Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
గోర్లు కట్ చేస్తున్నారా ? తస్మాత్ జాగ్రత్త..పేదోళ్లు అయిపోతారు
మన చేతులు,కాళ్ల వేళ్లకి గోర్లు పెరగడం సాధారణం. అయితే వీటిని ఎప్పటికప్పుడు కట్ చేస్తూ ఉండాలి. లేకుంటే అవి చాలా పెరిగి.. మీ లుక్ ని బ్యాడ్ గా మార్చడమే కాకుండా నలుగురిలోకి వెళ్లి ఉండటానికి మీరు ఇబ్బందిగా ఫీల్ అయ్యేలా చేస్తుంది. కాబట్టి వాటిని కొంచెం పెరగగానే కత్తిరించేయాలి. అయితే గోర్లను ఏ రోజు పడితే ఆ రోజు ఏ టైం పడితే ఆ టైంలో కట్ చేస్తే దారుణమైన ఫలితాలను చివిచూడాల్సివస్తుందట. గోళ్లను కట్ చేయడానికి కూడా కొన్ని రూల్స్ ఉన్నాయి.
బ్యడ్ టైంలో గోర్లు కట్ చేస్తే ఇంట్లో చెడు శక్తులు మేల్కొంటాయని, ప్రతికూల శక్తి ఆధిపత్యం చెలాయిస్తుంది. అందుకే మన పెద్దలు తరచుగా ఇక్కడ గోళ్లు కట్ చేయకు,ఈ రోజు కట్ చేయకు అని తరుచుగా చెప్తుండటం మనం మన ఇళ్లల్లో చూసి ఉంటాం. వారు ఏదో ఊరికే చెప్పడం లేదు. దాని వెనుక పెద్ద కథే ఉంది. గోరు కత్తిరించడానికి సంబంధించిన జ్యోతిషశాస్త్ర నియమాల గురించి ఇప్పుడు చూద్దాం.

పొరపాటున కూడా ఈ రోజుల్లో గోళ్లను కత్తిరించకూడదు
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వారంలో 3 రోజులు పొరపాటున కూడా గోర్లు కత్తిరించకూడదు. మంగళవారం హనుమంతుని భక్తికి సంబంధించిన రోజుగా భావిస్తారు. ఈ రోజున మీ గోర్లు కట్ చేస్తే అది మీ ధైర్యాన్ని తగ్గిస్తుంది. అంతే కాకుండా అన్నదమ్ములతో విభేదాలు కూడా పెరుగుతాయి. గురువారాన్ని దేవ గురువు బృహస్పతి దినం అంటారు. ఈ రోజున గోర్లు కత్తిరించడం వల్ల కడుపు సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. మీ విద్యకు కూడా ఆటంకం కలుగుతుంది, మీ జ్ఞానం తగ్గుతుంది. ఇక శనివారం శని దేవుడికి అంకితం చేయబడింది. శనివారం గోర్లు కత్తిరించడం వల్ల ఇంట్లో పేదరికం ప్రబలుతుందని, చేసే పనికి ఆటంకం ఏర్పడుతుందని నమ్ముతారు.
ఈ సమయంలో అస్సలు వద్దు
రాత్రిపూట ఎవరూ గోళ్లు కత్తిరించకూడదు. సంపదల దేవత ఇంట్లోకి ప్రవేశించే సమయం ఇది. ఈ సమయంలో వారికి పూజలు చేసి దీపం వెలిగించి స్వాగతం పలకాలి కానీ మీరు గోర్లు డం చూసినప్పుడు, వాళ్లు అసంతృప్తి చెంది వెనక్కి వెళ్లిపోతారు. దీని కారణంగా ఇంటిలోని అన్ని సంతోషాలు, శ్రేయస్సు క్రమంగా ఎండిపోవడం ప్రారంభమవుతుంది. మీరు పేదరికంలోకి వెళ్లిపోతారు.
గోర్లు కత్తిరించడానికి సరైన రోజు, సమయం
మంగళవారం,గురువారం, శనివారం మినహా ఏ రోజు అయినా గోర్లు కత్తిరించవచ్చు. అయితే ఈ గోళ్లను రాత్రిపూట కాకుండా పగటిపూట మాత్రమే కత్తిరించాలి. స్నానం చేసిన తర్వాత గోళ్లు కాస్త మృదువుగా మారుతాయి. అందువల్ల వాటిని ఆ సమయంలో కత్తిరించడం మంచిది. గోళ్లను కత్తిరించిన తర్వాత సబ్బుతో చేతులు కడుక్కోవడం బెటర్.



Click it and Unblock the Notifications