Just In
Don't Miss
- News
తిరుమలకు పోటెత్తుతున్న భక్తులు: టీటీడీ సంచలన నిర్ణయం
- Finance
Dubai: ఒకే ఒక్క ఇటుక... దుబాయ్ ప్రిన్స్ నుంచి కాంప్లిమెంట్.. సర్ ప్రైజ్ అయిన డెలివరీ ఏజెంట్
- Technology
ఇనుములో ఓ హృదయం మొలిచెనే.. Xiaomi నుంచి తొలి హ్యుమనాయిడ్ రోబో!
- Automobiles
భారతీయ మార్కెట్లో విడుదల కానున్న 'ఓలా ఎలక్ట్రిక్ కారు'.. ఇలా ఉంటుంది
- Movies
Intinti Gruhalakshmi Weekly Roundup: వైజాగ్లో తులసి, సామ్రాట్.. వీళ్ల మధ్య ఊహించనిది జరగబోతుందా!
- Sports
భారత క్రీడల్లో స్వర్ణ యుగం మొదలైంది: నరేంద్ర మోదీ
- Travel
పర్యాటకులను ఆకర్షించే మేఘ్ మలహర్ పర్వ విశేషాలు!
Akshaya Tritiya 2022:అక్షయ తృతీయ రోజున పొరపాటున కూడా ఆ పనులు చేయకండి...!
సనాతన ధర్మం ప్రకారం, అక్షయ తృతీయ రోజును చాలా పవిత్రంగా భావిస్తారు.
హిందూ పంచాంగం ప్రకారం, ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలో శుక్ల పక్షం యొక్క తృతీయ తిథిలో అక్షయ తృతీయ పండుగను జరుపుకుంటారు.
ఈ ఏడాది అంటే 2022లో మే 03వ తేదీ మంగళవారం నాడు ఈ పవిత్రమైన పండుగ వచ్చింది. ఈరోజున శుభకార్యాలు చేయడానికి చాలా పవిత్రమైనదని నమ్ముతారు. అయితే ఈరోజున కొన్ని పనులు పొరపాటున కూడా చేయరాదట. మరికొన్ని పనులు తప్పకుండా చేయాలట. ఇంతకీ ఆ పనులేంటో ఇప్పుడు తెలుసుకుందాం...
Akshay
Tritiya
2022:
మీ
రాశిని
బట్టి
అక్షయ
తృతీయ
రోజున
కొనాల్సినవి
ఇవే...!

అలా ఇంటికి వెళ్లొద్దు..
అక్షయ తృతీయ రోజున సాధారణంగా బంగారం కొనడాన్ని శుభంగా భావిస్తారు. కొన్ని కారణాల వల్ల బంగారంతో చేసిన వస్తువులను మీరు కొనలేకపోతే... మీ సామర్థ్యానికి అనుగుణంగా ఏదైనా లోహంతో చేసిన ఇతర వస్తువులను కొనుక్కొని ఇంటికి వెళ్లండి. అప్పుడే మీకు శుభ ఫలితాలొస్తాయి.

ప్రయాణాలు వాయిదా..
కొన్ని పురాణాల ప్రకారం, ఈ పవిత్రమైన రోజున జంద్యం ధరించకూడదట. అలాగే అక్షయ తృతీయ రోజున ప్రయాణాలు చేయకపోవడమే మంచిది. ఈరోజున మీరు ఏదైనా జర్నీ ప్లాన్ చేసుకుని ఉంటే.. వాయిదా వేసుకోవడం మంచిది.

కోపం వద్దు..
అక్షయ తృతీయ రోజున మీ మనసులో ఏదైనా ప్రతికూలత ఉంటే.. దాన్ని అలాగే ఉంచండి. దాన్ని కోపం రూపంలో బయటికి రానివ్వదు. ఎందుకంటే ఈ పవిత్రమైన రోజు కోపం పడితే.. లక్ష్మీదేవి మీ ఇంటి నుండి వెళ్లిపోతుంది. ఎవరి ఇల్లు అయితే ప్రశాంతంగా, ఆనందంగా ఉంటుందో ఆ ఇంట్లోనే లక్ష్మీదేవి అడుగు పెడుగుతుంది.
Akshay
Tritiya
2021:
అక్షయ
తృతీయ
నాడు
బంగారమే
కాదు..
ఇవి
కూడా
కొనొచ్చట..!

శుభ్రతను పాటించాలి..
అక్షయ తృతీయ రోజున హిందువులకు ఎంతో పవిత్రమైన రోజు. ఈరోజున మీ ఇంటిని ముఖ్యంగా పూజా మందిరాన్ని చాలా శుభ్రంగా ఉంచుకోవాలని గుర్తుంచుకోండి. ఇలా చేస్తేనే మీరు కోరుకున్న కోరికలు నెరవేరుతాయి.

తులసిని వాడొద్దు..
మీరు విష్ణుమూర్తిని పూజించే సమయంలో తులసి మొక్కను పొరపాటున కూడా వాడకండి. సాధారణంగా విష్ణుమూర్తితో లక్ష్మీదేవిని పూజించినప్పుడు, తులసి దేవిని అర్పిస్తుంటారు. ఈ రోజున తెల్లవారుజామునే స్నానం చేయడం మరియు శుభ్రమైన బట్టలు ధరించడం వంటివి చేయండి. తులసిని మాత్రం ఈరోజు పూజలో వాడకండి. ఒకవేళ మీరు ఇది మీరు మరచిపోతే చెడు ఫలితాలు వచ్చే అవకాశం ఉంది.

లక్ష్మీ, విష్ణువులను విడిగా పూజించకండి..
అక్షయ తృతీయ రోజున శ్రీ మహావిష్ణువును, తన భార్య శ్రీ మహాలక్ష్మీని విడివిడిగా పూజించకండి. ఈ పవిత్రమైన రోజున ఈ దేవుళ్లకు కలిపి పూజలు చేయాలి. దీని వల్ల మీకు, మీ కుటుంబానికి సందప, శ్రేయస్సు, ఆశీర్వాదంతో పాటు అక్షయ పుణ్యం లభిస్తుంది.