For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నవరాత్రులలో 9 రోజులలో 9 స్పెషల్ కలర్స్

By
|

నవరాత్రి పండుగ సమయంలో తొమ్మిది రోజులలో తొమ్మిది వేర్వేరు రూపాల్లో దుర్గాదేవిని పూజిస్తాం. ప్రతి అవతారం వారి సొంత ప్రాముఖ్యత మరియు ఆరాధన శైలిని కలిగి ఉంటాయి. అలాగే నవరాత్రి సమయంలో తొమ్మిది దేవత రూపాలకు తొమ్మిది రంగులు నిర్దేశించబడినాయి. దేవత దుర్గ కోసం ఈ రంగులు చాలా ప్రత్యేకం మరియు ఈ నిర్దేశించిన రంగులను ప్రతి రోజు తప్పక ధరించాలి.

నవదుర్గ అవతారాలు దేవత దుర్గ యొక్క బాగాలుగా చెప్పవచ్చు. అయితే ఈ దేవతలను విడిగా పూజిస్తారు. ప్రతి ఒక్కదానికి ఒక నిర్దిష్ట ప్రాముఖ్యత మరియు ప్రక్రియ ఉంటుంది. ఎందుకంటే వాటి పూజ భిన్నంగా ఉంటుంది.

నవదుర్గలలొ భాగంగా ఉన్న తొమ్మిది దేవతలకు తొమ్మిది రంగులు ఉన్నాయి. దేవత ఒక ప్రత్యేకమైన రంగు ధరించినప్పటికీ,ఆమె భక్తులు అదే రంగు దుస్తులు తప్పక ధరించాల్సిన అవసరం లేదు. ఉదాహరణకు,దేవత చంద్రకాంత అరేంజ్ ధరిస్తుంది. కానీ ఆమె భక్తులు నవరాత్రి మూడో రోజు తెల్లని దుస్తులను ధరిస్తారు.


ఈ నవరాత్రులలో తొమ్మిది రోజులు తొమ్మిది రంగులు ఉంటాయి. మీకు దేవత దుర్గ అనుగ్రహం కావాలంటే, సంబంధిత రోజులలో సరైన రంగులను ధరించాలి.

9 Special Colours For 9 Days Of Navratri

మొదటి రోజు - పసుపు రంగు
నవరాత్రులలో మొదటి రోజును 'ప్రతిపాదం' అంటారు. ఈ రోజు,పూజలు నవదుర్గ మొదటి దేవి అయిన శైలపుత్రిమాతా దేవికి చేస్తారు. దీని కోసం ఘటస్తాపన కొరకు పసుపు రంగు దుస్తులు ధరిస్తారు.


రెండో రోజు: ఆకుపచ్చ రంగు
నవరాత్రులలో రెండవ రోజును ద్వితీయ అంటారు. ఆకుపచ్చ రంగు ప్రకృతి మరియు దేవి బ్రహ్మచారిణి ఆమె భక్తులకు ఆకుపచ్చ రంగులో అలంకరణ చేయాలనీ ఆదేశాలు ఇచ్చెను.

మూడవ రోజు: బూడిద రంగు
దేవి చంద్రఘంట శాంతి మరియు ప్రశాంతత గల దేవత అని అంటారు. ఈ రోజు జరిగే గౌరీ వ్రతానికి ఆమె తెల్లటి దుస్తులను ధరిస్తుంది. భక్తులు నవరాత్రి యొక్క మూడోవ రోజున బూడిద రంగు ధరించాలి.

నాల్గవ రోజు: ఆరెంజ్ రంగు
నవరాత్రులలో చతుర్థి నాడు,దేవత కూష్మాండను పూజిస్తారు. ఆమె ఎర్ర రంగు ధరించి మరియు విశ్వం యొక్క సృష్టికర్తగా ఉంది. ఆమె గౌరవార్ధం,ఆమె భక్తులు కూడా ఎరుపు రంగు దుస్తులు ధరిస్తారు.

ఐదవ రోజు: తెలుపు రంగు
నవరాత్రులలో ఐదవ రోజు పంచమి అని పిలుస్తారు. అలాగే ఆ రోజున స్కందమాతను పూజిస్తారు. ఆమె రాక్షసులను సంహరించెను. ఆ దేవతను సంతోషపెట్టడానికి తెల్లని దుస్తులను ధరిస్తారు.

ఆరవ రోజు: ఎరుపు రంగు
తల్లులు అందరూ తమ పిల్లల కోసం ఈ రోజు పూజలు చేస్తారు. ఆ రోజు ఆమె గౌరవార్ధం ఎరుపు రంగు దుస్తులను ధరించి కాత్యాయని పూజలు చేస్తారు.

ఏడవ రోజు : నీలం రంగు
సప్తమి రోజున ఉత్సవ్ పూజ జరుగుతుంది. ఈ రోజున మాత కాళరాత్రిని పూజిస్తారు. ఆమె చెడు నుండి భక్తులను రక్షిస్తుంది. కాబట్టి ఆమె భక్తులు నీలం రంగు దుస్తులను ధరిస్తారు.

ఎనిమిదవ రోజు: పింక్ రంగు
దుర్గ అష్టమి రోజున మహా గౌరీ పూజ జరుగుతుంది. ఈ రోజున మాతా సరస్వతికి భక్తితో పూజలు చేస్తారు. నవరాత్రులలో ప్రత్యేకంగా ఈ రోజు పింక్ రంగును ధరిస్తారు.

తొమ్మిదవ రోజు: ఊదా రంగు
నవరాత్రులలో చివరి రోజు సిద్ధిదాత్రిని పూజిస్తారు. ఆమె భక్తులు ఈ పవిత్ర దినాన 'సిద్ధి' సాధించడానికి ఊదా రంగును ధరిస్తారు.

English summary

9 Special Colours For 9 Days Of Navratri

Navratri is a festival that last nine days during which we worship Goddess Durga in nine different forms. Each of the Navdurga avatars have their own significance and style of worshipping.
Desktop Bottom Promotion