలను సద్యోజాత, వామదేవ, అఘోర, తత్పురుష, ఈశాన అని అంటారు. నేపాల్ రాజధాని ఖఠ్మండులో ప్రసిద్ద పశుపతినాథ్ ఆలమం ఉంది. ఇక్కడ శివుడిని దర్శించుకోవడం ఎంతో పుణ్యప్రదంగా భావిస్తారు.

అర్థనారీశ్వరుడు
ఈ రూపంలో శివుడు సగం స్త్రీ,సగం పురుషుడిగా కనిపిస్తాడు. ఈ రూపం పురుషులు,స్త్రీ ఇద్దరూ సమానమేనని,ఒకరు లేకుండా మరొకరు సంపూర్ణం కాదని తెలియజేస్తుంది. అర్థనారీశ్వరుడి రూపం సృష్టి మూలాన్ని కూడా సూచిస్తుంది. స్త్రీ పురుషుల కలయిక ద్వారానే జీవితం ఉద్భవిస్తుంది. అర్థనారీశ్వరుడిని పూజించడం ద్వారా భక్తులు సమతుల్యత, సంపూర్ణత, ఏకత్వం భావనను పొందుతారు.
దక్షిణామూర్తి
దక్షిణామూర్తి శివుడి మరో రూపం. దక్షిణ అంటే దక్షిణం వైపు,మూర్తి అంటే రూపం అని అర్థం. ఈ రూపంలో శివుడు దక్షిణ దిక్కుకు తిరిగి కూర్చుని జ్ఞానాన్ని బోధిస్తున్న గురువుగా దర్శనమిస్తాడు. దక్షిణామూర్తి రూపం జ్ఞానానికి, మౌనానికి, గురుత్వానికి చిహ్నం. ఈ రూపానికి అనేక ప్రాముఖ్యతలు ఉన్నాయి. దక్షిణామూర్తిని ఆది గురువుగా భావిస్తారు..అంటే మొదటి గురువు. ఆయన మౌనంగానే తన శిష్యులకు బ్రహ్మజ్ఞానాన్ని ఉపదేశిస్తాడు. దక్షిణామూర్తిని ఆరాధించడం ద్వారా అజ్ఞానం తొలగిపోయి సత్య జ్ఞానం లభిస్తుందని నమ్ముతారు.
కాలభైరవ
కాల అంటే సమయం,భైరవుడ అంటే భయంకరమైనవాడు. కాలభైరవుడు అంటే కాలాన్ని శాసించేవాడని అర్థం,అంటే సమయానికి అతీతమైనవాడు. శివుడి అత్యంత ఉగ్ర రూపాల్లో ఇది ఒకటి. శివుడి ఈ రూపంలో శివుడు ఉగ్రమైన ముఖంతో పెద్ద కోరలతో మెరిసే కళ్లతో కనిపిస్తాడు. నగ్నంగా లేదా పులి చర్మం ధరించి పుర్రెల దండను మెడలో వేసుకొని ఉంటారు. ఆయన చేతుల్లో భయంకరమైన ఆయుధాలైన త్రిశూలం,ఖడ్డం,ఒక తెగిన తల ఉంటాయి. శివుడి ఈ రూపం ప్రజలు తమ ఉనికి ఉద్దేశ్యాన్ని,ఆధ్యాత్మిక అభివృద్ధిపై దృష్టి పెట్టడం యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకోడానికి ప్రోత్సహిస్తుంది. జీవితంలో లోతైన కోణాలను అర్థం చేసుకోవడవ, భయాన్ని జయించడం కాలభైరవుడిని పూజించడం ద్వారా ఈజీ అవుతుంది.
నటరాజ
నటరాజ రూపం శివుడి ఒక ముఖ్యమైన,ప్రసిద్ధ రూపం. ఈ రూపంలో శివుడు విశ్వ నృత్యకారుడిగా ఉంటాడు. ఆయన నృత్యం సృష్టి,స్థితి,లయ అనే విశ్వంలోని నిరంతర ప్రక్రియను సూచిస్తుంది. మనం అజ్ణాన్ని జయించి భయం లేకుండా,మోక్ష మార్గం వైపు సాగాలని నటరాజు మనకు స్ఫూర్తినిస్తాడు. నటరాజుని ఆరాధించడం ద్వారా మనం విశ్వ రహస్యాలను అర్థం చేసుకోవచ్చు,ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితిని చేరుకోవచ్చు.
నటరాజ రూపంలో శివుడు తన కుడి పాదం కింద అపస్మార అనే రాక్షసుడిని తొక్కిపెట్టి ఉంటాడు. అయితే అపస్మారను రాక్షసుడిగా కాకుండా అజ్ణానం, అహంకారం, మరపునకు ప్రతీకగా భావిస్తారు. నటరాజు తన పాదంతో అపస్మారను అణిచి ఉంచడం జ్ణానం అజ్ణానాన్ని జయిస్తుందని, ఆధ్యాత్మిక మార్గంలో అహంకారాన్ని అధిగమించాలని సూచిస్తుంది. అయితే శివడు అపస్మారను పూర్తిగా నాశనం చేయడు. ఎందుకంటే అజ్ణానం, జ్ణానం అనేవి విశ్వంలో బ్యాలెన్స్ గా ఉండాలని నమ్ముతారు, శివుడు అపస్మారను శాశ్వతంగా తన నియంత్రణలో ఉంచుకుంటాడు, తద్వారా జ్ణానం ఎల్లప్పుడూ అజ్ణానంపై ఆధిపత్యం చెలాయిస్తుంది.



Click it and Unblock the Notifications











