Latest Updates
-
వాస్తు ప్రకారం ఇల్లు తుడుచుకోవడానికి సరైన టైం ఏది? -
కిచెన్‌లో శ్రమ తగ్గించే చిట్కాలు.. ఈ టెక్నిక్స్‌తో అన్నం అంటుకోదు, పప్పు పొంగిపోదు.! -
టీ తాగితే ఎముకలు కరిగిపోతాయా? ఈ విషయాలు మీకు తెలుసా? -
డైలీ ఐదు చాలు.. వీటిని రాత్రంతా నానబెట్టి తింటే రక్తహీనత బాధే ఉండదు.! -
రాఖీ, కృష్ణాష్టమి స్పెషల్..అచ్చు స్వీట్ షాప్ రుచితో ఇంట్లోనే పర్ఫెక్ట్ సోన్ పాప్డీ చేసుకోండిలా.. -
శుక్ర గోచారం 2026..ఆగష్టు 25 నుంచి ఈ 3 రాశులకు కష్టాలు తప్పవు! -
శ్రావణ మాసం స్పెషల్ మజ్జిగ ఆలు కర్రీ..జన్మ జన్మలు గుర్తిండిపోయే రుచి! -
పాముకాటుకి గురైతే మేల్కొని ఉండాలా.. పొరపాటున కళ్లు మూస్తే ఏం జరుగుతుంది.? -
పిల్లల్లో క్యాన్సర్ తొలి లక్షణాలు..ప్రతి పేరెంట్ తెలుసుకోవాల్సిన నిజాలు.. -
రాఖీ 2026 స్పెషల్: స్వీట్ షాప్ టేస్ట్‌ను తలదన్నేలా ఇంట్లోనే ఈజీగా కొకొనట్ బర్ఫీ.!
April 2022 Vrat And Festivals: ఈ నెలలో ఉగాది, రంజాన్ తో పాటు ఏయే పండుగలు వచ్చాయో తెలుసా...
ఏప్రిల్ మాసంలో వచ్చే ముఖ్యమైన పండుగలు, వ్రతాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
హిందూ పంచాంగం ప్రకారం, ఏప్రిల్ నెల అంటేనే ఫాల్గుణ మాసం, ఛైత్ర మాసం కలిసి ఉంటాయి. ఈ పవిత్రమైన పర్వదినాల్లో ఉగాది పండుగతో పాటు అనేక పండుగలు మరియు వ్రతాలు వచ్చాయి.

ఈ నెలలో ఉగాది, శ్రీరామ నవమి, హనుమాన్ జయంతితో పాటు ఇతర ముఖ్యమైన పండుగలు మరియు వ్రతాలన్నీ ఇదే మాసంలో జరుపుకోనున్నారు. ఇదే నెలలో ముస్లింల పవిత్రమైన పండుగ రంజాన్ కూడా వచ్చింది. క్రైస్తవుల గుడ్ ఫ్రైడే, ఈస్టర్ వంటి ఎంతో ప్రాముఖ్యత పండుగలు ఇదే నెలలో వచ్చాయి. దీంతో ఈ నెలకు ఎంతో ప్రాధాన్యత ఏర్పడింది.

ఈ ఏడాదిలో తెలుగు రాష్ట్రాల ప్రజలు 'శుభకృత్' నామ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నట్లు భావిస్తారు. ఇదే పండుగను కర్నాటకలో యుగాది అని, ఇతర రాష్ట్రాల వారు గుడి పడవ, ఇతర పేర్లతో ఈ పండుగను జరుపుకుంటారు. ఈ సందర్భంగా ఏప్రిల్ మాసంలో ఏయే తేదీల్లో ఏయే పండుగలు వచ్చాయి.. ఏయే రోజుల్లో వచ్చాయనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...

ఏప్రిల్ 2న..
హిందూ పంచాంగం ప్రకారం, ఏప్రిల్ రెండో తేదీన ‘శభకృత్' నామ సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం. తెలుగు వారి తొలి మాసం ఛైత్ర మాసం కూడా 2022 సంవత్సరంలో ఏప్రిల్ 2వ తేదీన అంటే శనివారం నాడు ప్రారంభమవుతుంది. ఈ పవిత్రమైన రోజున ఉగాది పండుగను దేశ వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటారు. షడ్రుచుల సమ్మేళనం అయిన ఉగాది పచ్చడిని కచ్చితంగా రుచి చూస్తారు. ఇదే రోజున రంజాన్ మాసం కూడా ప్రారంభమవుతుంది. ఈరోజు నుండి ముస్లిలందరూ నెల రోజుల పాటు ఉపవాస దీక్షలు ఉంటారు.

ఏప్రిల్ 8, 9వ తేదీల్లో..
మన దేశంలోని చాలా రాష్ట్రాల్లో శీతలా సప్తమి, శీతల అష్టమి రోజున చాలా పవిత్రంగా భావిస్తారు. ఈ మాసంలోని క్రిష్ణ పక్ష సప్తమి, అష్టమి తిథుల్లో నిల్వ ఉంచిన ఆహారాన్ని మాత్రమే తీసుకుంటారు. ఈరోజున ఇళ్లలో పొయ్యి, గ్యాస్ వంటి వాటిని వెలగించరు. ఇవి ఈ మాసంలోని ఏప్రిల్ 8న శుక్రవారం, ఏప్రిల్ 9వ తేదీన శనివారం నాడు వచ్చాయి.

శ్రీరామ నవమి..
ఉగాది పండుగ తర్వాత సరిగ్గా తొమ్మిది రోజుల తర్వాత, అంటే నవమి రోజున శ్రీరామ నవమి పండుగను జరుపుకుంటారు. ఈ పవిత్రమైన రోజునే శ్రీరాముడు జన్మించాడని చాలా మంది నమ్ముతారు. 2022 సంవత్సరంలో ఏప్రిల్ 10వ తేదీన శ్రీరాముని జయంతి రోజున జరుపుకోనున్నారు.

హనుమాన్ జయంతి, ఛైత్ర పూర్ణిమ
తెలుగు వారి తొలి సంవత్సరంలో వచ్చే తొలి పౌర్ణమి అంటే ఛైత్ర పౌర్ణమి తిథి రోజున హనుమాన్ జయంతిని జరుపుకుంటారు. 2022 సంవత్సరంలో ఏప్రిల్ 16వ తేదీన హనుమాన్ జయంతిని జరుపుకోనున్నారు. ఈ పవిత్రమైన రోజున చాలా మంది హిందువులు ఉపవాసం ఉంటారు. తాము ఏదైనా ముఖ్యమైన పని ప్రారంభించినప్పుడు, ఆ పని విజయవంతంగా పూర్తవడంతో హనుమంతుడి ఆశీర్వాదం లభిస్తుందని చాలా మంది నమ్ముతారు. అలాగే కొన్ని చోట్ల కార్తీక మాసంలో కూడా హనుమాన్ జయంతిని జరుపుకుంటారు.

గుడ్ ఫ్రైడే, ఈస్టర్..
క్రైస్తవులు ఎంతో పవిత్రంగా భావించే గుడ్ ఫ్రైడే కూడా ఈ ఏప్రిల్ మాసంలో 15వ తేదీన వచ్చింది. ఏసు శిలువ చేయబడిన రోజుగా ఈరోజు స్మరించుకుంటారు. దీని తర్వాత మూడు రోజులకు అంటే ఆదివారం నాడు ఏప్రిల్ 17వ తేదీన ‘ఈస్టర్' పండుగను జరుపుకుంటారు.

ఏప్రిల్ 12, 26న
ఈ నెలలో రెండు ఏకాదశి ఉపవాసాలు ఏప్రిల్ 12వ తేదీ మంగళవారం మరియు ఏప్రిల్ 26వ తేదీన మంగళవారం నాడే వచ్చాయి. ఏప్రిల్ 12న ఒక ఏకాదశిని కామద ఏకాదశి, ఏప్రిల్ 26న మరో ఏకాదశిని వరుదిని ఏకాదశిగా జరుపుకుంటారు. ఈ ఏకాదశులను ఉత్తమమైనవిగా పరిగణిస్తారు. ఈ పవిత్రమైన రోజున ఉపవాసం ఉండటం వల్ల కోరిక కోరికలన్నీ నెరవేరుతాయని చాలా మంది నమ్ముతారు. ఈ పవిత్రమైన రోజుల్లో శ్రీ మహా విష్ణువును ఎంతో భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారు.
ఉగాది పండుగ తర్వాత సరిగ్గా తొమ్మిది రోజుల తర్వాత, అంటే నవమి రోజున శ్రీరామ నవమి పండుగను జరుపుకుంటారు. ఈ పవిత్రమైన రోజునే శ్రీరాముడు జన్మించాడని చాలా మంది నమ్ముతారు. 2022 సంవత్సరంలో ఏప్రిల్ 10వ తేదీన శ్రీరాముని జయంతి రోజున జరుపుకోనున్నారు.
తెలుగు వారి తొలి సంవత్సరంలో వచ్చే తొలి పౌర్ణమి అంటే ఛైత్ర పౌర్ణమి తిథి రోజున హనుమాన్ జయంతిని జరుపుకుంటారు. 2022 సంవత్సరంలో ఏప్రిల్ 16వ తేదీన హనుమాన్ జయంతిని జరుపుకోనున్నారు. ఈ పవిత్రమైన రోజున చాలా మంది హిందువులు ఉపవాసం ఉంటారు. తాము ఏదైనా ముఖ్యమైన పని ప్రారంభించినప్పుడు, ఆ పని విజయవంతంగా పూర్తవడంతో హనుమంతుడి ఆశీర్వాదం లభిస్తుందని చాలా మంది నమ్ముతారు. అలాగే కొన్ని చోట్ల కార్తీక మాసంలో కూడా హనుమాన్ జయంతిని జరుపుకుంటారు.



Click it and Unblock the Notifications