Latest Updates
-
పొట్లకాయ ఆకారం చూసి పక్కన పెడుతున్నారా? గుండె, ఎముకల ఆరోగ్యానికి ఇదే బెస్ట్..బరువు కూడా తగ్గొచ్చు! -
ఆంధ్ర స్టైల్ ఉసిరికాయ నిల్వ పచ్చడి.. పక్కా కొలతలతో ఇలా చేస్తే రుచి అద్భుతం! -
గురు గ్రహ సంచారం..ఈ 3 రాశులకు కోటీశ్వర యోగం..మీ రాశి ఇందులో ఉందా? -
షుగర్ పేషెంట్స్,బరువు తగ్గాలనుకునే వారికి పర్ఫెక్ట్ లంచ్ బాక్స్ రెసిపీ..ఎలా చేసుకోవాలంటే.. -
గుడిలో ప్రసాదంలా రోజంతా కమ్మగా ఉండే దద్దోజనం..ఎలా చేసుకోవాలంటే.. -
ప్రెషర్ కుక్కర్ మూత పక్కల నుండి ఆవిరి లీక్ అవుతోందా? ఈ చిట్కాతో ఆ సమస్యకు చెక్! -
సిరిసంపదలు పెరగాలంటే ఇల్లు ఎలా తుడవాలి? కచ్చితంగా పాటించాల్సిన వాస్తు నియమాలు -
నవరాత్రి ఉపవాస స్పెషల్.. నానబెట్టే పనే లేకుండా అప్పటికప్పుడు సగ్గుబియ్యం వడలు..ఎలా చేసుకోవాలంటే.. -
క్రిస్పీ సొరకాయ ఫింగర్స్..ఏం టేస్ట్ రా బాబు తింటుంటే అలా పోతూ ఉంటాయ్..ఈజీగా చేసుకోండిలా.. -
Shocking: మెట్రో రైలులో సీటు కోసం గొడవ..ఒకరు మృతి..అసలేం జరిగిందంటే..?
బ్రహ్మచారులారా శ్రావణంలో మంచి ముహూర్తాలు మొదలయ్యాయి పెళ్లి చేసేసుకోండి, లేదంటే శూన్యమాసం వస్తుంది
గస్టు 15 2018 నుంచి వచ్చే నెల అంటే సెప్టెంబర్ లో 3వ తేదీ వరకు గ్రుహ ప్రవేశాలకు అనుకూలం. ఇక సెప్టెంబర్ 10 నుంచి అక్టోబర్ 10 వ తేదీ వరకు శూన్యమాసం ఉండనుంది. శ్రావణంలో మంచి ముహూర్తాలు మొదలయ్యాయి
శ్రావణం అందరూ దేవతలకు ప్రీతికరం. హిందూ సంప్రదాయం ప్రకారం ఉండే అన్ని మాసాల్లో శ్రావణం చాలా శుభప్రదం. ఈ మాసం వచ్చిదంటే చాలు అంతటా శుభకార్యాలే. మహిళలు కూడా మంగళకరంగా పూజలు చేస్తూ కనపడతారు. మొత్తానికి పూజలతో ఈ మాసమంతా మంగళకరంగా ఉంటుంది.

చాలా పండుగలు
శ్రావణ మాసంలో వరలక్ష్మీవ్రతం, రాఖీ పౌర్ణిమ ఇలా చాలా పండుగలు వస్తాయి. శివుడికి అత్యంత ప్రీతికరమైన మాసం కూడా శ్రావణమే. ఇక శ్రావణ సోమవారాల్లో నిష్టగా పూజ చేస్తే కోరుకున్న కోరికలు నెరవెరుతాయని భక్తుల నమ్మకం.

అన్ని రోజులు మంచివే.
శ్రావణ మాసంలో అన్ని రోజులు మంచివే. అన్నీ శుభకార్యాలకు ఎంతో అనుకూలం. ఈ మాసంలో వివాహాలు చేసుకోవడానికి అనుకూలమైన తేదీలు చాలానే ఉన్నాయి. ఎప్పుడెప్పుడు ఆషాఢం ముగిసిపోతుందా అని ఎదురు చూసిన వారంతా శ్రావణంలో పెళ్లికి రెడీ అవుతూ ఉంటారు.

ఆదివారం నుంచే శ్రావణం
గత ఆదివారం నుంచే శ్రావణం ప్రారంభమైంది. ఇక ఈ నెల 15 నుంచే పెళ్లిళ్లకు ఇతర శుభకార్యాలకు మంచి ముహూర్తాలు ప్రారంభమయ్యాయి. గత నెలలో ఆషాఢం ఉండడంతో గత నెల 6వ తేదీ వరకే శుభకార్యాలు చేసుకున్నారు. తర్వాత నుంచి అందరూ మంచి రోజుల కోసం వెయిట్ చేస్తున్నారు.

శుభకార్యాలు మొదలుపెట్టారు
ఇక మొన్న 15 వ తేదీ నుంచే అందరూ శుభకార్యాలు మొదలుపెట్టారు జనాలు. ఆగస్టు 2018లో 15వ తేదీ, 16వ తేదీ, 17వ తేదీ, 18వ తేదీ, 19వ తేదీ, 25వ తేదీ, 26 వ తేదీ, 28వ తేదీ, 30వ తేదీల్లో మంచి ముహూర్తాలున్నాయి. ఆయా తేదీల్లో వివాహాలు చేసుకోవొచ్చు. అలాగే ఆగస్టు 2018 25వ తేదీ, 26 తేదీల్లోనూ పెళ్లిళ్లు చేసుకోవొచ్చు.

బిజీబిజీ
గత కొన్ని రోజులు నుంచి పెళ్లి చేసుకోవడానికి వెయిట్ చేస్తున్న వారు పెళ్లికి వెంటనే రెడీ కావొచ్చు. అలాగే బంధువులు శుభకార్యాలకు వెళ్లడంలో జనాలంతా కూడా శ్రావణ మాసమంతా బిజీ బిజీ అయిపోయినున్నారు.

శూన్యమాసం
అలాగే ఆగస్టు 15 2018 నుంచి వచ్చే నెల అంటే సెప్టెంబర్ లో 3వ తేదీ వరకు గ్రుహ ప్రవేశాలకు అనుకూలం. ఇక సెప్టెంబర్ 10 నుంచి అక్టోబర్ 10 వ తేదీ వరకు శూన్యమాసం ఉండనుంది. దీంతో అప్పుడు ఎలాంటి శుభ కార్యాలు చేసుకోవడానికి వీలుండదు. దీంతో జనాలంతా ఈ నెలలోనే శుభకార్యాలతో బిజీబిజీ అయిపోనున్నారు.

వెంటనే బుక్ చేసుకోండి
సో.. మీ ఇంట్లో కూడా ఏదైనా శుభకార్యం ఉంటే ఈ నెలంతా మీకు శుభకార్యాలకు కావాల్సిన వస్తువులు దొరికే అవకాశం కాస్త తక్కువగా ఉంటుంది కాబట్టి ముందస్తుగానే మీరు అన్నీ బుక్ చేసుకోండి. లేదంటే ఇబ్బందులు పడాల్సింది వస్తుంది.



Click it and Unblock the Notifications
