For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఎలాంటి కష్టాలైనా తొలగిపోయేందుకు అక్షయ త్రితీయ రోజున పఠించాల్సి అష్టలక్ష్మీ స్త్రోత్రం..!

By Lekhaka
|

భక్తాభీష్ట ప్రదాయిని, ధర్మసంవర్ధిని అయిన జగన్మాత శ్రీమహాలక్ష్మి అష్టలక్ష్మీ రూపాల్లో ఈ జగత్తుని పరిపాలిస్తోంది. విష్ణుమూర్తి ధరించిన మత్స్య, కూర్మ, వరాహ, నరసింహ, వామన, పరుశురామ, రామ, కృష్ణ, బుద్ధ, కల్క్యావతారాలు ఏ రకంగా జగత్కల్యాణానికి ఉద్దేశింపబడ్డాయో, అలాగే విష్ణువు పత్నియైన లక్ష్మీదేవి అవతారాలు కూడా జగత్కల్యాణ కారకాలే. స్థితి కార్య నిర్వహణలో లక్ష్మీనారాయణులు ఇరువురూ సమాన బాధ్యతలని వహిస్తారు. ధర్మ సంరక్షణ, సమాజ సంక్షేమం కోసం దుష్టశిక్షణ చేసి శిష్టరక్షణ చేశాడు నారాయణుడు. సమాజం వ్యక్తుల సమూహం కాబట్టి ఆయా వ్యక్తుల సంరక్షణకోసం, అభివృద్ధి కోసం, ఉన్నతి కోసం లక్ష్మీదేవి అష్టలక్ష్మీ రూపధారణ చేసింది.

ఒక మాతృమూర్తి తన కన్నా బిడ్డలని సరైనమార్గంలో పెంచటం కోసం రోజూ ఎన్నో రకాల అవతారాలను ఎత్తుతుంది. వాత్సల్యపూరితంగా అనునయిస్తునే తప్పు చేస్తే దండిస్తుంది. మనకి విద్యాబుద్ధులు నేర్పిన ప్రథమగురువు అయిన ఆ తల్లే అవసరమైప్పుడు ధైర్యాన్ని నూరిపోసి వీరత్వాన్ని వృద్ధి చేస్తుంది. ముఖ్యంగా ధర్మచింతన, యుక్తాయుక్త విచక్షణా జ్ఞానం, కరుణ, జాలి, వివేకం ఇవన్నీ ఆ అమ్మ పెట్టిన భిక్షలే. ఒక సాధారణ మాతృమూర్తే తన పిల్లల కోసం ఇంత కష్టపడుతూవుంటే, ఆ జగన్మాత లక్ష్మీదేవి సంగతి చెప్పాలా, అనేక కోట్ల జీవరాశులలో ఎవరికి ఏ కష్టం వచ్చినా అందరూ ఆ తల్లినే తలుచుకుంటారు. అందరికీ అన్ని రకాల శక్తులను అందించటం కోసం ఈ అష్టలక్ష్మీ రూపాలను ఎంచుకుంది ఆ తల్లి. అన్ని శక్తులను ఒకే రూపంలో యివ్వొచ్చుకదా.

 Ashtalakshmi Stotra To Chant On Akshaya Tritiya

శ్రీ మహాలక్ష్మీదేవి అష్టలక్ష్మీ రూపాల్లో జగత్తుకి సమస్త రకాలయిన శక్తుల్ని, పరిపుష్టిని ప్రసాదిస్తోంది. ప్రాణులకు మూలాధారమైన శక్తిప్రాణశక్తి. ఆ శక్తిని ప్రసాదించే తల్లి ఆదిలక్ష్మీదేవి. శారీరక, మానసిక ఆరోగ్యాలు పరిపూర్ణంగా వుండాలంటే ఆదిలక్ష్మీదేవి అనుగ్రహం వుండాలి. పుట్టిన బిడ్డకి స్తన్యాన్ని అందించి ఆకలి తీర్చి తన పొత్తిళ్ళలో పెట్టుకుని కాపాడేది మన మాతృమూర్తి. అలాగే మనకి అవసరమైన ఆహారాన్ని సమకూర్చేది ధాన్యలక్ష్మీదేవి. సమస్త రకాలైన ధాన్య సంపదని, పాడిపంటలనీ ప్రసాదించే ఈ తల్లి అనుగ్రహం వల్ల శరీరానికి ధారుఢ్యం, బలం చేకూరుతాయి. శరీర వృద్ధికి ఈ తల్లి అనుగ్రహం అవసరం. కార్యం సాధించాలంటే కేవలం శారీరక బలం చాలదు. దైర్యసాహసాలు, మనోబలం కావలి. వీటిని ప్రసాదించే ధైర్యలక్ష్మీదేవి.

అవసరమైన సామయమ్లో ధైర్యం ప్రసాదించి మనల్ని కార్యసాధకులని చేస్తుంది ఆ తల్లి. సకల శుభకారిణి గజలక్ష్మీదేవి. మనం సాధించిన విజయం శుభకారిణి అయ్యేలా అనుగ్రహిస్తుంది. శుభం అంటే మనకి మాత్రమే మంచిదని కాదు. సమాజహితానికి కారణభూతమయ్యేది, మన విజయం వల్ల అందరూ సుఖపడాలి అదే నిజమైన శుభం.

అష్ట లక్ష్మీ రూపాల్లో ఆది లక్ష్మీ,ధాన్య లక్ష్మీ, ధైర్య లక్ష్మీ, గజలక్ష్మీ, సంతాన లక్ష్మీ, విజయ లక్ష్మీ, విద్యా లక్ష్మీ ధన లక్ష్మీ. ఈ అన్ని రూపాలు కలిసిన దేవతే మహాలక్ష్మీ మహాలక్ష్మీని పూజిస్తే చాలు ఆయురారోగ్యాలతో, సిరిసంపదలు పొందేలా ఆ తల్లి చల్లని దీవెనలు అందిస్తుంది.

 Ashtalakshmi Stotra To Chant On Akshaya Tritiya

పూజగదిలో అష్టలక్ష్మీ స్త్రోత్రాలున్నప్పుడు ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీని పొందుతారు. అలాగే శ్రీ యంత్రం కూడా మహాలక్ష్మీ రూపమే. పూజగదిలో శ్రీయంత్రం ప్రతిష్ట చేసుకోవడం వల్ల మరియు అష్టలక్ష్మీ స్త్రోతంను ఉంచడం వల్ల మీరు అనుకుపనులన్నింటిలోనూ సక్సెస్ పొందుతారు .

అష్టలక్ష్మీ స్త్రోత్రం మరియు శ్రీయంత్రం రెండింటిని ఓకే చోట ఉంచడం వల్ల ఇంట్లో అన్ని మంచే జరగుతుంది. ఆర్థికరంగా ఎలాంటి ఇబ్బందులు ఉండదు. ఆరోగ్యం బాగుంటుంది. ఇంటిల్లిపాది సంతోషంతో జీవిస్తారు. అక్షయ త్రితీయ రోజున శ్రీ యంత్ర ప్రతిష్టించడం చాలా మంచిది

అక్షయ త్రితీయ రోజున అష్టలక్ష్మీ స్త్రోత్రం పఠించడానికి కొన్ని నియమాలున్నాయి. ఈ నియమాలను పాఠించడం చాలా ముఖ్యం.

అక్షయ త్రితీయ రోజున అష్టలక్ష్మీ స్త్రోత్రం పఠించడానికి పాటించాల్సిన నియమాలు.

అక్షయ త్రితీయ రోజున అష్టలక్ష్మీ స్త్రోత్రం పఠించడానికి ముందు ఈ నియమాలను ఖచ్చితంగా అనుసరించాలి.అష్టలక్ష్మీని ప్రతిష్టించే ప్రదేశం లేదా పూజగదిని గంగా జలంతో శుద్ది చేయాలి.

తర్వాత లక్ష్మీ దేవి విగ్రహం లేదా ఫోటోను నార్త్ ఈస్ట్ కార్నర్ లో ఉంచాలి. అలాగే శ్రీ యంత్రం కూడా ఉంచాలి. అష్టలక్ష్మీ స్త్రోత్రం పటించేటప్పుడు రెండింటిని పూజించాలి.

లక్ష్మీ ఫోటలకు లేదా విగ్రహాలతో పాటు, శ్రీచక్రంకు పసుపు కుంకుమ, పువ్వులు సమర్పించాలి. అలాగే లక్ష్మీ దేవి ఫోటో ముందు దీపాలు వెలిగించాలి. అగవత్తులు, హారతి స్వీట్ డిష్ ను ప్రసాధంగా పెట్టాలి. పాలతో తయారుచేసిన కీర్ ను లక్ష్మీ దేవికి సమర్పించి తర్వాత అష్టలక్ష్మీ స్త్రోత్ర పఠనం చేయాలి. అష్టలక్ష్మీ స్త్రోత్రం ఈ క్రింది విధంగా..

ఆదిలక్ష్మి

ఆదిలక్ష్మి

సుమనస వందిత సుందరి మాధవి, చంద్ర సహొదరి హేమమయే

మునిగణ వందిత మోక్షప్రదాయని, మంజుల భాషిణి వేదమతే

పంకజవాసిని దేవ సుపూజిత, సద్గుణ వర్షిణి శాంతియుతే

జయ జయహే మధుసూదన కామిని, ఆదిలక్ష్మి పరి పాలయమామ్.

ధాన్యలక్ష్మి

ధాన్యలక్ష్మి

ఆయికలి కల్మష నాశిని కామిని, వైదిక రూపిణి వేదమయే

క్షీర సముద్భవ మంగళ రూపిణి, మంత్రనివాసిని మంత్రనుతే

మంగళదాయిని అంబుజవాసిని, దేవగణాశ్రిత పాదయుతే

జయ జయహే మధుసూదన కామిని, ధాన్యలక్ష్మి పరిపాలయమామ్ .

ధైర్యలక్ష్మి

ధైర్యలక్ష్మి

జయవరవర్షిణి వైష్ణవి భార్గవి, మంత్ర స్వరూపిణి మంత్రమయే

సురగణ పూజిత శీఘ్ర ఫలప్రద, ఙ్ఞాన వికాసిని శాస్త్రనుతే

భవభయహారిణి పాపవిమోచని, సాధు జనాశ్రిత పాదయుతే

జయ జయహే మధు సూధన కామిని, ధైర్యలక్ష్మీ పరి పాలయమామ్.

గజలక్ష్మి

గజలక్ష్మి

జయ జయ దుర్గతి నాశిని కామిని, సర్వ ఫలప్రద శాస్త్రమయే

రధగజ తురగ పదాతి సమావృత, పరిజన మండిత లోకనుతే

హరిహర బ్రహ్మ సుపూజిత సేవిత, తాప నివారిణి పాదయుతే

జయ జయహే మధుసూదన కామిని, గజలక్ష్మీ రూపేణ పాలయమామ్.

సంతానలక్ష్మి

సంతానలక్ష్మి

అయిగజ వాహిని మోహిని చక్రణి, రాగవివర్ధిని ఙ్ఞానమయే

గుణగణ వారిధి లోక హితైషిణి, సప్తస్వర భూషిత గాన నుతే

సకల సురాసుర దేవ మునీశ్వర, మానవ వందిత పాదయుగే

జయ జయహే మధుసూదన కామిని, సంతానలక్ష్మీ పరిపాలయమామ్.

విజయలక్ష్మి

విజయలక్ష్మి

జయ కమలాసిని సద్గతి దాయిని, ఙ్ఞాన వికాసని గానమయే

అనుదిన మర్చిత కుంకుమ ధూసర, భూషిత వాసిత వాద్యనుతే

కనకధరాస్తుతి వైభవ వందిత, శంకర దేశిక మాన్యపదే

జయ జయహే మధుసూదన కామిని, విజయలక్ష్మీ పరిపాలయమామ్.

విద్యాలక్ష్మి

విద్యాలక్ష్మి

ప్రణత సురేశ్వరి భారత భార్గవి, శోక వినాశిని రత్నమయే

మణిమయ భూషిత కర్ణ విభూషణ, శాంతి సమావృత హాస్యముఖే

నవనిధి దాయిని కలిమలహారిణి, కామిత ఫలప్రద హాస్యయుతే

జయ జయహే మధుసూదన కామిని, విద్యాలక్ష్మీ పరిపాలయమామ్.

ధనలక్ష్మి

ధనలక్ష్మి

ధిమి ధిమి ధింధిమి ధింధిమి, దుంధుభి నాద సుపూర్ణమయే

ఘుమఘుమ ఘుంఘుమ ఘుంఘుమ ఘుంఘుమ, శంఖ నినాద సువాద్యమతే

వేద పూరాణేతిహాస సుపూజిత, వైదిక మార్గ ప్రదర్శయుతే

జయ జయహే మధుసూదన కామిని, ధనలక్ష్మి రూపేణా పాలయమామ్.

ఫలశృతి

ఫలశృతి

అష్టలక్ష్మీ నమస్తుభ్యం వరదే కామరూపిణి

విష్ణువక్షః స్థలా రూఢే భక్త మోక్ష ప్రదాయిని

శంఖ చక్రగదాయక్తే విశ్వరూపిణితే జయః

జగన్మాత్రే చ మోహిన్యై మంగళం శుభ మంగళమ్.

English summary

Ashtalakshmi Stotra To Chant On Akshaya Tritiya

Ashtalakshmi, or 8 forms of goddess Lakshmi, is prayed to on Akshaya Tritiya. Read to know the Ashtalakshmi stotra and its significance.
Story first published: Friday, April 28, 2017, 8:00 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more