For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Ashada Amavasya 2022: ఈ ఏడాది ఆషాఢ అమవాస్య ప్రత్యేకతలేంటో తెలుసుకోండి...

ఆషాఢ మాసం ఆచారాలు, ప్రాముఖ్యత గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

|

హిందూ మతం ప్రకారం, ప్రతి ఒక్క నెలకు ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. హిందూ క్యాలెండర్ ప్రకారం ఇప్పటికే మూడు నెలలు ముగిశాయి. మరికొన్ని గంటల్లో మనం ఆషాఢ మాసంలోకి అడుగుపెట్టబోతున్నాం. ఈ ఆషాఢ మాసానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది.

Ashadha Amavasya 2022 date, time, muhurta, rituals and significance in Telugu

ముఖ్యంగా ఆషాఢ అమావాస్య తేదీని చాలా ప్రత్యేకంగా పరిగణిస్తారు. ఆషాఢ మాసంలో వచ్చే అమావాస్య ఆషాధి అమావస్య అని కూడా అంటారు. వ్యవసాయం చేసే ప్రజలకు ఈరోజు చాలా ముఖ్యమైన రోజు. ఈ పవిత్రమైన రోజున రైతులు తమ పొలాలు పచ్చగా ఉండాలని దేవుళ్లకు ప్రత్యేక పూజలు చేస్తారు. ఈ సందర్భంగా 2022 సంవత్సరంలో ఆషాఢ అమావాస్య ఎప్పుడొచ్చింది? అమావాస్య శుభ ముహుర్తం, సమయం, ఆరాధన పద్ధతుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం...

ఆషాఢ అమావాస్య ఎప్పుడంటే..

ఆషాఢ అమావాస్య ఎప్పుడంటే..

హిందూ క్యాలెండర్ ప్రకారం, ఆషాఢ మాసం నాలుగో నెల. ఛైత్ర, వైశాఖ, జ్యేష్ట మాసం తర్వాత ఆషాఢం వస్తుంది. 2022 సంవత్సరంలో ఆషాఢం అమావాస్య జూన్ 28వ తేదీ నుండి జూన్ 29వ తేదీ బుధవారం వరకు ఉంటుంది. అందుకే అమావాస్య ప్రారంభ తిథిని 29వ తేదీగా పరిగణిస్తారు.

అమావాస్య ప్రారంభ తిథి : జూన్ 28న మంగళవారం ఉదయం 5:52 గంటలకు

అమావాస్య తిథి ముగింపు : జూన్ 29న బుధవారం ఉదయం 8:21 గంటలకు

బుధవారం రోజున ఉపవాసం ఉండాలి.

చేయాల్సిన పనులు..

చేయాల్సిన పనులు..

* ఆషాఢ అమావాస్య రోజున ఉదయాన్నే నిద్ర లేవాలి

* ఈరోజున బ్రహ్మ ముహుర్త సమయంలో పవిత్ర నదిలో లేదా ప్రవహించే నీటిలో స్నానం చేయాలి. అయితే ఇప్పుడు కరోనా కారణంగా అలాంటి పరిస్థితి లేకపోతే.. నదిలోని నీటిని బాటిల్ లో నింపుకుని వాటిని మీ ఇంట్లో స్నానం చేసే పాత్రలో వేసుకుని స్నానం చేయండి.

* సూర్యోదయం సమయంలో సూర్యభగవానుడికి నీరు అర్పించండి.

* ఈరోజున మీ పూర్వీకులను స్మరించుకోవాలి. పితృ ఆరాధన చేయాలి.

* వారి ఆత్మ శాంతి కోసం ఈరోజున ఉపవాసం ఉండాలి.

* నిరుపేదలకు విరాళాలు ఇవ్వండి (మీ సామర్థ్యం మేరకు)

* బ్రహ్మాణులకు ఆహారాన్ని అందించాలి.

ఆషాఢం ప్రాముఖ్యత..

ఆషాఢం ప్రాముఖ్యత..

ఈ అమావాస్య గురంచి చాలా గ్రంథాలలో వివరించబడింది. ఈరోజున చాలా మంది శుభకార్యాలను చేయడాన్ని వాయిదా వేస్తారు. ఈ పవిత్రమైన రోజున పూర్వీకులను తలచుకుని, నది స్నానం చేసి దానం చేయడం వల్ల మంచి ఫలితాలు వస్తాయని చాలా మంది నమ్ముతారు. ఇలా చేయడం వల్లే పితృ దోషాల నుండి కూడా విముక్తి లభిస్తుందని భావిస్తారు. అందుకే ఈ రోజున పితృ కర్మకు చాలా పవిత్రంగా భావిస్తారు. ఈ పవిత్రమైన రోజున పితృవులకు తర్పణం చేయడం వల్ల పూర్వీకుల నుండి ఆశీస్సులు లభిస్తాయని నమ్ముతారు.

ఇలా చేయండి..

ఇలా చేయండి..

ఈ పవిత్రమైన రోజున వెండితో చేసిన సర్పానికి ప్రత్యేక పూజలు చేయాలి. ఆషాఢ అమావాస్య రోజున ఎవరైనా పేద వ్యక్తికి మీ సామర్థ్యం మేరకు విరాళం ఇవ్వండి. అదే విధంగా ఈరోజున ఉదయాన్నే రావి చెట్టుకు నీరు అర్పించి, సాయంకాలం వేళ దీపాన్ని వెలిగించాలి. అలాగే అవసరమైన వారికి ఆహారాన్ని అందించాలి. చీమలకు పంచదార కలిపిన పిండిని, చేపలకు పిండి బాల్స్ ను ఆహారంగా ఇస్తే శుభ ఫలితాలను పొందుతారు.

దక్షిణయానం ప్రారంభం..

దక్షిణయానం ప్రారంభం..

ఆషాఢ మాసంలోనే సూర్యుడు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. ఇలా ప్రవేశించే సమయాన్ని దక్షిణయానం అంటారు. ఈ దక్షిణ యాణం తిరిగి మకర రాశిలోకి వెళ్లే వరకు సుమారు ఆరు నెలల సమయం పడుతుంది. భూమధ్యరేఖకు దక్షిణంగా సూర్యగమనం ఉండటం వల్ల ఈ కాలం పితృకర్మలకు ప్రీతికరం. అంతేకాదు ఆషాఢ అమావాస్య సమయంలో తెలంగాణ బోనాలు, పూరీలోని జగన్నాథుని రథయాత్ర నిర్వహిస్తారు.

బోనాల పండుగ..

బోనాల పండుగ..

తెలంగాణ ప్రజలు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకునే బోనాలు ఈ ఏడాది జూన్ 30వ తేదీ గురువారం నుండి ప్రారంభం కానున్నాయి. నెలరోజుల పాటు అంగరంగవైభవంగా సాగనున్నాయి. ప్రతి సంవత్సరం ఆషాఢ మాసం అమావాస్య తర్వాత వచ్చే గురువారం లేదా ఆదివారం రోజున బోనాలు ప్రారంభిస్తారు. ఈ బోనాలు చారిత్రక గోల్కోండ కోటలోని శ్రీ జగదాంబిక(ఎల్లమ్మ) ఆలయంలో తొలి పూజ జరిగిన తర్వాతే రాష్ట్రవ్యాప్తంగా బోనాలు ప్రారంభమవుతాయి.

English summary

Ashadha Amavasya 2022 date, time, muhurta, rituals and significance in Telugu

Here we are talking about the ashada amavasya 2022 date, muhurat timing, rituals and significance in Telugu. Read on
Story first published:Monday, June 27, 2022, 12:40 [IST]
Desktop Bottom Promotion