For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అట్ల తద్దిని ఆడపడుచుల పండుగ అని ఎందుకంటారో తెలుసా...

|

హిందూ పంచాంగం ప్రకారం అశ్వీయుజ మాసంలో బహుళ తదియ రోజున అట్ల తద్ది పండుగను జరుపుకుంటారు. ఈ ఏడాది నవంబర్ 3వ తేదీన మంగళవారం రోజున ఈ పండుగ వచ్చింది.

ఈ పండుగ రోజున ఆడపడచులందరూ చెట్లకు ఊయల కట్టి ఊయాలాట ఆడుతారు. ఇదే రోజున అమ్మవారిని పూజిస్తారు. ఈరోజున చంద్రోదయం వరకు ఉపవాస దీక్షను చేపట్టి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించి, ముత్తయిదువులకు వాయినం సమర్పిస్తే..పెళ్లికాని అమ్మాయిలకు గుణవంతుడు, సౌమ్యుడైన భర్త లభిస్తాడని.. అదేవిధంగా పెళ్లైన మహిళల భర్తలు ఆరోగ్యం, ఆయుష్షు బాగుంటుందని నమ్ముతారు.

ఈ అట్లతద్ది రోజున చాలా మంది ఆడవారు అట్లతద్ది నోములు చేస్తారు. విజయదశమి తర్వాత వచ్చే తదియనాడే ఈ పండుగను జరుపుకుంటారు. ఈ పండుగను ఐదేళ్లు పూర్తయిన బాలికల నుండి ముత్తయిదవుల వరకు ఎంతో సందడిగా జరుపుకుంటారు.

పురాణాల ప్రకారం త్రిలోక సంచారి అయిన నారుదుని ప్రోద్బలంతో పరమేశ్వరుడిని తన పతిగా పొందడానికి పార్వతీదేవి తొలిసారి చేసిన విశిష్టమైన వ్రతమే ఈ అట్లతద్ది. అప్పటి నుండి నేటి వరకు స్త్రీలందరూ తమ సౌభాగ్యం కోసం అట్లతద్ది వ్రతం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఈ పండుగ యొక్క ప్రత్యేకత ఏంటి? దీని వెనుక ఉన్న చరిత్ర ఏంటి.. అనే విషయాలను తెలుసుకుందాం...

అట్ల తద్ది అంటే ఏమిటి? ఈ పండుగను ఎందుకు జరుపుకుంటారు... దీని వల్ల వచ్చే ఫలితాలేంటి... .

చంద్రుని ఆరాధన..

చంద్రుని ఆరాధన..

అట్లతద్ది పండుగ రోజున చంద్రుని ఆరాధన ప్రధానమైన పూజ. చంద్రకళల్లో కొలువై ఉన్న శక్తి అనుగ్రహం వల్ల స్త్రీ సౌభాగ్యం పెరుగుతుంది. వారి కుటుంబంలో సుఖశాంతులు కూడా పెరుగుతాయని శాస్త్రాలు వివరిస్తున్నారు.

అట్లను నైవేద్యంగా..

అట్లను నైవేద్యంగా..

ఈ పండుగ రోజు అట్లను అమ్మవారికి నైవేద్యంగా పెట్టడంలో కూడా ఒక అంతరార్థం ఉంది. నవగ్రహాలలో ప్రత్యేకమైన గ్రహం కుజుడు. ఈ కుజుడికి అట్లంటే చాలా ఇష్టం. తనకు అట్లను నైవేద్యంగా పెడితే కుజదోషం తొలగిపోయి.. దాంపత్య జీవితంలో ఎలాంటి కలహాలు రాకుండా కాపురం పది కాలాల పాటు పచ్చగా ఉంటుందని నమ్ముతారు.

అట్లతద్ది కథ..

అట్లతద్ది కథ..

పురాణాల ప్రకారం.. పూర్వం ఒక రాజు, మంత్రి, సేనాపతి, పురోహితుల కూతుళ్లు ఎంతో స్నేహంగా కలిసిమెలసి ఉండేవారు. వీరంతా అట్ల తద్ది రోజున చంద్రోదయం తర్వాత పూజకోసం సన్నాహాలు చేసుకుంటున్నారు. పెద్దలంతా రాత్రి దేవీ పూజ కోసం అట్లు వేయడంలో నిమగ్నమయ్యారు.

నవంబరు 2020 : ఈ నెలలో దీపావళితో పాటు ఇతర పండుగలెప్పుడో తెలుసుకోండి...

రాజుగారి కూతురు..

రాజుగారి కూతురు..

అప్పుడు అకస్మాత్తుగా రాజుగారి కూతురు ఆకలితో కళ్లుతిరిగి పడిపోయింది. రాజకుమారుడు తన చెల్లి అవస్థను చూసి ఇంద్రజాలం చేశాడు. ఒక అద్దంలో తెల్లని వస్తువు చూపించి ‘ఇదిగో చంద్రోదయమైంది. అమ్మా! కొంచెం పండ్లు తిని సేదతీరి పూజ చేసుకో' అన్నాడు. అప్పుడామె తన అన్న మాటను నమ్మి వాటిని తీసుకుంది.

పూజ నియమం..

పూజ నియమం..

అయితే ఈ పూజ నియమం చంద్రోదయం చూసిన తర్వాత ఉమాదేవి అమ్మవారిని పూజించాలి. అందుకే ఈ వ్రతానికి ‘చంద్రోదయ ఉమావ్రతం' అనే పేరు వచ్చింది. ఆరోజు స్త్రీలు, దేవిని ఆరాధించి పది అట్లు నైవేద్యంగా.. పది అట్లను వాయనంగా ఇచ్చి.. పది రకాల పూలతో తోరణం కట్టుకుంటారు.

మంచి భర్త దొరుకుతాడని..

మంచి భర్త దొరుకుతాడని..

ఇలా చేస్తే తమకు మంచి భర్త లభిస్తాడని, పెళ్లైన మహిళలందరికీ తమ భర్త మంచి ఆరోగ్యం, ఆయుష్షుతో ఉంటాడని నమ్ముతారు. అందుకే ఆ రాజకుమార్తె తన స్నేహితురాళ్లతో కలిసి అన్నీ యథావిధిగానే చేసింది. కానీ అన్న చెప్పిన మాట నమ్మి చంద్రోదయానికి ముందే భోజనం చేసింది. ఆ రోజుల్లో ఆడవారికి చిన్నప్పుడే పెళ్లి చేసేవారు. ఆమెకు ముసలివాడు భర్తగా లభించాడు. ‘అయ్యో అట్ల తద్ది నోము చేస్తే అందమైన భర్త లభిస్తాడన్నారు కదా! నా స్నేహితురాళ్లందరికీ మంచి భర్తలు లభించారు. నేనేమి అపచారం చేశాను?' అంటూ దుఃఖించి పార్వతీ పరమేశ్వరులను ప్రార్థించగా వారు ప్రత్యక్షమై ‘నీ అన్న అజ్ణానం, నీపై అతనికుండే ప్రేమ వల్లనే వ్రతభంగం జరిగింది. రేపు అశ్వీయుజ బహుళ తదియ రోజు నీవు నియమ నిష్టలతో చంద్రోదయ ఉమావత్రం చేస్తే నీ యవ్వనవంతుడవుతాడు' అన్నారు.

ఆ నోము చేసిన తర్వాత..

ఆ నోము చేసిన తర్వాత..

ఆమె ఆ నోము చేసిన తర్వాత, ఆ నోమ కథ తన భర్తకు చెప్పి, తనపై అక్షింతలు వేయగా.. అతను వెంటనే యవ్వనవంతుడయ్యాడు. కాబట్టి కన్యలంతా ఈ వ్రతం చేస్తే మంచి వరుడు దొరుకుతాడు. వివాహిత స్త్రీలు ఈ వ్రతం చేస్తే ఉమాదేవి అనుగ్రహానికి పాత్రులై సకల సౌభాగ్యాలను పొందుతారు.

English summary

Atla Taddi 2020 Date: Significance, Rituals, Traditions and Celebrations

Here we talking about the atla taddi 2020 date, significance, rituals, traditions and celebrations. Read on