Latest Updates
-
శరీరానికి అవసరమైన పోషకాల కోసం.. రుచికరమైన గ్రీన్ పొంగల్ ఎలా చేసుకోవాలంటే.. -
వాస్తు ప్రకారం ఇల్లు తుడుచుకోవడానికి సరైన టైం ఏది? -
కిచెన్‌లో శ్రమ తగ్గించే చిట్కాలు.. ఈ టెక్నిక్స్‌తో అన్నం అంటుకోదు, పప్పు పొంగిపోదు.! -
టీ తాగితే ఎముకలు కరిగిపోతాయా? ఈ విషయాలు మీకు తెలుసా? -
డైలీ ఐదు చాలు.. వీటిని రాత్రంతా నానబెట్టి తింటే రక్తహీనత బాధే ఉండదు.! -
రాఖీ, కృష్ణాష్టమి స్పెషల్..అచ్చు స్వీట్ షాప్ రుచితో ఇంట్లోనే పర్ఫెక్ట్ సోన్ పాప్డీ చేసుకోండిలా.. -
శుక్ర గోచారం 2026..ఆగష్టు 25 నుంచి ఈ 3 రాశులకు కష్టాలు తప్పవు! -
శ్రావణ మాసం స్పెషల్ మజ్జిగ ఆలు కర్రీ..జన్మ జన్మలు గుర్తిండిపోయే రుచి! -
పాముకాటుకి గురైతే మేల్కొని ఉండాలా.. పొరపాటున కళ్లు మూస్తే ఏం జరుగుతుంది.? -
పిల్లల్లో క్యాన్సర్ తొలి లక్షణాలు..ప్రతి పేరెంట్ తెలుసుకోవాల్సిన నిజాలు..
Akshaya Tritiya 2023: అక్షయ తృతీయ రోజున పొరపాటున కూడా ఆ పనులు చేయకండి...!
సనాతన ధర్మం ప్రకారం, అక్షయ తృతీయ రోజును చాలా పవిత్రంగా భావిస్తారు.

హిందూ పంచాంగం ప్రకారం, ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలో శుక్ల పక్షం యొక్క తృతీయ తిథిలో అక్షయ తృతీయ పండుగను జరుపుకుంటారు.

ఈ ఏడాది అంటే 2023లో ఏప్రిల్ 22వ తేదీ మంగళవారం నాడు ఈ పవిత్రమైన పండుగ వచ్చింది. ఈరోజున శుభకార్యాలు చేయడానికి చాలా పవిత్రమైనదని నమ్ముతారు. అయితే ఈరోజున కొన్ని పనులు పొరపాటున కూడా చేయరాదట. మరికొన్ని పనులు తప్పకుండా చేయాలట. ఇంతకీ ఆ పనులేంటో ఇప్పుడు తెలుసుకుందాం...

అలా ఇంటికి వెళ్లొద్దు..
అక్షయ తృతీయ రోజున సాధారణంగా బంగారం కొనడాన్ని శుభంగా భావిస్తారు. కొన్ని కారణాల వల్ల బంగారంతో చేసిన వస్తువులను మీరు కొనలేకపోతే... మీ సామర్థ్యానికి అనుగుణంగా ఏదైనా లోహంతో చేసిన ఇతర వస్తువులను కొనుక్కొని ఇంటికి వెళ్లండి. అప్పుడే మీకు శుభ ఫలితాలొస్తాయి.

ప్రయాణాలు వాయిదా..
కొన్ని పురాణాల ప్రకారం, ఈ పవిత్రమైన రోజున జంద్యం ధరించకూడదట. అలాగే అక్షయ తృతీయ రోజున ప్రయాణాలు చేయకపోవడమే మంచిది. ఈరోజున మీరు ఏదైనా జర్నీ ప్లాన్ చేసుకుని ఉంటే.. వాయిదా వేసుకోవడం మంచిది.

కోపం వద్దు..
అక్షయ తృతీయ రోజున మీ మనసులో ఏదైనా ప్రతికూలత ఉంటే.. దాన్ని అలాగే ఉంచండి. దాన్ని కోపం రూపంలో బయటికి రానివ్వదు. ఎందుకంటే ఈ పవిత్రమైన రోజు కోపం పడితే.. లక్ష్మీదేవి మీ ఇంటి నుండి వెళ్లిపోతుంది. ఎవరి ఇల్లు అయితే ప్రశాంతంగా, ఆనందంగా ఉంటుందో ఆ ఇంట్లోనే లక్ష్మీదేవి అడుగు పెడుగుతుంది.

శుభ్రతను పాటించాలి..
అక్షయ తృతీయ రోజున హిందువులకు ఎంతో పవిత్రమైన రోజు. ఈరోజున మీ ఇంటిని ముఖ్యంగా పూజా మందిరాన్ని చాలా శుభ్రంగా ఉంచుకోవాలని గుర్తుంచుకోండి. ఇలా చేస్తేనే మీరు కోరుకున్న కోరికలు నెరవేరుతాయి.

తులసిని వాడొద్దు..
మీరు విష్ణుమూర్తిని పూజించే సమయంలో తులసి మొక్కను పొరపాటున కూడా వాడకండి. సాధారణంగా విష్ణుమూర్తితో లక్ష్మీదేవిని పూజించినప్పుడు, తులసి దేవిని అర్పిస్తుంటారు. ఈ రోజున తెల్లవారుజామునే స్నానం చేయడం మరియు శుభ్రమైన బట్టలు ధరించడం వంటివి చేయండి. తులసిని మాత్రం ఈరోజు పూజలో వాడకండి. ఒకవేళ మీరు ఇది మీరు మరచిపోతే చెడు ఫలితాలు వచ్చే అవకాశం ఉంది.

లక్ష్మీ, విష్ణువులను విడిగా పూజించకండి..
అక్షయ తృతీయ రోజున శ్రీ మహావిష్ణువును, తన భార్య శ్రీ మహాలక్ష్మీని విడివిడిగా పూజించకండి. ఈ పవిత్రమైన రోజున ఈ దేవుళ్లకు కలిపి పూజలు చేయాలి. దీని వల్ల మీకు, మీ కుటుంబానికి సందప, శ్రేయస్సు, ఆశీర్వాదంతో పాటు అక్షయ పుణ్యం లభిస్తుంది. అక్షయ తృతీయ రోజు ఈ పనులు అస్సలే చేయొద్దు.



Click it and Unblock the Notifications