For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Akshaya Tritiya 2023: అక్షయ తృతీయ సందర్భంగా ఏ సమయంలో బంగారం కొనాలంటే...!

|

మనలో చాలా మందికి అక్షయ తృతీయ పేరు వింటే టక్కున గుర్తొచ్చే బంగారమే. ఈ పవిత్రమైన రోజున పసిడితో పాటు విలువైన వస్తువులను కొనుగోలు చేస్తే అవి అక్షయం అవుతాయని చాలా మంది నమ్మకం.

Akshaya Tritiya 2023: Check auspicious date and time to buy gold In Telugu

పురాణాల ప్రకారం అక్షయం అంటే క్షయం కానిది(ఎన్నటికీ తరగనిది). హిందూ పంచాంగం ప్రకారం, ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలో శుక్ల పక్షం యొక్క తృతీయ తిథిలో అక్షయ తృతీయ పండుగను జరుపుకుంటారు. ఈరోజును చాలా పవిత్రమైన రోజుగా భావిస్తారు.

Akshaya Tritiya 2022: Check auspicious date and time to buy gold In Telugu

ఈ ఏడాది అంటే 2023లో ఏప్రిల్ 22వ తేదీ మంగళవారం నాడు ఉదయం 7.49AM గంటలకు ప్రారంభమై, మరుసటి రోజు అంటే ఏప్రిల్ 22వ తేదీన తెల్లవారు జామున 12.21PM గంటల వరకు కొనసాగనుంది. ఈరోజున శుభకార్యాలు చేయడానికి చాలా పవిత్రమైనదని నమ్ముతారు.

Akshaya Tritiya 2022: Check auspicious date and time to buy gold In Telugu

ఈరోజున కచ్చితంగా బంగారం, వెండిని కొనాలని చాలా మంది ఆశపడతారు. అయితే బంగారంతో పాటు ఇతర విలువైన వస్తువులను ఎలాంటి సమయంలో కొనాలి.. ఎప్పుడు కొంటే శుభ ఫలితాలొస్తాయనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

Akshaya Tritiya 2022: 50 ఏళ్ల తర్వాత ఈ రాశులకు శోభన యోగం.. ఏ రాశులకు లాభమంటే...Akshaya Tritiya 2022: 50 ఏళ్ల తర్వాత ఈ రాశులకు శోభన యోగం.. ఏ రాశులకు లాభమంటే...

వైశాఖ మాసంలో..

వైశాఖ మాసంలో..

పురాణాల ప్రకారం, వైశాఖ మాసంలో శుద్ధ తదియ రోజున ఏ పని చేసినా.. ఏ వ్రతం చేసినా.. ఏ పూజ చేసిన పుణ్య ఫలితాలు దక్కుతాయని చాలా మంది నమ్ముతారు. ఇదే రోజున పరమేశ్వరుడు పార్వతీదేవికి అక్షయ తృతీయ వ్రతం గురించి వివరించాడు. ఈ పవిత్రమైన రోజున ఏ వస్తువు సొంతం చేసుకున్నా అది అక్షయం అవుతుంది.

విష్ణువు పూజ..

విష్ణువు పూజ..

అక్షయ తృతీయ రోజున బ్రహ్మతో తృతీయ తిథి కలిసి ఉండటం వల్ల ఈరోజున పవిత్రమైనదిగా ఉంటుంది. ఈ అక్షయ తృతీయ రోజున అక్షయుడైన విష్ణుమూర్తిని పూజించడం వల్ల అక్షయ తృతీయ అనే పేరు వచ్చిందని పండితులు చెబుతారు. ఈ రోజున శ్రీ మహా విష్ణువుకు పూజలు, ఇష్టమైన నైవేద్యాలు సమర్పిస్తే శుభ ఫలితాలొస్తాయి. అలాగే ఏ వస్తువు అయినా దానం చేసినా మంచిగా ఉంటుంది.

Akshay Tritiya 2022:అక్షయ తృతీయ రోజున మీ రాశిని బట్టి వీటిని కొంటే..అద్భుత ప్రయోజనాలు...!Akshay Tritiya 2022:అక్షయ తృతీయ రోజున మీ రాశిని బట్టి వీటిని కొంటే..అద్భుత ప్రయోజనాలు...!

ద్రౌపదికి అక్షయ పాత్ర..

ద్రౌపదికి అక్షయ పాత్ర..

మరో కథనం మేరకు.. మహా భారతంలో శ్రీ క్రిష్ణుడు ద్రౌపదికి అక్షయపాత్రను కూడా అక్షయ తృతీయ రోజునే అందించాడు. దీంతో తను మరింత సంపన్నుడు అయ్యాడు. అలా ప్రతి సంవత్సరం అక్షయ తృతీయ రోజున ప్రజలందరూ విలువైన వస్తువులను, బంగారం వంటి వాటిని కొంటూ ఉంటారు.

ఎప్పుడు కొనాలంటే..

ఎప్పుడు కొనాలంటే..

ఇక అసలు విషయానికొస్తే.. అక్షయ తృతీయ రోజున ఏ సమయంలో బంగారం లేదా ఇతర విలువైన కొనుగోలు చేయాలంటే.. హిందూ పంచాంగం ప్రకారం, వైశాఖ మాసంలో శుక్ల పక్ష తదియ మే 3వ తేదీ ఉదయం 5:18 నుండి ప్రారంభమై.. మరుసటి రోజు అంటే మే 4వ తేదీ ఉదయం 5:38 గంటల వరకు ఉంటుంది. ఈ సమయంలో మీరు ఎప్పుడైనా బంగారం, వెండితో పాటు ఇతర విలువైన వస్తువులను కొనొచ్చు.

బంగారం కొనలేని వారు..

బంగారం కొనలేని వారు..

ఈ పవిత్రమైన రోజున బంగారం కొనే సామర్థ్యం లేనివారు.. అక్షయ తృతీయ రోజున శ్రీ మహా విష్ణువును భక్తి శ్రద్ధలతో పూజించి, ఆ దేవునికి ఇష్టమైన పువ్వులు, వస్తువులతో పూజలు చేయడం వల్ల శుభ ఫలితాలొస్తాయి. మీ వ్యక్తిగత, కుటుంబ జీవితంలో సిరి సంపదలు పెరుగుతాయి. విలువైన వస్తువులను కొనలేని వారు ఇలా చేసి పుణ్యం పొందొచ్చు అని శాస్త్రాలు చెబుతున్నాయి.

FAQ's
  • 2022లో అక్షయ తృతీయ ఎప్పుడొచ్చింది?

    సనాతన ధర్మం ప్రకారం, అక్షయ తృతీయ రోజున చాలా పవిత్రంగా భావిస్తారు. హిందూ పంచాంగం ప్రకారం, ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలో శుక్ల పక్షం యొక్క తృతీయ తిథిలో అక్షయ తృతీయ పండుగను జరుపుకుంటారు. ఈ ఏడాది అంటే 2022లో మే 03వ తేదీ మంగళవారం నాడు ఈ పవిత్రమైన పండుగ వచ్చింది. ఈరోజున శుభకార్యాలు చేయడానికి చాలా పవిత్రమైనదని నమ్ముతారు. ఈరోజున కచ్చితంగా బంగారం, వెండిని కొనాలని చాలా మంది ఆశపడతారు.

  • అక్షయ తృతీయ రోజున ఏయే వస్తువులను దానం చేయాలి?

    అక్షయ తృతీయ రోజున లక్ష్మీదేవిని పూజించడంతో పాటు.. ఈ పవిత్రమైన కొన్ని వస్తువులను దానం చేయడం వల్ల లక్ష్మీదేవి సంతోషిస్తుందట. ఈ పండుగ వేసవికాలంలో వస్తుంది కాబట్టి.. ఈ సమయంలో నీటితో నిండిన కలశాన్ని దానం చేయాలి. ఇలా చేయడం వల్ల ఎంతో పుణ్య ఫలం లభిస్తుందని పండితులు చెబుతారు. మీ కుటుంబ జీవితంలో కూడా ఆనందం మరియు శ్రేయస్సు పెరుగుతుంది.అలాగే నీటితో నిండిన మట్టి కుండలను దానం చేయడం వల్ల ఎన్నో తీర్థయాత్రలను దర్శనం చేసినంత పుణ్యఫలం లభిస్తుందని చాలా మంది నమ్ముతారు. అందుకే అక్షయ తృతీయ రోజున చాలా మంది జలదానం చేస్తారు.

English summary

Akshaya Tritiya 2023: Check auspicious date and time to buy gold In Telugu

Here we are talking about the Akshaya Tritiya 2023: Check auspicious date and time to buy gold in Telugu. Have a look
Desktop Bottom Promotion