Latest Updates
-
నోట్లో ఇట్టే కరిగిపోయే జ్యూసీ మటన్ తహరీ.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ కావాలంటారు! -
తోబుట్టువుల మధ్య గొడవలా.. రాఖీ కట్టేటప్పుడు మీ సోదరుడితో తప్పనిసరిగా ఈ మాట చెప్పండి.! -
ఇతరుల సీక్రెట్స్ తెలుసుకోవడంలో ఈ 3 రాశుల వారే కింగ్స్..వాళ్లవి మాత్రం ముక్క కూడా చెప్పరు! -
చాణక్య నీతి: ఈ నాలుగు పనులు చేసిన తర్వాత స్నానం చేయడం తప్పనిసరి.. లేదంటే.! -
రాఖీ 2026 స్పెషల్: మీ చేతులతో సోదరుడి కోసం కుంకుమపువ్వు పిస్తా మిల్క్ కేక్ ఇలా చేయండి! -
పిల్లల్లో ఏకాగ్రత, జ్ఞాపకశక్తిని పెంచే ‘బయోటిన్ డ్రింక్’.. ఒక్క గ్లాసు తాగితే చాలు.. నిమిషాల్లో రెడీ.! -
పోషకభరితమైన, రుచికరమైన దొండకాయ మసాలా రైస్,,లంచ్ బాక్స్ కి పర్ఫెక్ట్ రెసిపి ఇది! -
టీ, కాఫీతో హార్మోన్ల సమస్య.. మహిళల్లో గర్భధారణ, సంతానోత్పత్తిపై ప్రభావం చూపిస్తుందా.? -
నవపంచమ దృష్టి యోగం..సెప్టెంబర్ 1 నుంచి ఈ 4 రాశుల జాతకం మారిపోబోతోంది! -
100 ఏళ్లు మిమ్మల్ని ఆరోగ్యంగా బతికించే బ్రేక్ ఫాస్ట్..దీన్ని మించింది ప్రపంచంలోనే లేదు!
గణేష్ చతుర్థి 2024: వినాయక చవితి హిందువులకు చాలా ప్రత్యేకం, ప్రతి ఇంటిలో పండుగ
గణేశ చతుర్థిని వినాయక చవితి అని కూడా అంటారు. వినాయక చవితిని 10 రోజుల పాటు జరుపుకునే ముఖ్యమైన హిందువువల పండుగ. 2024లో వినాయక చవితి పండుగను సెప్టెంబర్ 7వ తేదీ శనివారం జరుపుకుంటారు. ఈ రోజు హిందూ మతంలో చాలా ముఖ్యమైన రోజు. ముఖ్యంగా దేశంలోని అనేక రాష్ట్రాల్లో వినాయక చవితి పండుగను రంగరంగ వైభవంగా జరుపుకుంటారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్రలో వినాయక చవితి పండుగను చాలా గ్రాండ్ గా జరుపుకుంటారు.
వినాయక చవితి పండుగ చాలా గొప్ప ప్రాముఖ్యతను కలిగి ఉంది, ఈ పండుగను చాలా భక్తితో ఉత్సాహంగా జరుపుకుంటారు. భక్తులు ఈ పండుగను వినాయకుని జన్మదినంగా జరుపుకుంటారు. హిందువుల్లో వినాయక చవతి పండుగ చాలా గొప్ప ఆనందాన్ని నింపుతుంది. ఈ పండుగకు చాలా గొప్ప అలంకరణలు, ఊరేగింపులు, సమాజసేవా కార్యక్రమాలుతో పాటు అనేక రకాల వేడుకలతో జరుపుకుంటారు. ప్రజలు వినాయకుడి విగ్రహాలను ఇంటికి తీసుకొచ్చి భక్తితో పూజిస్తారు.

గణపతి విగ్రహాన్ని ఇంటికి తీసుకువచ్చి ప్రతిష్టించడానికి ఏ శుభ సమయం బాగుంటుందో ముందుగానే చూసుకుంటారు. వినాయకుడి విగ్రహాన్ని ఇంటికి తీసుకు వచ్చిన తరువాత చాలా భక్తితో ఉంటారు. ఇల్లు శుభ్రం చేసి ఇంటి ముందు రంగురంగుల ముగ్గులు వేస్తారు. వినాయకుడిని సూర్యోదం ముందే ఇళ్లలో ప్రతిష్టించడానికి చాలా మంది ఆసక్తి చూపిస్తారు. లేదంటే వాళ్లవాళ్ల వీలును చూసుకుని రాహుకాలం, యమగండం లేని సమయంలో ఇంటిలో వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్టిస్తారు.
ఇంటిలో వినాయకుడి విగ్రహం పెట్టిన తరువాత గణపతికి ఇష్టం అయిన కుడుములు ప్రతి ఇంటిలోనా చేస్తుంటారు. ఇంకా ఎక్కువగా దక్షిణ భారతదేశంలో రవ్వలడ్డూ, నేతి లడ్డూలు, కజ్జాయలుతో పాటు వివిద రకాల స్వీట్లు చేసి వినాయకుడికి నైవేద్యంగా పెడుతారు. వినాయకుడికి ఇష్టం అయిన పండ్లు గణపతి విగ్రహం ముందు పెట్టి భక్తితో పూజలు చేస్తారు. ఆయా ప్రాంతాలు, ఆయా రాష్ట్రాల సాంప్రధాయాల ప్రకారం వినాయక చవితి రోజు ఇళ్లలో గణపతి విగ్రహాన్ని ప్రతిష్టించి ప్రత్యేక పూజలు చేస్తుంటారు.
ఇక తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. హిందువులు దాదాపుగా వినాయక చవితి రోజున వినాయకుడి విగ్రహం ఇంటిలో ప్రతిష్టించడానికి ఆసక్తి చూపిస్తారు. తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో అయితే వినాయక చవితి వచ్చిందంటే 11 రోజుల పాటు ప్రతిరోజు పండుగ వాతావరణం నెలకొంటుంది. ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లాలోని కాణిపాకంలో ఆలయంలో వినాయకుడి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు.
కర్ణాటక, తమిళనాడులో కూడా వినాయక చవితి పండుగ చాలా గ్రాండ్ గా నిర్వహిస్తారు. వినాయక చవితి వచ్చిన రోజు మాత్రమే కాకుండా కర్ణాటకలో నెల రోజుల పాటు ప్రతి ఏరియాలో వినాయక చవితి ఉత్సవాలు నిర్వహిస్తారు. కొన్ని ప్రాంతాల్లో మూడు రోజులు, కొన్ని చోట్ల ఐదు రోజులు, కొన్ని ప్రాంతాల్లో 9 రోజులు, మరికొన్ని ప్రాంతాల్లో 11 రోజుల పాటు వీదుల్లో వినాయకుడి విగ్రహాలు ఏర్పాటు చేసి ప్రతిరోజు రకరకాలుగా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. పలు చోట్ల వినాయక ,చవితి నిర్వహకులు ఉదయం, సాయంత్రం పూట వినాయకుడికి నైవేధ్యం పెట్టిన తరువాత భక్తులకు ప్రసాదాలు అందిస్తారు. పలు చోట్ల మద్యాహ్నం, రాత్రి అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తారు.



Click it and Unblock the Notifications