For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

జ్యోతిషశాస్త్ర ప్రకారం దీపావళి యొక్క ప్రాముఖ్యత, దీపావళి.. ఐదు రోజుల ఆనందకేళి

By Mallikarjuna
|

దీపం అంటే ప్రాణశక్తికి ప్రతీక. ఆనందానికి మరొక రూపం, కనిపించే దైవం, చీకటిని పారద్రోలి వెలుగు ఇచ్చే సాధనం, ఒక్క మాటలో పరబ్రహ్మ స్వరూపం. వెలిగించిన దీపం నిశ్చలంగా ప్రకాశిస్తుంటే అది, మనకు మన మనస్సుకు ప్రశాంతతను ఇస్తుంది. ఏకాగ్రతను కుదురుస్తుంది. దానితో మన పుణ్యబలం పెరుగుతుంది. (Festival of lights) అని మనం పిలుచుకునే ఈ పండుగ, అంటే అసత్యంపై సత్యం విజయం. మనం పెంచుకున్న పుణ్యం కాంతి అనుకుంటే, చేసిన పాపాలను చీకటి అనాలి. అప్పుడు దీపకాంతి ఆ చీకట్లనే పాపాలను తొలగిస్తుంది. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక ఈ పండుగ. చెడు రాశిపోసిన చీకటి అయితే, మనం చేసే మంచి అనంత కోటి ప్రభలతో వెలిగే అఖండ దీపాల వరుస దీపావళి.

Astrological significance of Diwali

దీపావళి ఐదు రోజుల పండుగ. ధనత్రయోదశి, నరక చతుర్దశి, దీపావళి అమావాస్య, బలి పాడ్యమి(గోవర్ధన పూజ), యమ ద్వితీయ (బాయ్ దూజ్) అని దీపావళి అయిదు రోజులలో జరుపుకుంటాం.దీపావళి లేదా దివాళీ అనేది సంస్కృత పదం. దియాస్ లేదా దీపం దేవతకు ప్రతి రూపం.

ధనత్రయోదశి: ఈరోజున లక్ష్మీదేవి మన ఇంటికి వస్తుంది అని విశ్వాసం.ధనత్రయోదశి: ఈరోజున లక్ష్మీదేవి మన ఇంటికి వస్తుంది అని విశ్వాసం.ఈ రోజున లక్ష్మీ కుబేర పూజ చాలా ప్రత్యేకం.

Astrological significance of Diwali

భారతీయ పండుగలలోకెళ్ల దీపావళి పండగ కూడా జ్యోతిషశాస్త్రంలో ప్రాముఖ్యత ఉంది. ఇది కొత్త చంద్రమాన సంవత్సరాన్ని సూచిస్తుంది. మరియు పంటల కాలం కూడా జరపుకుంటుంది. ఈ రోజున ఈ రోజున, గ్రహాల స్థానాలు చాలా అనుకూలమైనవి. అందువల్ల ఈ రోజు అందరికీ సంపదను, అద్రుష్టాన్ని, ఆరోగ్య సిరిసంపదలను ఆహ్వానించడానికి అనుకూలమైనదిగా నమ్ముతారు.

దీపావళి రోజున సూర్యుడు మరియు చంద్రుల కలయిక ఉంటుంది. అంటే, ఈ సమయంలో సామరస్యాన్ని ప్రోత్సహిస్తుంది. . ఈ లౌమినరీలు స్వాతీ నక్షత్రంలో తులా రాశిలో ఉండే నక్షత్రం. తుల అంటే సంతులిత స్థాయి. అందువల్ల ఈ పండుగ జరుపుకునే ప్రతి ఒక్కరి జీవితాల్లో ప్రేమ, సరిసంపదలు, సంతోషం, మంచి ఆరోగ్యం, మరియు ఆనందాలు మసతుల్యం చేయడానికి సహాయపడుతుంది.

Astrological significance of Diwali

నరక చతుర్దశి:జ్యోతిష్యం ప్రకారం ఈరోజు తుల రాశిలో సూర్యోదయం అవుతుంది. అప్పుడు మేష రాశికి సూర్యాస్తమయం. ఆ రాశిక అధిపతి కుజుడు. కు అంటే భూమి, జ అంటే పుట్టడం. కుజుడు అంటే భూమి కుమారుడు. ఈరోజులలో సూర్యచంద్రులు స్వాతీనక్షత్రంలో ఉంటారు. ఇది తులరాశిలో ఉండే నక్షత్రం. కృష్ణుడు (సూర్యుడు) సత్యభామ( చంద్రుడు) కలిసి కుజుడిని ఓడించి కన్యారాశికి (16వేల మంది కన్యలు) విడుదల కలిగించడమే నరక చతుర్దశి కథ.

దీపావళి సమయంలో స్వాతి నత్రధరా పరిపాలన మరియు స్త్రీలింగ్ కూటమి. ఈ కూటమి హిందూ పురాణాల ప్రకారం మా సరస్వతి దేవికి సంబంధించిన సంగీతం, విజ్ఞానం, వివేకం, కళలు మొదలైన వాటిని ప్రదర్శిస్తుంది. అందువల్ల ఈ నక్షత్రం సంతోషకరమైన సమయాన్ని నిర్ధారిస్తుంది.

చీకటి వెలుతురు
దుఃఖం సుఖం
దుర్గతి సద్గతి

మొదటి స్థితి నుండి రెండవ స్థితికి చేరేందుకు మనం చేసే ప్రయత్నమే దీప ప్రజ్వలనం. అహంకారం అజ్ఞానాలకు చీకటి సంకేతం. పాపాలకు ప్రతీకాత్మకం ఈ చీకటి. దీప ప్రకాశంతో పాపాలు తొలగిపోతాయి. తొలగిన పాపాలతో ఆత్మచైతన్యవంతమౌతుంది. చైతన్యం వికాసానికి సంకేతం.

Astrological significance of Diwali

ప్రతి సంవత్సరం దీపావళి అదే తిథిలో వస్తుంది, అంటే అశ్వయుజ అమావస్య. జోతిషశాస్త్ర ప్రకారం అశ్వయుజ అమావాస్య రోజున సూర్యుడు తులరాశిలో చంద్రుని యొక్క సంయోగం కచ్చితమైనది. తుల వ్యాపార మరియు వృత్తిపరమైన జీవితం మంచిది. కాబట్టి, ఈ రాశివారు కొత్తగా ఎదైనా మొదలు పెడితే మంచి జరుగుతుంది.ఆయుర్ఆరోగ్యాలు, సరిసంపదలు, శ్రేయస్సుని ఆహ్వానించడానికి దీపావళి రోజున సూర్యునికి, హానుమంతుడిని, గణేషని, లక్ష్మీ దేవిని పూజిస్తారు.
Astrological significance of Diwali

శ్రీకృష్ణుడు పురుషుడు, సత్యభామ ప్రకృతి. నరకుడు దుష్టగుణాలకు చిహ్నం. అగ్నిస్వరూపమైన దీపం జ్ఞాన సత్యనిర్మలతత్తాలకు సంకేతం. లోకం నియమానుసారం నడవాలి. లేకపోతే నరకమౌతుంది. మానవజీవితమంతా చీకటి వెలుగుల సంగ్రామం. అంతరంగంలో జరిగే మంచిచెడులు సంఘర్షణలో అప్రమత్యులై ఉండాలి. వివేకంతో అంతర్మథనంలో చోటుచేసుకున్న చీకటిని కూకటివేళ్ళతో పెకిలించాలి. అప్పుడే జీవితంలో ప్రతిరోజూ ఒక దివ్వెల దీపావళిగా వెలిగిపోతుంది. ఇదీ దీపావళి పండుగలోని అర్థం, అంతరార్థం. అర్థం తెలిసి ఆచరించిన దీపావళి మానవాళికి ఎప్పుడూ జ్ఞానామృతాన్ని అందించే తారావళి. శుభమస్తు.

English summary

Astrological significance of Diwali|Significance Of Five-Day Long Celebration During Diwali

Astrological significance of Diwali|Significance Of Five-Day Long Celebration During Diwali. Read to know more about...
Desktop Bottom Promotion