For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Eid al-Adha 2021 (Bakrid): బక్రీద్ పండుగ ఎందుకు జరుపుకుంటారో తెలుసా?

బక్రీద్ పండుగ యొక్క చరిత్ర మరియు ప్రాముఖ్యత గురించి కొన్ని విశేషాలను తెలుసుకుందాం.

|

బక్రీద్ పండుగను ఈద్ ఉల్ జుహా లేదా ఈద్ ఉల్ అద్హా అనే పేర్లతో కూడా పిలుస్తారు. త్యాగానికి ప్రతీకగా భావించే ఈ బక్రీద్ పండుగను ముస్లింలు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు.

Bakrid 2020 : Date, history and significance

ఈ పండుగ 2021 సంవత్సరంలో జులై 20 మరియు 21వ తేదీన వచ్చింది. ముస్లిం క్యాలెండర్ (చంద్రుని గమనం) ప్రకారం.. వారి చివరి నెల అయిన ధు అల్-హిజాజ్ పదో రోజున ఈ పండుగ వస్తుంది. పరమ పవిత్రమైన ఈరోజున ముస్లింలలో చాలా మంది మరణించిన వారి సమాధుల వద్దకు వెళ్తారు.

Bakrid 2020 : Date, history and significance

అక్కడ వారికి ఇష్టమైన దుస్తులు, ఆహార పదార్థాలను ఉంచి ప్రార్థనలు చేస్తారు. ఇలా చేయడం వల్ల స్వర్గంలో ఉన్న వారి పెద్దలు వాటిని స్వీకరిస్తారని నమ్ముతారు...

అలా ప్రారంభిస్తారు..

అలా ప్రారంభిస్తారు..

రంజాన్ పండుగ అత్యంత ముఖ్యమైన పండుగ అయిన బక్రీద్ నాడు కూడా ఖుద్భా అనే ధార్మిక ప్రసంగంతో ప్రార్థనలను ప్రారంభిస్తారు. ఆ తర్వాత సామూహిక ప్రార్థనలు నిర్వహిస్తారు.

ఖుర్బానీ అంటే..

ఖుర్బానీ అంటే..

మసీదులలో, ఇళ్లలో ప్రార్థనలు నిర్వహించిన అనంతరం ఖుర్బానీ పేరిట జంతువులను బలి ఇస్తారు. ఖుర్బానీ అంటే బలిదానం ఇవ్వడం, త్యాగం అనే అర్థాలున్నాయని ముస్లిం పెద్దలు చెబుతారు.ఖుర్బానీ ఇవ్వడానికి ప్రధానమైన కారణం ఏదైనా ఉందంటే అది హజరత్ ఇబ్రహీం అనే ప్రవక్త త్యాగమే అని ముస్లింలు నమ్ముతారు. ఖురాన్ ప్రకారం.. అల్లాహ్ పంపిన ప్రవక్తల్లో ఇబ్రహీం ప్రముఖులు.

సంతానం లేకపోవడంతో..

సంతానం లేకపోవడంతో..

మక్కా పట్టణాన్ని ఆయనే నిర్మించడమే కాదు.. అందరికీ నివాస యోగ్యంగా మార్చారు. అల్లా హ్ ను ఆరాధించడం కోసం ప్రార్థనా మందిరం ‘కాబా'ను నిర్మించి దైవ ప్రవక్తగా పేరు తెచ్చుకున్నారు. అయితే ఇబ్రహీం దంపతులకు కొన్నేళ్లుగా పిల్లలే పుట్టలేదు. కానీ ఓసారి లేక లేక పుట్టిన పుత్రుడికి ఇస్మాయిల్ అని పేరు పెట్టారు.

ఇబ్రహీమ్ కు ఓ కల..

ఇబ్రహీమ్ కు ఓ కల..

తనకు కుమారుడు పుట్టిన ఆనందించేలోపే ఇబ్రహీమ్ కు ఓ రోజు ఓ కల వస్తుంది. అందులో తన పుత్రుడు ఇస్మాయిల్ మెడను కత్తితో కోస్తున్నట్టు భావిస్తాడు. అల్లా హ్ ఖుర్బానీ కోరుతున్నాడేమో అని భావించి ఆ సమయంలో ఒంటెను బలి ఇస్తారు. అయితే మళ్లీ అదే కల వస్తుంది.

త్యాగానికి ప్రతీకగా..

త్యాగానికి ప్రతీకగా..

అల్లా హ్ తన పుత్రుడినే బలిదానం కోరుకుంటున్నాడని.. ఈ విషయాన్ని తన సుపుత్రుడికి చెప్పగా.. అల్లా హ్ కోసం తాను ప్రాణ త్యాగానికి రెడీ అని చెబుతాడు. ఆ వెంటనే ఇస్మాయిల్ మెడపై కత్తి పెట్టి జుబాహ్ కు ఇబ్రహీం సిద్ధపడగా.. వారి త్యాగాన్ని మెచ్చుకున్న అల్లా హ్ ప్రాణ త్యాగానికి బదులుగా ఓ జీవాన్ని బలి ఇవ్వాలని జిబ్రాయిల్ అనే దూత ద్వారా కబురు పంపుతాడు. అప్పటి నుండే బక్రీద్ రోజున ఖుర్బానీ ఇవ్వడం ఆనవాయితీగా వస్తోందని ముస్లిం పెద్దలు చెబుతారు.

మూడు భాగాలుగా..

మూడు భాగాలుగా..

బక్రీద్ రోజున జంతువులను బలి ఇచ్చిన తర్వాత వాటి మాంసాన్ని మూడు భాగాలుగా విభజిస్తారు. ఒక భాగం పేదలకు, రెండో భాగం చుట్టాలకు, మరో భాగం తమ కుటుంబం కోసం వినియోగిస్తారు. ఇలా బక్రీద్ రోజున ముస్లింలు ప్రపంచవ్యాప్తంగా ఖుర్బానీ ఇస్తారు.

English summary

Bakrid 2020 : Date, history and significance

Id-ul-Zuha (Bakr-Id), which is also known as Eid al-Adha or Id-ul-Adha, is a festival that Muslims celebrate with special prayers, greetings and gifts.
Desktop Bottom Promotion