For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వినాయక చవితి నాడు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం పాటించవలసిన చిట్కాలు

వినాయక చవితి నాడు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం పాటించవలసిన చిట్కాలు

|

వినాయకుని పరిపూర్ణత స్వరూపంగా భక్తులు కొలుస్తారు. గణపతి, గణరాజ్, వినాయకుడు, విఘ్ననాయకుడు, విఘ్నేశ్వరుడు, గజాననుడు, గణేషుడు వంటి అనేక ఇతర పేర్లతో కూడా వినాయకుని పిలుస్తారు. అత్యంత ప్రసిద్ది చెందిన హిందూ దేవుళ్లలో వినాయకుడు కూడా ఒకనిగా ఉన్నాడు. ఏ పూజ అయినా యజ్ఞయాగాదులు అయినా, ఎటువంటి కార్యక్రమాలైనా వినాయకుని పూజ లేనిదే మొదలవదు అన్నది జగమెరిగిన సత్యం. వినాయకునికి ఆదిదేవునిగా వరం ఉంది. క్రమంగా ఏ దేవుని పూజించాలన్నా కూడా, వినాయకునితోనే ప్రారంభించవలసి ఉంటుంది.

బుద్ది(జ్ఞానం), రిద్ధి(ఆద్యాత్మికత), సిద్ధి(శ్రేయస్సు) అను మూడు అంశాలకు అధిపతిగా వినాయకుని కీర్తించడం జరుగుతుంది. వినాయకుడు జ్ఞానానికి ప్రతీకగా ఉండగా, రిద్ధి మరియు సిద్ధి అతని భార్యలుగా ఉన్నారని చెప్పబడింది.

Simple Astro Tips On Ganesha Chaturthi For A Happy Life

వినాయకుని అన్ని అడ్డంకులను తొలగించే దేవాది దేవునిగా కూడా భక్తులు విశ్వసిస్తారు. క్రమంగా విఘ్నేశ్వరుడన్న పేరు సార్ధకమైంది. భాద్రపద మాసంలో శుక్లపక్షాన నాల్గవరోజైన చవితినాడు వినాయకుని జన్మదినంగా భావించి, వినాయక చవితి జరుపబడుతుంది. ఈ రోజును గణేష్ చతుర్థిగా లేదా వినాయక చవితిగా కూడా పిలుస్తారు ఇది ఈ సంవత్సరం హిందూ కాలెండర్ ప్రకారం, సెప్టెంబర్ 13, 2018 న జరుపబడుతుంది.

వినాయక చవితినాడు, జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం దిశగా, జ్యోతిష్య శాస్త్ర పండితులు కొన్ని చిట్కాలను సూచిస్తున్నారు. అవేమిటో తెలుసుకుందాం.

ఏదైనా కోరిక నెరవేర్చడానికి :

ఏదైనా కోరిక నెరవేర్చడానికి :

శివుని కుమారుడు వినాయకుడు, క్రమంగా శివుని పోలిన లక్షణాలను ప్రస్పుటించేలా ఉంటాడని భక్తుల విశ్వాసం. ఆ ప్రకారం పరమేశ్వరుని వలెనే, తన భక్తుల కోరికలను విఘ్నేశ్వరుడు కూడా నెరవేరుస్తాడని చెప్పబడింది. వినాయకునికి సింధూరం(వెర్మిలియన్) సమర్పించడం ద్వారా, భక్తుల మీద కరుణా కటాక్షాలను కలిగి, కోరిన కోర్కెలను తీరుస్తాడని నమ్మబడినది. వినాయకునికి సిందూరాన్ని సమర్పించే క్రమంలో భాగంగా చదవాల్సిన మంత్రం -ఓం గం గణపతియే నమః .

మంచి అభ్యాసం(చదువు) కోసం :

మంచి అభ్యాసం(చదువు) కోసం :

సరస్వతిదేవి వలెనే, గణేశుని కూడా చదువు, జ్ఞానం, బుద్దికి ప్రభువు అని చెప్పబడింది. మహాభారతాన్ని రచించినప్పుడు వేద వ్యాసుడు చెప్తుండగా వినాయకుడు, రచించాడని పురాణాలు సూచిస్తున్నాయి. వినాయకుని పూజించడం వలన విద్యార్థుల అభ్యాసాలలో సహాయం చేయడమే కాకుండా, వారి జ్ఞానాన్ని పెంపొందించడంలో వినాయకుడు ఎంతగానో దోహదం చేస్తాడని చెప్పబడింది. విద్యార్ధులు అభ్యాసాలలో రాణించుటకు, శమీచెట్టు ఆకులను వినాయకునికి సమర్పించవలసినదిగా చెప్పబడింది. అలా శమీచెట్టు ఆకులను సమర్పించే క్రమంలో పఠించవలసిన మంత్రం - ఓం మంగల్ మూర్తయే నమః. అదేక్రమంలో భాగంగా వినాయకునికి ఇష్టమైన దర్భలను ప్రతిరోజూ 11 సమర్పించడం ద్వారా కూడా అద్భుతమైన ఫలితాలను పొందగలరని చెప్పబడింది.

ఆర్ధిక లాభానికై :

ఆర్ధిక లాభానికై :

ఈ పదిరోజులలో మీరు వినాయకునికి నైవేద్యంగా బెల్లం మరియు నెయ్యిని అందించవలసి ఉంటుంది. తర్వాత ఈ నైవేద్యాన్ని ఆవుకు సమర్పించడం మంచిదిగా సూచించబడింది.. ఈ నెయ్యి మరియు బెల్లాన్ని ప్రసాదంగా ప్రజలకు పంపిణీ చేయరాదని గుర్తుంచుకోండి. ఈ విధంగా చేయడం ద్వారా మీ సమస్యలకు పరిహారం లభించడమే కాకుండా, వినాయకుని ఆశీర్వాదాలను కూడా పొందవచ్చని చెప్పబడింది. ఇతర బుధవారాలలో కూడా ఈ పద్దతిని అనుసరించవచ్చు.

మానసిక ప్రశాంతత మరియు కుటుంబ కలహాలను నివారించడంలో :

మానసిక ప్రశాంతత మరియు కుటుంబ కలహాలను నివారించడంలో :

ఒక వక్కను తీసుకొని బుధవారం నాడు మీ పూజ గదిలో ఉంచండి. దీని చుట్టూ ఒక మోలీ (పవిత్రమైన రెడ్ థ్రెడ్) కట్టి, రోజువారీ ప్రార్ధనలలో భాగంగా ప్రతిరోజు పూజించాలి. తదుపరి బుధవారం దీనిని పారే నీటిలో నిమజ్జనం చేసి, కొత్త వక్కతో మార్పిడి చేయవలసినదిగా సూచించడమైనది.

వృత్తిపరమైన అంశాలలో ఎదుగుదల కోసం :

వృత్తిపరమైన అంశాలలో ఎదుగుదల కోసం :

ఉద్యోగం మరియు వృత్తి సంబంధించిన సమస్యలను ఎదుర్కొంటున్న వ్యక్తులు; మరియు ఎంత కృషి చేసినా, ఉద్యోగం పొందనివారు, దుర్వా (గడ్డి రకం) ను వినాయకునికి సమర్పించవలసి ఉంటుంది. కడుపు సంబంధిత సమస్యలు (మధుమేహం, పూతలు, రక్తహీనత మొదలైనవి) మరియు మానసిక రుగ్మతలను నయం చేయటానికి సహాయపడడంలో, దుర్వా అద్భుతంగా పనిచేస్తుంది. ఈ దుర్వాని సమర్పించే క్రమంలో ఉచ్చరించాల్సిన మంత్రం - ఓం గమ్ గణపతయే మామ్ ఇక్షిత్ కర్యాయే కురు కురు నమః.

వినాయకుడు అన్ని రకాల సమస్యలకు విరుగుడు వంటి వాడు. ఏరూపంలో కొలిచినా, ఆర్ధిక స్థితిగతులను అనుసరించి ఎటువంటి నైవేద్యం పెట్టినా భక్తులందరినీ సమానంగా ఆదరిస్తాడని చెప్పబడింది.

అంతేకాకుండా, ఇంటిలో పూజించబడే వినాయక విగ్రహంలో ఎట్టిపరిస్థితుల్లో రసాయనాల వాడకం జరగలేదని నిర్ధారించుకోవలసి ఉంటుంది. పండుగ కారణంగా కాలుష్య కోరలకు వాతావరణాన్ని గురిచేసి ఆ ప్రభావాన్ని భావితరానికి అందివ్వడం ఏ దేవుడు కూడా అంగీకరించని అంశంగా ఉంటుంది. కావున బంకమట్టి లేదా సాధారణ మట్టి వినాయకుని విగ్రహాన్ని పూజించడం మంచిదిగా సూచించబడుతుంది. మరియు కేవలం నదులు, చెరువులు, సముద్రాలలోనే కాకుండా, మట్టి విగ్రహాన్ని శుభ్రపరచిన లేదా కొత్త పాత్ర(లేదా బక్కెట్) లోనే నిమజ్జనం చేసి, ఆ నీళ్ళను చెట్లకు వినియోగించడం కూడా మంచిదిగా పండితులు సైతం సూచిస్తున్నారు. రేపటితరం కాలుష్యకోరలకు గురికాకుండా చూసుకోవలసిన భాద్యత మనమీదే ఉంటుందని మరవకూడదు. ఒకప్పుడు "ప్లాస్టర్ ఆఫ్ పారిస్" మరియు రసాయనాల వినియోగాలు లేవని మనకు కూడా తెలుసు. మారుతున్న కాలానుగుణంగా వచ్చిన కొత్తపోకడలు భవిష్యత్తును అంధకారం చేయకుండా, కాపాడవలసిన భాద్యతను ఇప్పటితరం తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆసక్తికర, ఆద్యాత్మిక, ఆహార, ఆరోగ్య, జీవన శైలి, వ్యాయామ, లైంగిక తదితర సంబంధిత విషయాల కోసం బోల్డ్స్కై పేజీని తరచూ సందర్శించండి. ఈ వ్యాసం పై మీ అభిప్రాయాలను, వ్యాఖ్యలను క్రింద వ్యాఖ్యల విభాగంలో తెలియజేయండి.

English summary

Simple Astro Tips On Ganesha Chaturthi For A Happy Life

Lord Ganesha is the embodiment of perfection. Also known as Ganpati, Ganraj, Vinayak and by many other names, he is one of the most popular Hindu deities. No puja or holy ritual is considered complete without invoking Ganesha in the beginning. Lord Ganesha was granted a boon according to which he would be worshipped first and before every other deity, in all the Hindu rituals. Read more at: https://www.boldsky.com/yoga-spirituality/faith-mysticism/2018/astrological-remedies-for-ten-days-chaturthi-festival-125554.html
Desktop Bottom Promotion