Just In
- 22 min ago
నోటి దుర్వాసన రాకుండా నాలుకను ఎలా శుభ్రం చేసుకోవాలి?
- 24 min ago
National Doctors’ Day 2022 :వైద్య రంగానికి జీవితాన్ని అంకితం చేసిన బిదన్ చంద్ర రాయ్ గురించి నమ్మలేని నిజాలు..
- 1 hr ago
Ashada Bonalu 2022 in Telangana :బోనం అంటే ఏమిటి? బోనాల పండుగ జరుపుకునేందుకు గల కారణాలేంటో తెలుసా...
- 2 hrs ago
బ్లాక్ టీ లేదా మిల్క్ టీ, ఏ టీ తాగాలో తెలుసుకొని ఆరోగ్యంగా ఉండండి..
Don't Miss
- Automobiles
మారుతి సుజుకి చిన్న కార్ల ఉత్పత్తిని నిలిపివేస్తుందా.. కారణం ఇదేనా..?
- News
సాలు మోదీ.. సంపకు మోదీ: హైదరాబాద్ లో బైబైమోదీ పోస్టర్లు; రచ్చ మామూలుగా లేదుగా!!
- Technology
108MP క్వాలిటీతో Xiaomi నుంచి సరికొత్త మొబైల్ రానుందా?
- Finance
EPFO News: పీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్.. రెండు రోజుల్లో వడ్డీ డబ్బులు.. తెలుసుకోండి ఇలా..
- Movies
Virata Parvam 12 Days Collections: భారీ నష్టాల దిశగా విరాట పర్వం.. 14 కోట్లకు వచ్చింది ఇంతే!
- Travel
మనసును బంధించే బన్నెరఘట్ట నేషనల్ పార్క్!
- Sports
బంగ్లాదేశ్తో అమీతుమీ తేల్చుకోవడానికి సిద్ధమైన వెస్టిండీస్.. వన్డే, టీ20 జట్లు ఇవే, ఆ ముగ్గురు ఔట్..!
Akshaya Tritiya 2022:అక్షయ తృతీయ రోజునే అందరూ బంగారం, వెండిని ఎందుకు కొంటారంటే...!
సనాతన ధర్మం ప్రకారం, అక్షయ తృతీయ రోజును చాలా పవిత్రంగా భావిస్తారు. హిందూ పంచాంగం ప్రకారం, ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలో శుక్ల పక్షం యొక్క తృతీయ తిథిలో అక్షయ తృతీయ పండుగను జరుపుకుంటారు.
ఈ ఏడాది అంటే 2022లో మే 03వ తేదీ మంగళవారం నాడు ఉదయం 5:39 గంటలకు ప్రారంభమై, మరుసటి రోజు అంటే మే 4వ తేదీన తెల్లవారు జామున 5:38 గంటల వరకు కొనసాగనుంది. ఈరోజున శుభకార్యాలు చేయడానికి చాలా పవిత్రమైనదని నమ్ముతారు.
ఈరోజున కచ్చితంగా బంగారం, వెండిని కొనాలని చాలా మంది ఆశపడతారు. అలాగే ఈ పవిత్రమైన రోజున కొత్త పనులు ప్రారంభించడం, శుభకార్యాలు చేయడం, కొత్త వ్యాపారాలు చేయడం వంటివి చేస్తారు.
అదే విధంగా వైశాఖ మాసంలోని మూడో రోజున వచ్చే అక్షయ తృతీయ రోజునే చాలా మంది బంగారం, వెండితో పాటు విలువైన వస్తువులను కొనేందుకు ఆసక్తి చూపుతారు. అయితే ఈరోజునే ఎందుకు కొనాలనుకుంటారు. ఈరోజుకు ఉన్న ప్రాముఖ్యతలేంటి అనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...
Akshaya
Tritiya
2022:
అక్షయ
తృతీయ
రోజున
బంగారమే
కొనాలా?
ఇతర
వస్తువులను
కొనొచ్చా?

లక్ష్మీదేవికి స్వాగతం..
అక్షయ అంటే క్షయం కానిది(తరగనిది). అంటే ఈ పవిత్రమైన రోజున మనం ఏదైనా పని చేస్తే, ఆ పని కచ్చితంగా అక్షయమవుతుందని చాలా మంది నమ్మకం. ఈరోజు ఏ పూజ చేసినా.. ఏ దానమైనా.. ఏ పుణ్య కార్యం చేసినా దాని ఫలితం అక్షయం అవుతుందని పండితులు చెబుతున్నారు. అదే విధంగా అక్షయ తృతీయ రోజున ఏ వస్తువు కొనుగోలు చేసినా.. అది ఎప్పటికీ తమతోనే ఉంటుందని చాలా మంది నమ్ముతారు. అందుకే బంగారం కొనడం ద్వారా లక్ష్మీదేవికి స్వాగతం పలకొచ్చని చాలా మంది భావిస్తారు.

విష్ణుమూర్తి పూజలు..
పురాణాల ప్రకారం, తృతీయ తిథి బ్రహ్మతో కలిసి ఉంటుంది కాబట్టి అక్షయ తృతీయకు చాలా విశేషముంది. ఈ పవిత్రమైన రోజున ఉపవాస దీక్ష చేపట్టి.. ఏ పుణ్య కార్యం చేసినా దాని ఫలితం అక్షయంగానే ఉంటుందని పండితులు చెబుతారు. ఈ తిథి రోజున అక్షయుడైన విష్ణుమూర్తిని పూజిస్తారు. అందుకే ఈరోజును అక్షయ తృతీయ అని పిలుస్తారు.
Akshaya
Tritiya
2022:అక్షయ
తృతీయ
రోజున
పొరపాటున
కూడా
ఆ
పనులు
చేయకండి...!

పురాణాలను పరిశీలిస్తే..
రావణాసురుడు లంకను ఆక్రమించుకోవడానికి ముందు కుభేరుడు లంకా నగరాన్ని పాలించాడని పురాణాల ద్వారా తెలుస్తోంది. కుభేరుడు.. శివుని, బ్రహ్మదేవుని ఆశీస్సుల కోసం తపస్సు చేశాడు. దీని ఫలితంగా ఎన్నో వరాలను పొందాడు. అల్కాపురి నగరాన్ని దేవతల వాస్తు శిల్పి అయిన విశ్వ కర్మ.. కుభేరుడి కోసం కైలాస పర్వతం దగ్గర నిర్మించాడు. అక్షయ తృతీయ రోజున కుభేరునికి స్వర్గ సంపద సంరక్షకుని పాత్ర లభించందని పండితులు చెబుతారు. అందుకే అక్షయ తృతీయ రోజున బంగారం కొనుగోలు చేయడం ద్వారా, కుభేరుని ఆరాధించడం వల్ల తమ కుటుంబంలో ఐశ్వర్యం లభిస్తుందని చాలా మంది నమ్ముతారు.

అక్షయ పాత్ర..
మరో కథనం మేరకు.. పాండవులు వనవాసంలో ఉన్నప్పుడు, శ్రీక్రిష్ణ పరమాత్ముడు వారిని కలిశాడు. ఆ సమయంలో ద్రౌపది తనకు భోజనం వడ్డించలేకపోయింది. అయితే క్రిష్ణుడు అక్కడ ఉన్న వంటపాత్రలో ఉన్న చిన్న మెతుకును ఆహారంగా స్వీకరించి, పాండవులకు తనపై ఉన్న ప్రేమ తన ఆకలి తీరుస్తుందని చెబుతూ.. పాండవులకు అక్షయ పాత్రని వరంగా ఇచ్చాడు.

అనునిత్యం ఆహారం..
అప్పటి నుంచి పాండవులు వన వాసంలో ఉన్నంత కాలం ఈ అక్షయ పాత్ర అనునిత్యం ఆహారం అందించేది. ఈ విధంగా అక్షయ తృతీయ రోజున బంగారం కొనుగోలు చేయడం వల్ల తమ కుటుంబానికి అనంత సౌభాగ్యం కలుగుతుందని చాలా మంది నమ్ముతారు.
సనాతన ధర్మం ప్రకారం, అక్షయ తృతీయ రోజును చాలా పవిత్రంగా భావిస్తారు. హిందూ పంచాంగం ప్రకారం, ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలో శుక్ల పక్షం యొక్క తృతీయ తిథిలో అక్షయ తృతీయ పండుగను జరుపుకుంటారు. ఈ ఏడాది అంటే 2022లో మే 03వ తేదీ మంగళవారం నాడు ఈ పవిత్రమైన పండుగ వచ్చింది. ఈరోజున శుభకార్యాలు చేయడానికి చాలా పవిత్రమైనదని నమ్ముతారు. ఈరోజున కచ్చితంగా బంగారం, వెండిని కొనాలని చాలా మంది ఆశపడతారు.