Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
శుభప్రదమైన దీపావళి పండుగకు స్పెషల్ గిఫ్ట్స్ ఎంపిక చేసుకునే విధానం..!
దీపావళి పండుగ రోజు బహుమతులు ఇచ్చుకోవడం అనేది ఎల్లపుడూ ముఖ్యమైన సంప్రదాయం. ఇది ఒక సంప్రదాయంగా, దీపావళి బహుమతులు మనం ఇష్టపడే వారికి మనం చూపించే ప్రేమ, అభిమానానికి ప్రతీక. దీపావళి పూజ తరువాత, మందులు కాల్చిన తరువాత, స్నేహితులు, పరిచయం ఉన్నవారికి, కుటుంబ సభ్యుల మధ్య బహుమతులు ఇచ్చిపుచ్చు కోవడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ మంచి లేదా ఎక్కువ బహుమతులు ఇవ్వడానికి పోటీపడుతూ ఉంటారు.
నిరంతరంగా పెరుగుతున్న దూరాన్ని తగ్గించడానికి, మన దగ్గరి బంధువులకు శుభాకాంక్షలు తెలియచేయడానికి దీవాలి బహుమతులు ఇవ్వబడతాయి. ఈ సందర్భంగా అనేక ఆలోచనలతో కూడిన పవిత్ర బహుమతులను ఎంపిక చేసుకోవచ్చు. ఇటువంటి కొన్ని ప్రసిద్ధ దీపావళి బహుమతుల గురించి కింద వివరించబడింది.

1 దీపావళి మిఠాయిలు -
అందంగా ప్యాక్ చేయబడిన వివిధ రకాల రుచులతో కూడిన మిఠాయిలతో మీరు మీ ప్రేమను ఖచ్చితంగా తెలియచేయవచ్చు లేదా శుభాకాంక్షలు తెలియచేయవచ్చు.

2 దీపావళి పూజ పళ్ళెం -
ఒక పవిత్రమైన 'లక్ష్మి-వినాయకుడి' పూజ పళ్ళెం పూలతో, బంగారు గోట, విగ్రహాలు, రోలీ బియ్యం తో గిన్నెలు, దీపాలు మొదలైన రకాల వస్తువులతో అలంకరిస్తారు.

3. గణేష్-లక్ష్మి బహుమతులు -
వారి గొప్ప రాక, ఆనందకరమైన దీవెనలతో మీ ఇంటికి ఎంతో అందమైన అలంకరణతో దైవత్వాన్ని తీసుకురండి.

4 దీపావళి వెండి బహుమతులు -
స్వచ్చమైన వెండితో తయారుచేయబడిన దైవత్వపు చక్కదనం, పళ్ళాలు, విగ్రహాలు, ఆభరణాలు, నాణాలు ఇటువంటి ఆలోచనలతో కూడిన కొన్ని వెండి బహుమతులు కూడా ఉంటాయి.

5 దీపావళి బంగారు బహుమతులు -
బంగారం చాలా విలువైన మెటల్, ఇది అత్యంత తేలికగా దీపావళి పండుగతో అందర్నీ కలుపుతుంది. బంగారంతో కూడిన బహుమతులు లేకపోతే ఏ దీపావళి వేడుకా పూర్తి కాదు.

6. దీపావళి దివ్వెలు/దీపావళి కొవ్వొత్తులు -
మట్టి, క్లే, బ్రాస్, వైట్ మెటల్, వెండి ఇటువంటి అత్యంత సాధారణంగా ఉపయోగించే పదార్ధాలతో దీపాలు తయారుచేయబడతాయి.
ఈ బహుమతులు లేదా వస్తువులు ఈ పండుగలో విభజించలేని భాగాలూ, ఇవి దీపావళి, దివ్వెల దీపావళి కి ఒక పవిత్రమైన భావాన్ని తీసుకొస్తాయి.



Click it and Unblock the Notifications