For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

హిందూ ఆలయాల వెనకున్న అద్భుతమైన శాస్త్రీయ రహస్యం

|

విశిష్టమైన సంస్కృతీ సాంప్రదాయాలకి భారత దేశం ప్రసిద్ది. అన్నిటికంటే ముఖ్యంగా విభిన్నమైన సంస్కృతుల కలయిక భారత దేశంలో కనిపిస్తుంది. తినే ఆహారం, ధరించే దుస్తులు, నమ్మకం ఇలా ఎన్నో అంశాలపై భారతీయ సంస్కృతి ప్రతిబింబిస్తుంది. నమ్మకం విషయాన్ని ప్రస్తావించేటప్పుడు భారత దేశం మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది. ఎన్నో నమ్మకాలు భారత దేశంలో ఉన్నాయి. ఆ నమ్మకాలూ నానాటికీ పెరుగుతున్నాయి కూడా. ఈ నమ్మకాలన్నిటికీ మూలం హిందూ మతం. ఇవే నమ్మకాలు ప్రపంచంలోని మిగతా ప్రాంతాలకు కూడా విస్తరిస్తున్నాయి.

ప్రతి ఉదయం ప్రజలు ఆలయానికి వెళ్లి దైవ దర్శనం చేసుకోవడం ఇండియాలో సాధారణంగా కనిపించే దృశ్యం. ఆలయాలలో ప్రార్థిస్తే కోరికలు త్వరగా తీరతాయన్నది ఇక్కడి వారి నమ్మకం. అందువల్ల, భారతీయ సంస్కృతిలో ఆలయాలకు విశిష్ట స్థానం ఉంది. పర్యాటక రంగంలో కూడా ఆలయాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది.

ఇక నమ్మకాల విషయానికి వస్తే, ఆలయ సందర్శన చేస్తే కోరికలు తీరతాయని మీరు నమ్ముతున్నారా? కాదు అనడానికి కారణం ఉండవచ్చు. అయితే అవును అనడానికి నమ్మకం ఉంది. మీ నమ్మకం మీ కారణంపై ప్రభావం చూపిస్తుంది అని మేమంటే మీరేమంటారు?

ఆది నుంచి హిందూ మతంలో సైన్స్ కనిపిస్తూనే ఉంది. నమ్మకానికి ప్రతిబింబమైన ఆలయాలు కూడా ఇందుకు మినహాయింపు కాదు. హిందూ ఆలయాల నిర్మాణాల వెనుక సైన్స్ దాగి ఉందన్న విషయం హిందూ మతంతో సైన్స్ కున్న అనుబంధాన్ని నిరూపిస్తుంది. ఆలయాల వెనుకనున్న సైన్స్ మిమ్మల్ని తప్పక ఆశ్చర్యానికి గురి చేస్తుంది.

మరి ఆలయాల వెనుకనున్న రహస్యాలు అలాగే ఆలయ సందర్శనం వెనుకనున్న సైన్స్ ను తెలుసుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? అయితే చదవండి మరి.

పాజిటివ్ ఎనర్జీకి నిలయం

పాజిటివ్ ఎనర్జీకి నిలయం

నార్త్/సౌత్ పోల్స్ పీడనం యొక్క మ్యాగ్నెటిక్ అలాగే ఎలెక్ట్రిక్ వేవ్స్ డిస్ట్రిబ్యూషన్స్ ఎక్కడైతే సమృద్ధిగా లభ్యమవుతాయో అటువంటి ప్రదేశంలో పాజిటివ్ ఎనర్జీ ఎక్కువగా లభ్యమవుతుందని అంటారు. అలాంటి ప్రదేశాలలో ఆలయాల నిర్మాణం జరుగుతుంది.

పాజిటివ్ ఎనర్జీకి నిలయం

పాజిటివ్ ఎనర్జీకి నిలయం

ఆలయ గర్భగుడిలో మూల విగ్రహాన్ని ప్రతిష్టిస్తారు. ఆ ప్రదేశాన్ని గర్భాగృహం లేదా మూలస్థానమని అంటారు. నిజానికి గర్భగృహం చుట్టూ ఆలయాల నిర్మాణం జరుగుతుంది.

విగ్రహం

విగ్రహం

విగ్రహాన్ని దేవుడికి ప్రతిరూపంగా భావిస్తారు. దివ్యశక్తికి భౌతిక రూపమే విగ్రహం. విగ్రహం అనేది మానవులలో ఏకాగ్రతను పెంచడానికి అలాగే దేవుడిని గుర్తించడానికి తోడ్పడుతుంది. విగ్రహాన్ని పూజించడం ద్వారా మానవులు ప్రార్థనలలో మరొక అడుగు ముందుకేసినట్లవుతుంది. దివ్యత్వాన్ని అర్థం చేసుకోవడానికి విగ్రహపూజ మానవులకు తోడ్పడుతుంది. అందువల్ల, విగ్రహాన్ని ఆరాధించడమనే ప్రక్రియ మానవులలో ఏకాగ్రతను పెంపొందించడానికి తోడ్పడుతుందని చెప్పవచ్చు.

ప్రదక్షణం

ప్రదక్షణం

ఆలయాన్ని సందర్శించిన ప్రతి సారి మూల విగ్రహం చుట్టూ మూడు సార్లు తిరగడమనే ఆచారం ఉంది. ఈ ఆచారాన్ని ప్రదక్షిణం అని అంటారు. పరిక్రమ అని కూడా అంటారు. సానుకూల శక్తితో నిండిన విగ్రహం చుట్టూ మూడు సార్లు ప్రదక్షిణం చేయడం వల్ల ఆ శక్తి ప్రదక్షిణం చేస్తున్న వారికి చేరుతుంది. పాజిటివ్ ఎనర్జీతో నిండిన విగ్రహ పరిసరాల్లోకి వచ్చిన వారిపై ఆ శక్తి ప్రసరణ కాబడుతుంది. అందువల్ల, మూలవిగ్రహం చుట్టూ ప్రదక్షిణ చేస్తే ఆ విగ్రహం నుంచి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. తద్వారా, ఎన్నో రకాల రుగ్మతలను దూరం చేసి మనస్సుకు ఉత్సాహం కలుగుతుంది.

గంట కొట్టడం

గంట కొట్టడం

సాధారణ లోహాలతో ఆలయంలోని గంటలను తయారు చేయరు. కాడ్మియం, జింక్, సీసం, రాగి, నికెల్, క్రోమియం, మాంగనీస్. అనే వివిధ రకాల లోహాల మిశ్రమంతో గంటలను తాయారు చేస్తారు. ఏ ఏ మోతాదులో ఏఏ లోహాలను ఉపయోగిస్తారు అనే దానిలోనే సైన్స్ దాగుంది. గంట కొట్టినప్పుడు ధ్వనించే శబ్దం ఎడమ, కుడి మెదడుల మధ్య ఐక్యతను పెంపొందించే విధంగా ఉండేలా లోహాల మోతాదును ఎంచుకుంటారు. అందుకే, గంట కొట్టినప్పుడు వచ్చే శబ్దం చాలా పదనుగా ఉంటుంది. దాదాపు ఏడూ సెకండ్ల పాటు వినిపిస్తుంది. శరీరంలో నున్న ఏడు ముఖ్యమైన చక్రాలకు గంట కొట్టిన శబ్దం యొక్క ప్రతిధ్వని వినిపిస్తుంది. అందువల్ల గంట కొట్టిన క్షణం నుండి కొద్ది క్షణాల వరకు మెదడు ఖాళీగా మారుతుంది. ఒక రకమైన ట్రాన్స్ లో కి వెళ్ళడం జరుగుతుంది. అటువంటి ట్రాన్స్ లో ఉన్నప్పుడు మెదడు సానుకూల శక్తితో నిండుతుంది.

అభిషేకం

అభిషేకం

ఆలయాలలో విగ్రహాలకు తరచూ కొన్ని రకాల జలాలతో అభిషేకం చేయడం అనే సంప్రదాయం వెనుక కూడా ఆసక్తికరమైన సైన్స్ ఉంది. దీనినే 'చరణామృతం'గా భక్తులకు అందిస్తారు. అభిషేకంలో వాడే మిశ్రమం సాధారణమైనది కాదు. తులసి, కుంకుమ పూవు, కర్పూరం, ఏలకులు, లవంగాలను నీటితో కలిపినా మిశ్రమ జలాన్ని అభిషేకానికి ఉపయోగిస్తారు. ఈ పదార్థాలన్నీఔషద గుణాలను అమితంగా కలిగినవి. ఈ నీటితో విగ్రహాన్ని అభిషేకించడం వలన మ్యాగ్నెటిక్ రేడియేషన్స్ ఆ నీటిలో నున్న ఔషద గుణాలను మరింత పెంచుతాయి. భక్తులందరికీ ఈ పవిత్ర జలాన్ని మూడు చెంచాలు ఇస్తారు. మ్యాగ్నెటొ థెరపీగా ఈ ప్రక్రియను అభివర్ణించవచ్చు. అన్నిటికీ మించి, లవంగాలకు దంత క్షయం నుంచి రక్షించే గుణం ఉంది. కుంకుమ పూవు, తులసికి సాధారణ జలుబు, జ్వరం నుంచి రక్షించే శక్తి ఉంది. ఏలకులు మరియు కర్పూరం సహజసిద్ధమైన మౌత్ ఫ్రెషనర్స్ గా తోడ్పడతాయి.

శంఖారావం

శంఖారావం

హిందూ మతంలో శంఖారావానికి ఓంకారమనే పవిత్రమైన చిహ్నంతో అనుసంధానమై ఉంది. అత్యంత ప్రాధాన్యత కలిగిన ఓంకారాన్ని ఈ సృష్టిలో మొదటి శబ్దమని భావిస్తారు. శంఖారావాన్ని ఏదైనా ప్రారంభించడానికి ముందు సూచికగా పరిగణిస్తారు. ఈ శంఖారావంతో ఏదైనా పనిని ప్రారంభిస్తే, ఆ పని ఏ ఆటంకాలు లేకుండా సుజావుగా పూర్తవుతుందని నమ్ముతారు. సానుకూల శక్తిని పెంపొందించడంలో శంఖారావం ప్రధాన పాత్ర పోషిస్తుంది.

శక్తి చేకూరుతుంది

శక్తి చేకూరుతుంది

శక్తి సృష్టించబడదు, నాశనం చేయబడదు. శక్తి కేవలం ఒకరి నుంచి ఒకరికి చేకురుతుందన్న విషయం అందరికీ తెలిసిందే. ఆలయాల విషయంలో కూడా అదే వాస్తవం. భూమి ఉపరితలంమీదున్న సానుకూల శక్తిని ఆలయాలు స్వీకరించి వివిధ మాధ్యమాల ద్వారా ఆలయ సందర్శనలోనున్న భక్తులకు ఆ శక్తిని చేకూరుస్తాయి. అందువల్ల, తరుచూ ఆలయ సందర్శనలు చేస్తే సానుకూల శక్తి లభిస్తుంది. అందువల్ల, ఆలయంలో కొద్దిసేపు కూర్చోవడమనే ఆచారం ఉంది. ఆలయంలో కూర్చోకుండా ఆలయ సందర్శన చేసినా ఫలితం ఉండదు.

English summary

Amazing Science Behind Hindu Temples

India is a place which is known for many things and most important of them all is our unique culture. This culture encompasses a lot of things: food, dressing, rituals, faith and so many other things.
Story first published: Saturday, December 13, 2014, 14:44 [IST]
Desktop Bottom Promotion