For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Akshay Tritiya 2023: అక్షయ తృతీయ నాడు బంగారమే కాదు.. ఇవి కూడా కొనొచ్చట..!

|

హిందూ మతం ప్రకారం అక్షయ తృతీయ అనేది చాలా ముఖ్యమైన రోజు. ఈరోజును విష్ణుమూర్తి, లక్ష్మీదేవికి అంకితం చేయబడింది. ఈరోజున శ్రీ మహా విష్ణువు అవతరించిన రోజు అని.. భూమిపై అడుగుపెట్టిన రోజు అని చాలా మంది నమ్ముతారు.

Akshaya Tritiya 2023: Things to buy this Akshaya Tritiya

ఈ పవిత్రమైన అక్షయ తృతీయ రోజున ఏ పని చేసినా శుభ ఫలితం ఇస్తుందని, చాలా మంది నమ్మకం. అంతేకాదు తాము కష్టపడి సంపాదించిన సొమ్మును పెట్టుబడి పెట్టడం లేదా కొత్త వెంచర్లను ప్రారంభించడం,

Akshay Tritiya 2021 : Things to buy this Akshay Tritiya

వివాహం చేసుకోవడానికి, ఒకరి జీవిత భాగస్వామితో జీవితకాల భాగస్వామ్యాన్ని ప్రారంభించడానికి ఇది శుభదినంగా పరిగణించబడుతుంది. అంతటి ముఖ్యమైన అక్షయ తృతీయ పండుగ ఈ నెలలో 14వ తేదీ వస్తుంది.

Akshay Tritiya 2021 : Things to buy this Akshay Tritiya

ఈ పండుగను ఆక్తా తీజ్ అని అని కూడా ఉంటారు. హిందూ క్యాలెండర్ ప్రకారం, ప్రతి ఏటా వైశాఖ మాసంలో శుక్ల పక్షంలో అంటే ఏప్రిల్ లేదా మే నెలలో వస్తుంది. ఈ సందర్భంగా ఈ పవిత్రమైన కొన్ని ముఖ్యమైన వస్తువులను కచ్చితంగా కొనాలట. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం...

Akshaya Tritiya 2021: ఈ ఏడాదిలో అత్యంత పవిత్రమైన రోజు అక్షయ తృతీయ...!Akshaya Tritiya 2021: ఈ ఏడాదిలో అత్యంత పవిత్రమైన రోజు అక్షయ తృతీయ...!

బంగారం..

బంగారం..

పురాణాల ప్రకారం, ‘అక్షయ' అంటే ఎప్పటికీ తరగనిది లేదా అనంతమైనది అని అర్థం. అందువల్ల అక్షయ తృతీయ రోజున బంగారం కొనడం శుభప్రదంగా భావిస్తారు. దీని వల్ల తమ సంపద మరియు శ్రేయస్సు పెరుగుతుందని చాలా మంది నమ్ముతారు. బంగారంతో పాటు ఎంతో విలువైనదిగా భావించే పసుపు లోహాన్ని కూడా కొనుగోలు చేస్తారు. ముఖ్యంగా ఎవరైతే కష్టపడి సంపాదించిన డబ్బును పెట్టుబడిగా పెట్టాలనుకుంటే.. దాన్ని బంగారం రూపంలో మార్చేస్తారట. ఈ సమయంలో బంగారం ఆభరణాలు, నాణేలు, గోల్డ్ ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఇటిఎఫ్)లో ఇతర రూపాలలో పెట్టుబడి పెట్టడం వంటివి చేస్తారట.

కొత్త వాహనం..

కొత్త వాహనం..

అక్షయ తృతీయ వంటి ఎంతో విశిష్టత కలిగిన రోజున కొత్త వాహనం కొనుగోలు చేసేందుకు శుభప్రదంగా భావిస్తారు. ఈరోజున కొనుగోలు చేసిన వాహనం దానికి గొప్ప దీర్ఘాయువును ఇస్తుందని చాలా మంది ప్రజలు నమ్ముతారు. అందుకే వ్యాపారులు కూడా ఈ సమయంలో కస్టమర్లను ఆకట్టుకునేందుకు అక్షయ తృతీయ రోజునే గొప్ప ఆఫర్లను, తగ్గింపును కూడా ప్రకటిస్తుంటారు.

మే నెలలో అక్షయ తృతీయ, బుద్ధ పౌర్ణమితో పాటు ముఖ్యమైన పండుగలివే...మే నెలలో అక్షయ తృతీయ, బుద్ధ పౌర్ణమితో పాటు ముఖ్యమైన పండుగలివే...

కొత్త ఇల్లు, స్థలం..

కొత్త ఇల్లు, స్థలం..

అక్షయ తృతీయ రోజున చాలా మంది బంగారం కొనడం, వాహనం కొనడం వంటివే కాదు.. ఇల్లు, స్థలం వంటివి కూడా కొనొచ్చట. ఈ సమయంలో రియల్ ఎస్టేట్ బిల్డర్లు కూడా గొప్ప తగ్గింపును అందిస్తారు. ఈ సమయంలో కొత్త ఇల్లు కొనడం లేదా కొత్త ఇంట్లో ప్రవేశించడం వంటివి చేయాలని చాలా మంది ఎదురుచూస్తారట. దీని వల్ల తమకు ఎంతో లక్కీ కలిసి వస్తుందని చాలా మంది విశ్వాసం.

పెట్టుబడులు పెట్టడం..

పెట్టుబడులు పెట్టడం..

పైన చెప్పినట్టుగా, అక్షయ తృతీయ వంటి పవిత్రమైన రోజున తల్లిదండ్రులు పిల్లల ఉజ్వల భవిష్యత్తు కోసం మెరుగైన ఆర్థిక భద్రత కోసం మీ పిల్లల విద్యా ప్రణాళికలను ప్రారంభించేందుకు గొప్ప రోజుగా పరిగణిస్తారు. ఈరోజున చిన్నారులతో విద్యాభ్యాసం ప్రారంభిస్తే కూడా ఎంతో శుభప్రదమని భావిస్తారు.

దానం చేయడం..

దానం చేయడం..

శ్రీ నారద పురాణం ప్రకారం, అక్షయ తృతీయ రోజున దాన ధర్మాలు చేయడం వల్ల అత్యధిక ఫలితాలొస్తాయట. ఈరోజున దానం, ధర్మం చేయడం వల్ల అక్షయ ఫలితం వస్తుందట. ఈరోజున దానం చేయడం వల్ల సర్వకామ సమన్వితుడై, బంగారం, రత్నాతో కూడిన కల్పకోటి సహస్రముల కాలం, బ్రహ్మలోకం విరాజిల్లునట. స్వర్గంలో ఉన్న పిత్రుదేవతలకు కూడా మోక్షం చేకూర్చినవారవుతారు. ఇలాంటి పుణ్యఫలాలెన్నో ఈ పవిత్రమైన రోజున కలుగుతాయి అని శాస్త్రాలు చెబుతున్నాయి.

English summary

Akshaya Tritiya 2023: Things to buy this Akshaya Tritiya

Here we are talking about akshay tritiya 2023: Things to buy this akshay tritiya. Have a look
Desktop Bottom Promotion