Latest Updates
-
వినాయక చవితి స్పెషల్..ఇంట్లోనే ఈజీగా నోరూరించే చాక్లెట్ మోదక్ ఎలా చేసుకోవాలంటే.. -
ఫోన్ పక్కనపెట్టి ఇది ట్రై చేయండి.. హృతిక్ చెబుతున్న హెల్త్ టిప్స్! -
నార్త్ స్టైల్ చోలే మసాలా.. పూరీ, చపాతీలోకి వేళ్లు చప్పరిస్తూ లాగించేస్తారు.! -
చికెన్, మటన్ కంటే 50 రెట్లు బలం..ఏడాది పాటు నిల్వ ఉండే బోడకాకరకాయ పచ్చడి ఇలా చేయండి -
వయసు పైబడితేనే అల్జీమర్స్ వస్తుందా.. మతిమరుపునకు దారితీసే ప్రమాదకర కారకాలివే.! -
ఉద్యోగం వదిలి వ్యాపారం చేస్తే... ఈ రాశుల వారు కోటీశ్వరులు అవ్వడం పక్కా! -
నాన్‌వెజ్ అనుకుంటే పప్పులో కాలేసినట్లే.. వెజ్ ప్రియుల కోసం స్పెషల్ లివర్ ఫ్రై.. రెస్టారెంట్ టేస్ట్‌తో.! -
అమ్మమ్మల నాటి చిట్కా..గ్యాస్, ఎసిడిటి,అజీర్తి సమస్యలకు చెక్! -
కృష్ణాష్టమి ఉపవాసం ఉంటున్నారా? అయితే నీరసం రానివ్వని ఈ సగ్గుబియ్యం వడలు ట్రై చేయండి! -
పెళ్లిళ్లు, పండుగల్లో అమ్మాయిలూ జాగ్రత్త.. మెహందీ పెట్టుకుంటే పొట్ట ఇన్ఫెక్షన్ల ప్రమాదం.!
అక్షయ తృతీయ ఏప్రిల్ 19నా? 20నా? పూజకు, గోల్డ్ షాపింగ్ ముహూర్తాలు ఇవిగో!
భారతీయులు అత్యంత భక్తిశ్రద్ధలతో, సంతోషంగా జరుపుకునే పర్వదినాలలో అక్షయ తృతీయ ఒకటి. అక్షయ తృతీయ అనగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేది బంగారం కొనుగోళ్లు, లక్ష్మీదేవి పూజ. అయితే ఈ సంవత్సరం అక్షయ తృతీయ పండుగను ఏప్రిల్ 19న జరుపుకోవాలా? లేక 20న జరుపుకోవాలా? అన్న సందేహం చాలా మందిలో ఉంది.

తేదీ విషయంలో గందరగోళం ఎందుకు?
పంచాంగం ప్రకారం వైశాఖ మాసంలోని శుక్ల పక్షం (చంద్రుడు వృద్ధి చెందే దశ) మూడవ రోజైన తృతీయ తిథినాడు అక్షయ తృతీయను జరుపుకుంటాం. ఈ ఏడాది తృతీయ తిథి ఏప్రిల్ 19 ఉదయం 10:49 గంటలకు ప్రారంభమై, ఏప్రిల్ 20 ఉదయం 7:49 గంటల వరకు ఉంటుంది.
ఈ రోజునే జరుపుకోవాలి
సాధారణంగా హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం ఏ పండుగనైనా ఉదయ తిథి(సూర్యోదయ సమయానికి ఉన్న తిథి) ఆధారంగా జరుపుకోవడం ఆనవాయితీ. ఈ లెక్కన చూస్తే పండుగను ఏప్రిల్ 20న జరుపుకోవాలి. కానీ ఇక్కడే ఒక చిక్కు వచ్చి పడింది. ఏప్రిల్ 20వ తేదీన ఉదయం 7:49 గంటలకే తృతీయ తిథి ముగిసిపోతుంది. మరి అంత తక్కువ సమయంలో ప్రజలు షాపింగ్ చేయడం, ప్రశాంతంగా పూజా కార్యక్రమాలు నిర్వహించడం సాధ్యపడదు.
దీంతో ధర్మశాస్త్రాలు స్పష్టమైన పరిష్కారాన్ని చూపించాయి. ఉదయ తిథి నియమం అన్ని పండుగలకు ఒకేలా వర్తించదు. వైశాఖ శుక్ల తృతీయ తిథి మధ్యాహ్నానికి ముందు ప్రారంభమైతే ఆ రోజునే అక్షయ తృతీయగా పరిగణించాలని శాస్త్రాలు తెలుపుతున్నాయి. ఏప్రిల్ 19 ఉదయం 10:49 గంటలకే (మధ్యాహ్నానికి ముందే) తిథి మొదలవుతోంది కాబట్టి పూజలకు, శుభకార్యాలకు విశేషమైన సమయం లభిస్తుంది. పైగా ఆదివారం రావడం మరింత కలిసివచ్చే అంశం. కాబట్టి ఏప్రిల్ 19వ తేదీనే అక్షయ తృతీయను ఘనంగా జరుపుకోవాలని పండితులు స్పష్టం చేస్తున్నారు.
పూజకు శుభ సమయం
ఏప్రిల్ 19 ఉదయం 10:49 నుండి మధ్యాహ్నం 12:20 గంటల వరకు పూజకు శుభ సమయం. అంటే మొత్తం 1 గంట 32 నిమిషాల అత్యంత శుభ సమయం ఉందని పండితులు చెబుతున్నారు.

బంగారం కొనుగోలుకు శుభ ముహూర్తాలు
ఏప్రిల్ 19 ఉదయం 10:49 గంటల నుండి మరుసటి రోజు ఏప్రిల్ 20 ఉదయం 7:49 గంటల మధ్య మీరు ఎప్పుడైనా బంగారం కొనుగోలు చేయవచ్చు.
ఈ ఏడాది అక్షయ తృతీయ ఎందుకంత ప్రత్యేకం?
ఈ సంవత్సరం వచ్చే అక్షయ తృతీయకు ఒక అరుదైన విశిష్టత ఉంది. ఒకే రోజున శ్రీమహావిష్ణువు అవతారాలైన నర-నారాయణ జయంతి, హయగ్రీవ జయంతి, పరశురామ జయంతి కలసి రావడంతో పాటు గౌరీ దేవి పూజ కూడా ఇదే రోజున నిర్వహించడం అత్యంత విశేషం.
అక్షయ తృతీయ ప్రాముఖ్యత
అక్షయం అంటే ఎప్పటికీ నాశనం కానిది, తరిగిపోనిది అని అర్థం. ఈ పవిత్రమైన రోజున చేసే ఏ చిన్న సత్కార్యమైనా, దానధర్మాలైనా అనంతమైన, శాశ్వతమైన పుణ్యాన్ని ఇస్తాయని పురాణాలు చెబుతున్నాయి. అంతేకాదు సత్యయుగం ముగిసి త్రేతాయుగం ప్రారంభమైన పవిత్ర దినం కూడా ఇదే.



Click it and Unblock the Notifications