For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అక్షయ త్రితీయ వ్రత కథ మరియు విధానం..!

By Lekhaka
|

అమావాస్య తరువాత వచ్చే 15 రోజులు శుక్ల పక్షంగా భావిస్తారు (పౌర్ణమి కాదు) చంద్రుడి పరిమాణం పెరిగినపుడు. హిందూ పంచాంగం ప్రకారం అక్షయ త్రితీయ హిందువులు అందరూ జరుపుకునే అత్యంత ప్రత్యేకమైన రోజు. ఈ పండుగను సంవత్సరం ముందు జరిగిన మంచికి ప్రతిఫలంగా దేవుడికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ చేసుకునే పండుగ, అలాగే జీవితంలో సంపద, సంతోషం అభివృద్ది చెంది ఎల్లప్పుడూ ఇలాగే ఉండాలని దేవుడిని కోరుకుంటాము.

హిందువులకు ఇది ఒక ప్రాముఖ్య పండగలలో ఒకటైనప్పటికీ, ఇది ఒక దేవుడికి మాత్రమే సంబంధించింది కాదు. హిందువులు సాధారణంగా జరుపుకునే పండుగాలలా కాకుండా, అక్షయ త్రితీయ రోజు మీరు ఏ దేవుడు లేదా దేవతకు పూజించినా ఫలితాలు అద్భుతంగా ఉంటాయి.

 Akshaya Tritiya Vrat Katha And Vidhi

మహా విష్ణువు ఈ రోజు ప్రధాన దేవుడు, కానీ ఆరోజు, ఇతర దేవతలు కూడా పూజించబడతారు. సంపద, శ్రేయస్సు కోసం ఆరోజు లక్ష్మీదేవిని పూజిస్తారు. శక్తికి ప్రతిరూపమైన అన్నపూర్ణను తమ వంటగది ఎల్లప్పుడూ ఆరోగ్యకరమైన, పౌష్టికాహారంతో నిండి ఉండాలని పూజిస్తారు.

నూతన వెంచర్లను ప్రారంభించే వ్యవస్థాపకులు, వ్యాపారస్తులు ఆరోజు వినాయకుడిని పూజిస్తారు. ఎందుకంటే వినాయకుడు అన్ని ఆటంకాలను తొలగించేవాడు కాబట్టి. పెళ్ళిచేసుకున్న దంపతులు లేదా పెళ్లి చేసుకోబోయే దంపతులు శివుడిని, పార్వతిని పూజిస్తారు. వారి వైవాహిక జీవితం బాగుండాలని కోరుకుంటారు.

వ్రతము లేదా ఉపవాసం ఆరాధనకు ఇదొక మార్గం. అక్షయ త్రితీయ వ్రతం చాలా తేలికగా, ప్రభావవంతంగా ఉంటుంది. అక్షయ త్రితీయ వ్రతం జరుపుకోవడానికి ఎక్కువ ఏమీ చేయాల్సిన అవసరం లేదు. మీరు కష్టమైనా నియమాలను కూడా పాటించాల్సిన అవసరం లేదు. ప్రధాన విషయం ఏమిటంటే మీరు ఆరోజు ఉపవాసం తప్పనిసరిగా ఉండి, మీకు ఇష్టమైన దేవుడిని పూజించి, అనుకూల శక్తి కోసం పేదవారు లేదా బ్రాహ్మలకు దానం చేయాలనీ గుర్తుంచుకోండి. అక్షయ త్రితీయ వ్రతం, చేయు విధానం గురించి మరింత వివరాలు తెలుసుకోవడానికి మొత్తం చదవండి.

అక్షయ త్రితీయ వ్రతం & చేయు విధానం

అక్షయ త్రితీయ రోజు మీరు వేకువ ఝామునే లేవాలి. మీ మొదటి పని ఇల్లు పూర్తిగా శుభ్రంచేసుకోవడం. మురికి ఇంట్లోకి లక్ష్మీదేవి ఎప్పటికీ ప్రవేశించదని తెలుసు కదా. తరువాత, రోజువారీ పనులను ముగించుకుని, మిమ్మల్ని మీరు శుభ్రపరుచుకోండి. అయిన తరువాత, మీ ఇంట్లో శుభ్రమైన ప్రదేశంలో విష్ణు మూర్తి లేదా మీకు ఇష్టమైన దేవుడు లేదా దేవత విగ్రహాన్ని లేదా ఫోటోని పెట్టండి. ఇది సాధారణంగా పూజ గదిలో ఉంటుంది.

 Akshaya Tritiya Vrat Katha And Vidhi

విగ్రహం లేదా పటం పెట్టేటపుడు ఈ క్రింది మంత్రాన్ని చదవండి:

మామ్ అఖిలపప్పక్షయ పూర్వక సకల శుభఫల ప్రాప్యతే I భగవత్ ప్రీతి కామనాయ దేవతాయ పూజాం కరిష్యే II

'గోమూత్రంతో’ విగ్రహాన్ని లేదా పటాన్ని కడగండి.

షోడశోపచార పూజ చేస్తూ దేవుడిని ప్రార్ధించండి. మహా విష్ణువుని మంచి సుగంధ పరిమళాలతో కూడిన పువ్వులతో పూజించండి. మహా విష్ణువుకు మంచి వాసన నిచ్చే పూలమాల సమర్పించండి. అక్షయ త్రితీయ రోజు విష్ణు సహస్రనామం చదవడం చాలా మంచిది.

చివరిగా, తులసి ఆకులతో పూజించండి.

ప్రతిరోజూ ఆరతి ఇచ్చి, ప్రసాదాలు పంచిపెట్టండి.

ఒకప్పుడు, ఒక మంచి, ధర్మనిష్టాపరుడైన ధర్మదాస్ అనే వ్యక్తీ ఉండేవాడు. అతను పేదవారి పట్ల, బ్రాహ్మణుల పట్ల చాలా మర్యాదగా, గౌరవంగా ఉండేవాడు. కానీ అతని జీవితంలో ఒక బాధ ఉంది. అతనికి ఒక పెద్ద కుటుంబం ఉంది, దాన్ని నిలుపుకోవడానికి చాలా కష్టాలు పడేవాడు. అలంటి సమయంలో, ధర్మదాసు అక్షయ త్రితీయ వ్రతం గురించి చెప్పుకోవడం విన్నాడు.

 Akshaya Tritiya Vrat Katha And Vidhi

ఆ సంవత్సరం, అక్షయ త్రితీయ రోజు వచ్చింది, ధర్మదాసు గంగ నది దగ్గరకు వెళ్ళాడు. తరువాత, అతను ఒక విగ్రహాన్ని అక్కడ ఉంచి దేవుడిని ప్రార్ధించడం మొదలు పెట్టాడు. తరువాత దానాలు చేయడం ప్రారంభించాడు. విసనకర్రలు, గోధుమ, జొన్నలు, బియ్యం, పప్పు, బంగారం, మంచి కలిగించే ఇతర పదార్ధాలను దానం చేసాడు.

అతని భార్య అంతంత దానాలను చేయకుండా ఉండడానికి ప్రయత్నించింది కానీ ధర్మదాసు వినలేదు. అతని బంధువులు అతనికి శత్రువులైనారు. అతనెప్పుడూ వ్రుద్దాప్యంతో, జబ్బుతో బాధపడుతూ ఉండేవాడు. కానీ ఇవన్నీ పక్కనపెట్టి, అతను పూజించడం, దానం చేయడం చేస్తూనే ఉన్నాడు.

ఈ ప్రార్ధనకు ఫలితంగా, వైశ్య కులంలో జన్మించిన ధర్మదాసు కుశావతి నగరానికి రాజుగా జన్మించాడు. ఈ వ్రత సహాయంతో అతను చాలా సంపదతో, పేరుప్రఖ్యాతులు పొందాడు.

ఉపవాసం అయిన తరువాత ఈ కధను చదివి, వినిపించాలి. ఈ కధ చదివిన, విన్నా మీరు అద్భుతమైన సంపదను, శ్రేయస్సును పొందుతారు.

English summary

Akshaya Tritiya Vrat Katha And Vidhi

Akshaya Tritiya Vrat Katha And Vidhi,This article will let you know more about Akshaya Tritiya vrat and vidhi and the story revolving it.
Story first published: Thursday, April 27, 2017, 13:00 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more