For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గుడిలో దేవుడిని పూజించే వేళ.. ఈ పొరపాట్లు చేయకండి...!

దేవుడిని పూజించే సమయంలో ఎలాంటి పొరపాట్లు చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.

|

మన పూర్వీకులు.. పెద్దలు ప్రతి ఒక్క పనికి ఒక పద్ధతిని తెలియజేస్తారు. వాటిని మన తల్లిదండ్రులు ఆనాటి నుండి అనాదిగా పాటిస్తూ ఉన్నారు. ఇలా చేస్తేనే అన్నింటా శుభ ఫలితాలొస్తాయని చాలా మంది నమ్ముతారు.

Avoid These Mistakes During God Worship In Temples in Telugu

ఇదిలా ఉండగా.. మనలో చాలా మంది నిత్యం ఆలయాలకు వెళ్తుంటారు. దేవుళ్లను ఆరాధిస్తూ ఉంటారు. కొందరు ఇళ్లలోనే పూజా మందిరం ఏర్పాటు చేసుకుని దేవుడికి పూజలు చేస్తుంటారు. అయితే పూజలు చేసే వారు కొన్ని నియమాలను కచ్చితంగా పాటించాలని పండితులు చెబుతున్నారు. పూజలను ఎవరు పడితే వారు.. ఎలా పడితే అలా చేయకూడదట.

Avoid These Mistakes During God Worship In Temples in Telugu

అలా చేయడం వల్ల శుభ ఫలితాల కంటే అశుభమే జరిగే ప్రమాదం ఎక్కువగా ఉంటుందట. అంతేకాదు మనం పూజ చేసే సమయాల్లో తెలిసి తెలియకుండా చేసే పొరపాట్ల వల్ల చాలా నష్టం జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ సందర్భంగా దేవుడిని పూజించే సమయంలో ఎలాంటి పొరపాట్లు చేయకూడదనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

Sankashti Chaturthi 2022:సంకష్ట చతుర్థి పూజా విధానం.. ఈ వ్రతంతో వచ్చే ఫలితాలేంటో తెలుసుకుందామా...Sankashti Chaturthi 2022:సంకష్ట చతుర్థి పూజా విధానం.. ఈ వ్రతంతో వచ్చే ఫలితాలేంటో తెలుసుకుందామా...

కొన్ని పద్ధతులు..

కొన్ని పద్ధతులు..

మనలో చాలా మంది దేవుడిని నమ్ముతారు. అందుకే నిత్యం ఇంట్లో లేదా గుడిలో దేవుడిని పూజిస్తూ ఉంటాం. దేవుడికి సంబంధించిన శ్లోకాలను, స్తోత్రాలను, మంత్రాలను జపిస్తూ.. పండ్లు, పూలు, పాలు వంటి వారిని దేవునికి సమర్పించి.. పూజలు చేస్తూ ఉంటాం. అయితే ఇదే సమయంలో కొన్ని పద్ధతులు కచ్చితంగా పాటించాలి.

నోటితో ఊదరాదు..

నోటితో ఊదరాదు..

మనలో దేవుడికి పూజ చేసే ప్రతి ఒక్కరూ గుడిలో లేదా ఇంట్లోని పూజా మందిరంలో అగర్ బత్తీల(ఉదికడ్లు)ను వెలిగిస్తూ ఉంటారు. అయితే అలా వెలిగించిన తర్వాత, వాటి నుండి పొగ రావాలని నోటితో ఊదడం వంటివి చేస్తూ ఉంటారు. అయితే.. అలా ఎప్పటికీ చేయకూడదట. ధూపం వెలిగించిన తర్వాత కూడా అలాగే వదిలేయాలట. అప్పుడే శుభ ఫలితాలొస్తాయట. అలా కాదని..నోటితో ఊదితే అశుభ ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుందట.

భోజనం తర్వాత..

భోజనం తర్వాత..

ఎవరైనా పూజ చేయడానికి ముందు అస్సలు భోజనం చేయకూడదట. ఒక వేళ భోజనం చేస్తే.. ఆ తర్వాత పూజను అస్సలు చేయకూడదట. ఎందుకంటే మనం తీసుకునే ఆహారంలో ఉల్లిపాయలతో పాటు ఇతర పదార్థాలను తీసుకుంటాం. ఆ వాసన నోటిలోనే ఉండిపోతుంది. అదే నోటితో మంత్రాలు చదవడం వంటివి చేయాల్సి వస్తుంది.. అలా ఎప్పటికీ చేయకూడదట. అందుకే ముందుగా స్నానం చేసి.. భోజనానికి ముందు పూజ చేయడం వంటివి చేయాలని పండితులు చెబుతున్నారు. అలాగే పొగ తాగిన వారు కూడా మంత్రాలను చదవడం వంటివి చేయకూడదట.

Vishnu Sahasranamam:విష్ణు సహస్రనామం పారాయణం వల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలుసా...Vishnu Sahasranamam:విష్ణు సహస్రనామం పారాయణం వల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలుసా...

చిరిగిన దుస్తులొద్దు..

చిరిగిన దుస్తులొద్దు..

మీరు ఇంట్లో అయినా.. ఏదైనా దేవాలయంలో పూజ చేసే సమయంలో చిరిగిన బట్టలను ఎప్పటికీ వేసుకోకూడదట. ఎందుకంటే చిరిగిన బట్టలు దరిద్రానికి సంకేతమట. అందుకే శుభ్రంగా ఉన్న బట్టలను వేసుకుని మాత్రమే దేవుడి పూజ చేయాలి.

వినాయకుని పూజించే వేళ..

వినాయకుని పూజించే వేళ..

హిందువులలో ఎవరైనా తొలి పూజ వినాయకుడికే చేస్తూ ఉంటారు. ఇదే ఆనవాయితీ పూర్వకాలం నుండి వస్తోంది. మనలో చాలా మంది దేవుడికి పూజించే పూలలో తులసి ఆకులను కలుపుతూ ఉంటారు. అలా చేస్తే మంచిదని నమ్ముతారు. అయితే ఒక్క వినాయకుడిని పూజించేటప్పుడు మాత్రం తులసి ఆకులను దూరంగా ఉంచాలని గుర్తుంచుకోండి. లంబోదరుడికి పొరపాటున కూడా తులసి ఆకులతో పూజ చేయకూడదట.

స్నానం చేయకుండా..

స్నానం చేయకుండా..

తులసి ఆకులను స్నానం చేయకుండా ఎప్పటికీ కోయరాదట. ఒకవేళ మీరు స్నానం చేయకుండా తులసి ఆకులను కోస్తే.. వాటిని మీరు ఏ దేవుడికి సమర్పించినా.. దాని ఫలితం శూన్యమేనట. అలాగే ఆదివారం రోజున తులసి మొక్కకు నీరు పోయడం వంటివి చేయకూడదట. అది ఇంటికి మంచిది కాదట.

Vaikuntha Ekadashi Vrat Rules:వైకుంఠ ఏకాదశి రోజున పాటించాల్సిన ఉపవాస పద్ధతులేంటో తెలుసా...Vaikuntha Ekadashi Vrat Rules:వైకుంఠ ఏకాదశి రోజున పాటించాల్సిన ఉపవాస పద్ధతులేంటో తెలుసా...

అలాంటి నెయ్యి వద్దు..

అలాంటి నెయ్యి వద్దు..

మనలో చాలా మంది పూజలు చేసే సమయంలో నెయ్యిని విరివిగా వాడుతూ ఉంటారు. అయితే గడ్డకట్టిన నెయ్యిని.. నీళ్ల మాదిరిగా ఉండే నెయ్యిని దేవునికి సమర్పించడం వంటివి చేయకూడదట. అలాగే నెయ్యిలో నీటి వాసన అస్సలు ఉండకుండా జాగ్రత్త పడాలట.

కార్తీక మాసంలో..

కార్తీక మాసంలో..

కార్తీక మాసం అనగానే శివుని ఎంతో ప్రీతికరమైనది చాలా మంది నమ్మకం. ఈ కాలంలో శివునికి కేతకీ పువ్వును అస్సలు సమర్పించకూడదట. అయితే ఇదే సమయంలో విష్ణుమూర్తికి ఈ పువ్వును సమర్పించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయట. అలాగే శ్రావణ నక్షత్రంలో లేదా రుతిక రుథిలో ఎప్పటికీ లక్ష్మీదేవి పూజించడం వంటివి చేయకూడదట.

పూజ సమయంలో..

పూజ సమయంలో..

మనం పూజ చేసే సమయంలో ఒక దీపం నుండి మరో దీపాన్ని వెలిగించడం వంటివి చేస్తూ ఉంటాం. అయితే అలా ఎప్పటికీ చేయకూడదట. అలా చేయడం వల్ల అనారోగ్యం, పేదరికానికి ఆహ్వానం పలికినట్లేనట. అలాగే దీపం ఎప్పుడూ దక్షిణం వైపు ఉండకూడదట. ఇక పూజ చేసే సమయంలో ఎవరైనా ముఖ్యమైన లేదా గౌరవ ప్రదమైన వ్యక్తి వస్తే, వారిని విస్మరించకుండా.. వారిని అభినందిస్తూనే పూజను కొనసాగించాలట.

FAQ's
  • దేవుడిని పూజించే సమయంలో ఎక్కువగా ఎలాంటి పొరపాట్లు చేయకూడదు?

    దేవుడిని పూజించే సమయంలో అగర్ బత్తీలను వెలిగించిన తర్వాత వాటిని పొగ రావాలని నోటితో ఊదడం వంటివి చేస్తూ ఉంటారు. అయితే.. అలా ఎప్పటికీ చేయకూడదట. ధూపం వెలిగించిన తర్వాత కూడా అలాగే వదిలేయాలట. పూజ చేయడానికి ముందు అస్సలు భోజనం చేయకూడదట. పూజ చేసే సమయంలో చిరిగిన బట్టలను ఎప్పటికీ వేసుకోకూడదట. గడ్డకట్టిన నెయ్యిని.. నీళ్ల మాదిరిగా ఉండే నెయ్యిని దేవునికి సమర్పించడం వంటివి చేయకూడదట.

English summary

Avoid These Mistakes During God Worship In Temples in Telugu

Here we are discussing about the avoid these mistakes during god worship in temples in Telugu. Have a look
Story first published:Friday, January 21, 2022, 17:04 [IST]
Desktop Bottom Promotion