Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
వాస్తు ప్రకారం పగిలిన అద్దం ఇంట్లో ఉంచుకుంటే.. మీ జీవితం సర్వనాశనమే! ఎన్ని సమస్యలు వస్తాయో తెలుసా?
ప్రతి ఇంట్లో అద్దం అనేది సాధారణంగా ఉంటుంది. చిన్నదో పెద్దదో ఒక అద్దం అయితే కచ్చితంగా ఉంటుంది. కానీ కొన్నికొన్ని సార్లు అనుకోని సందర్భాల్లో ఆ అద్దం అనేది పగిలిపోతుంటుంది. అద్దం పగిలిపోయిన అలానే వినియోగిస్తుంటారు చాలా మంది. కొందరైతే పగిలిన అద్దం మంచిది కాదని పారేస్తుంటారు. కానీ మన పెద్దలు మాత్రం పగిలిన అద్దంలో ముఖం చూసుకోకూడదని, చూసుకుంటే ఎన్నో ప్రమాదాలు, అపశకునాలు జరుగుతాయని పేర్కొంటుంటారు. కానీ నేటి కాలంలో అదంతా మూఢ నమ్మకమని, పగిలిన అద్దంలో ముఖం చూసుకుంటే ఏమవువుతుంది? అద్దం దేనికి సంకేతం అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
లక్ష్మీ దేవి..
ప్రాచీన కాలంలో అద్దాన్ని లక్ష్మీ దేవితో పోల్చారు. ఎందుకంటే అద్దం ప్రతిబింబం చూపిస్తే, లక్ష్మీదేవి కూడా మీ ఇంట్లో కదిలిపోతూ ఉంటుంది. కానీ అద్దం పగిలితే, లక్ష్మీ దేవి కూడా ముక్కలవుతుందని నమ్మకం ఉంది. ఇది మీ ఇంట్లో ఉన్న సంపద, శాంతి, ఆనందం అన్నింటినీ కోల్పోతున్నారనే సంకేతంగా భావించబడుతుంది. అద్దం పగిలితే, ఇంట్లో కష్టాలు తప్పవు, శాంతి ఉండదు, ఇంకా అనేక సమస్యలు ఏర్పడతాయని పురాణాలలో చెప్పబడింది. మన పెద్దలు, పూర్వికులు కూడా అద్దాన్ని దేవతాస్వరూపంగా కొలుస్తుంటారు.

ఇదే కాక, కొన్ని జ్యోతిష్యశాస్త్ర గ్రంథాలు చెప్పడం ప్రకారం, అద్దం పగిలినప్పుడు ఇంటికి రాబోయే శక్తులు కూడా వెనక్కి వెళ్లిపోతాయి. అలాగే, అద్దం సరైన దిశలో ఉంచడం కూడా చాలా ముఖ్యమైనది. అద్దం ఇంటి ముందుగా ఉండటం, దానిలో ప్రతిబింబాలు ప్రకాశించే విధానం కూడా ఇంటి శక్తి మీద ప్రభావం చూపిస్తుంది. కొందరు ఇంటిలో అద్దం నేరుగా తల మీద ఉంచితే, అది విపరీతమైన ఫలితాలను ఇవ్వదని విశ్వసిస్తారు.
మరణానికి సూచిక..
అయితే, పురాణాలలో పగిలిన అద్దంలో ముఖం చూసినట్లయితే అది మరణాన్ని సూచిస్తుందని కూడా చెప్తారు. పగిలిన అద్దంలో ముఖం చూసుకున్నట్లైతే ఆ పగిలిన అద్దం మాదిరిగా మనిషి ప్రాణం కూడా ముక్కలవుతుందని విశ్వసిస్తుంటారు. అట్లాంటి విశ్వాసాలు అనేక మందిని ఇబ్బందికి గురి చేస్తున్నాయి. అందువల్ల, పగిలిన అద్దాన్ని వెంటనే మార్చి, ఇంట్లో ఉంచకూడదు అని నిపుణులు సూచిస్తున్నారు.
పూజ సమయంలో నో..
అద్దం ఉన్నప్పటికీ దానిని ఎప్పుడుపడితే ఎప్పుడు వినియోగించుకోవడానికి ఉండదు. పూజ సమయంలో అద్దాన్ని అస్సలు వినియోగించుకోకూడదు. పూజలు చేస్తున్న సమయంలో పగిలిన అడ్డం ఇంట్లో ఉంటే.. ఆ పూజలు ఫలించవని చెబుతుంటారు. దేవతల అనుగ్రహం సైతం లభించదని పేర్కొంటుంటారు. ముఖ్యంగా ఆ అద్దంలో ముఖాన్ని చూసుకున్నట్లైతే చాలా ప్రమాదకరమైన ఫలితాలు వస్తాయని చెబుతుంటారు. అందుకే అద్దం శుభ్రంగా, పకడ్బందీగా ఉండటం అవసరం.
ఇకపోతే, అద్దం పగిలినప్పుడు అద్భుతమైన శక్తిని ఆహ్వానించే వాస్తు సిద్ధాంతాలు కూడా ఉన్నాయి. అద్దం పగిలిపోవడం వల్ల ఇంటిలో అదృష్టం, సమృద్ధి, ఆనందం తగ్గిపోతుందని వారు విశ్వసిస్తారు. అలాగే, పగిలిన అద్దంలో ముఖం చూసే ప్రక్రియను తీవ్రంగా తప్పుగా భావించి, ఆరోగ్య సమస్యలు వస్తాయని కూడా జ్యోతిష్యశాస్త్రులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి, ఎప్పుడు కూడా పగిలిన అద్దాన్ని వీలు పడితే మార్చేసి, ఇంటిలో శుభం, శాంతి, సంపద పెరుగుతుంది.



Click it and Unblock the Notifications