For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Akshaya Tritiya 2023: ఈ ఏడాదిలో అత్యంత పవిత్రమైన రోజు అక్షయ తృతీయ...!

|

హిందూ పురాణాల ప్రకారం, అక్షయ తృతీయ చాలా పవిత్రమైన రోజు. ఈరోజు అన్ని కార్యాలకు శుభప్రదంగా భావిస్తారు. హిందూ క్యాలెండర్ ప్రకారం, ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలో శుక్ల పక్షంలోని విదియ నాడు ఈ పండుగ వస్తుంది.

Akshaya Tritiya 2023: Date, Shubh Muhurat, Significance and Rituals in Telugu

ఈ రోజున బంగారం ఆభరణాలు, నగలు కొనుగోలు చేస్తుంటారు. ఈరోజున షాపింగ్ చేయడంతో పాటు, పేదలకు దానం చేయడం వల్ల ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయని చాలా మంది నమ్మకం.

Akshaya Tritiya 2021: Date, Shubh Muhurat, Significance and Rituals in Telugu

ఈ సందర్భంగా 2023 సంవత్సరంలో అక్షయ తృతీయ ఎప్పుడొచ్చింది.. శుభ ముహుర్తం, ఈ పవిత్రమైన పండుగ యొక్క ప్రాముఖ్యత గురించి ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం...

అక్షయ-తృతీయ వైవిధ్యాన్ని తెలుసుకొని, భాగ్యవంతులు కండి!అక్షయ-తృతీయ వైవిధ్యాన్ని తెలుసుకొని, భాగ్యవంతులు కండి!

అక్షయ తృతీయ అంటే..

అక్షయ తృతీయ అంటే..

"అక్షయ" అంటే 'నిత్యమైనదని' అర్థం. అక్షయ తృతీయ అంటే అష్ట ఐశ్వర్యాలను ప్రసాదించే తిథి అని, అందుకే ఈరోజున శ్రీ మహలక్ష్మీని పూజిస్తారు. ఇలా చేయడం వల్ల సిరి సంపదలు వస్తాయని చాలా మంది నమ్ముతారు. అక్షయ తృతీయ (లేదా) అఖ టీజ్ అనే పవిత్రమైన రోజును ఆరాధనాభావంతో, హిందువులు మాత్రమే కాదు, జైనులు కూడా జరుపుకుంటారు. ఈ పవిత్రమైన రోజున వివిధ రాష్ట్రాలలో ఒక్కొక్క ప్రాముఖ్యతతో జరుపుకుంటారు. దీనిని ఛత్తీస్ఘడ్లో - 'అక్తి' అని, గుజరాత్, రాజస్థాన్లలో దీనిని 'అహ టీజ్' అని పిలుస్తారు.

శుభ ముహుర్తం..

శుభ ముహుర్తం..

2021 సంవత్సరంలో అక్షయ తృతీయ వైశాఖ మాసంలోని శుక్ల పక్షం అంటే మే 14వ తేదీ శుక్రవారం నాడు వచ్చింది. ఈరోజున ఉదయం 5:38 గంటలకు శుభ ముహుర్తం ప్రారంభమవుతుంది. 15వ తేదీ ఉదయం 7:59 గంటలకు తృతీయ తిథి ముగుస్తుంది.

ఈరోజే బంగారం ఎందుకు కొంటారు..

ఈరోజే బంగారం ఎందుకు కొంటారు..

అక్షయ తృతీయ రోజున చేసే పనుల వల్ల రెట్టింపు ఫలితం వస్తుందని చాలా మంది నమ్ముతారు. ఈరోజున కొన్న బంగారం భవిష్యత్తులో చాలా రెట్లు పెరుగుతుందని చాలా మంది విశ్వాసం. అందుకే ఈ పవిత్రమైన రోజున బంగారం కొనడానికి ప్రజలందరూ శుభప్రదంగా భావిస్తారు. అంతేకాదు ఈరోజు బంగారం కొనుగోలు చేయడం వల్ల ఇంట్లో ఆనందం, శ్రేయస్సు లభిస్తుందని, తమ జీవితంలో ఆనందం లభిస్తుందని నమ్ముతారు. పురాణాల ప్రకారం ఈరోజు సూర్య చంద్రులు అత్యంత ప్రకాశంగా ఉండే రోజు. ఈ పవిత్రమైన రోజున ఏ పని చేపట్టినా.. తప్పకుండా విజయం లభిస్తుందని పండితులు చెబుతున్నారు.

అక్షయతృతీయకు ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా...అక్షయతృతీయకు ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా...

విరాళాలు ఇవ్వొచ్చు..

విరాళాలు ఇవ్వొచ్చు..

అక్షయ తృతీయ అంటే కేవలం బంగారం, వెండి ఆభరణాలు, పాత్రలు, ఇతర విలువైన వస్తువులను కొనుగోలు చేయడమే కాదు.. ఈరోజు పేదలకు దానం చేయడం లేదా ఏదైనా విరాళం ఇవ్వడం వంటివి చేసినా శుభఫలితాలొస్తాయని పండితులు చెబుతున్నారు. ఈరోజున దానం చేయడం వల్ల గ్రహ దోషాలు తొలగిపోతాయట. అక్షయ తృతీయ రోజున చేసే జపం, హోమం, పిత్రు తర్పణం, దానం వల్ల అక్షయ ఫలితం లభిస్తుందట.

వీటిని దానం చేయాలి..

వీటిని దానం చేయాలి..

ఈ వైశాఖ మాసం ప్రతి ఏటా వేసవి కాలంలో వస్తుంది. కాబట్టి ఈ సమయంలో వేసవి తాపాన్ని తగ్గించే విసనకర్ర, గొడుగు, పాదరక్షలతో వంటి వాటిని దానాలను చేయొచ్చట. ఈరోజున పిత్రు తర్పణం విడిచే కుమారులకు పిత్రు దేవతల అనుగ్రహం లభిస్తుందట. మీరు ఈ పవిత్రమైన రోజు బిందెలను దానం చేస్తే పిత్రులకు అక్షయ లోకాలను ఇవ్వడమే కాకుండా దానం చేసిన వారికి కూడా శాంతి కలుగుతుందట.

అక్షయ తృతీయ రోజున..

అక్షయ తృతీయ రోజున..

ఈ పవిత్రమైన రోజున సూర్యోదయానికి ముందే నిద్ర లేచి సముద్ర స్నానం లేదా ప్రవహించే నీటిలో స్నానం చేస్తే శుభ ఫలితాలొస్తాయట. అనంతరం ఉపవాసం ఉంటూ శ్రీ మహాలక్ష్మీ, విష్ణుమూర్తికి ప్రత్యేక పూజలు చేస్తే, శుభ ఫలితాలు వస్తాయట. ఈరోజున చేసే హోమం, దానం, పిత్రు దేవతలకు చేసే పూజలు, క్షయం కాకుండా స్థిరంగా ఉంటాయట. అందుకే దీనికి అక్షయ తృతీయ అని పేరు వచ్చిందని ధర్మరాజుకు శ్రీక్రిష్ణుడు తెలియజేశాడని పురాణాల ద్వారా తెలుస్తోంది.

English summary

Akshaya Tritiya 2023: Date, Shubh Muhurat, Significance and Rituals in Telugu

Akshaya Tritiya 2023: Date, Shubh Muhurat, Significance and Rituals in Telugu. Akshaya Tritiya in 2023. It is a highly auspicious day for new ventures, marriages, investments, gold purchase etc. Check out the details in Telugu.
Desktop Bottom Promotion