Latest Updates
-
జిమ్ చేసేవారికి పర్ఫెక్ట్ స్వీట్.. పంచదార లేని హై ప్రోటీన్ పీనట్ బటర్ లడ్డూ..ఎలా చేసుకోవాలంటే.. -
ఈ సొసైటీ మిమ్మల్ని చిన్న చూపు చూస్తుందా.. మీ గౌరవం పెరగాలంటే ఈ 3 విషయాలు గుర్తుంచుకోండి.! -
మీ పిల్లల్లో ఒబెసిటీ వేగంగా పెరుగుతుందా.. తల్లిదండ్రులు చేసే ఈ ఐదు పొరపాట్లే కారణం.! -
మటన్ పాయను కూడా మరిపించే వెజ్ పాయ.. ఒక్కసారి రుచి చూస్తే జన్మలో వదిలిపెట్టరు.! -
బాబా వంగా అంచనా: 2026 సెప్టెంబర్లో ఈ 4 రాశులపై కనకవర్షం ఖాయం! -
రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం.. ఎంత తిన్నా ఈజీగా బరువు తగ్గించే సొరకాయ చపాతీ.! -
అద్భుతం,అమోఘం..గోధుమపిండి లడ్డు ఇలా చేశారంటే తిరుగులేని బలం! -
భార్య తన భర్తకు రాఖీ కట్టవచ్చా? అసలు విషయం ఇదండీ.. -
ప్రోటీన్ రిచ్ బ్రేక్ ఫాస్ట్: బయట స్పాంజ్, లోపల ఘాటు..నోరూరించే పనీర్ చిల్లీ ఇడ్లీ ఎలా చేసుకోవాలంటే.. -
డెంగ్యూకి బొప్పాయి ఆకు రసం బ్రహ్మాస్త్రమా? ఇది తాగితే ప్లేట్ లెట్స్ పెరుగుతాయా?
మీ రాశిని బట్టి మీరు ఏదేవుడిని పూజిస్తే మంచిది ?
హిందువులకు దేవుళ్లు, దేవతలు చాలా మంది ఉన్నారు. వాళ్ల వాళ్లకు సంబంధించి పూజా విధానాలు కూడా చాలా విభిన్నంగా ఉంటాయి. అయితే ఏ దేవుడిని ఏ వారం పూజించాలో తెలుసు. అలాగే ఏ దేవుడికి ఏ పండుగ, ఏ తిథి మంచిదో కూడా చాలా మందికి తెలిసే ఉంటుంది. మరి మీ రాశిని బట్టి మీరు పూజించాల్సిన దేవుడెవరో తెలుసా ?

వాళ్ల రాశిని బట్టి ఏ దేవుడిని పూజించాలి అనే విషయంపై చాలా మంది మతగురువులు, పురోహితుల దగ్గరకు వెళ్తూ ఉంటారు. అయితే.. వాళ్లు చెప్పేది ఎంతవరకు నిజమో ఎవరికీ తెలియదు. కాబట్టి.. మీరు పుట్టిన జన్మ నక్షత్రాన్ని బట్టి మీ రాశి నిర్ణయించబడుతుంది. కాబట్టి.. మీ రాశిని బట్టి ఏ దేవుడిని పూజిస్తే మంచి ఫలితాలు, మీరు కోరుకున్న జీవితం లభిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం..

కన్యా రాశి, మిధున రాశిలో పుట్టివాళ్లు
కన్యా లేదా మిధున రాశి వాళ్లకు పాలించే నక్షత్రం మెర్క్యురీ. మీరు పూజించాల్సిన దైవం. శ్రీమన్నారాయణుడు. అంటే.. మీరు ఎలాంటి కోరికనైనా, పూజనైనా.. శ్రీ మహావిష్ణువుకి సమర్పించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. అంటే కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజిస్తే.. మంచిది.

మేష, వృశ్చిక, మకర, కుంభ రాశివాళ్లు
మీరు మేష లేదా వృశ్చిక లేదా మకర లేదా కుంభ రాశి కి చెందిన వాళ్లు అయితే మీ రూలింగ్ ప్లానెట్ మార్స్. కాబట్టి ఈ నాలుగు రాశివాళ్లు శివారాధన చేస్తే మంచిది. మీ మొక్కులు, మొక్కుబడులన్నీ శివుడికి సమర్పించడం వల్ల మీకు అంతా మంచే జరుగుతుంది.

సింహ రాశి
సింహ రాశిలో జన్మించిన వాళ్ల రూలింగ్ ప్లానెట్ సూర్యుడు. మీ మొర ఆలకించే దైవం మహా శివుడు. ఎలాంటి కోరికనైనా.. మనస్పూర్తిగా, ఆ శివుడి మంత్రం జపిస్తూ.. వేడుకుంటే...మీ కోరికలు నెరవేరుతాయి.

కర్కాటక రాశి
కర్కాటక రాశి వాళ్ల రూలింగ్ ప్లానెట్ చంద్రుడు. కర్కాటక రాశివాళ్లు గౌరీ దేవి లేదా పార్వతి దేవిని పూజించాలి. ఈ రాశిలో జన్మించిన వాళ్లంతా గౌరీ దేవిని ప్రసన్నం చేసుకోవాలి.

తులా, వృషభ రాశి
మీరు పుట్టిన నక్షత్రం బట్టి తులా లేదా వృషభ రాశి వాళ్ల రూలింగ్ ప్లానెట్ వీనస్. ఈ రాశుల వాళ్లు శ్రీ మహా లక్ష్మిని పూజిస్తే మంచి ఫలితం ఉంటుంది. అంటే ఈ రాశి వాళ్లు పూజించాల్సిన దైవం శ్రీ మహాలక్ష్మి.

ధనస్సు, మీన రాశి
మీరు పుట్టిన నక్షత్రాన్ని బట్టి మీరు మీన లేదా ధనస్సు రాశివాళ్లు అయితే.. మీ రూలింగ్ ప్లానెట్ జూపిటర్. మీరు పూజించాల్సిన దైవం శ్రీ దక్షిణా మూర్తి. కాబట్టి మీరు ఎలాంటి కోరికలు విన్నవించుకోవాలన్నా, పూజలు నిర్వహించాలన్నా.. దక్షిణా మూర్తికి చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

ప్రతి ఒక్కరూ
రాశులను బట్టి కాకుండా.. ప్రతి ఒక్కరూ.. ఉదయాన్నే స్నానం చేశాక సూర్య నమస్కారం చేయడం చాలా మంచిది. ఎందుకంటే.. అన్ని నక్షత్రాలను పాలించే సూర్యుడి అనుగ్రహం పొందడం వల్ల సుఖసంతోషాలతో ఉండగలరు.



Click it and Unblock the Notifications