For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Basant Panchami 2022:వసంత పంచమి రోజున ఈ పనులు అస్సలు చేయకండి...

వసంత పంచమి 2022 సందర్భంగా ఇంట్లో సరస్వతీ పూజ చేసే సమయంలో చేయాల్సిన మరియు చేయకూడని పనులేంటో చూడండి.

|

హిందూ క్యాలెండర్ ప్రకారం, ప్రతి సంవత్సరం మాఘ మాసంలోని శుక్ల పక్షంలో ఐదో రోజున వచ్చే పంచమిని వసంత పంచమి అంటారు. ఈ పవిత్రమైన రోజున సరస్వతీ దేవిని ప్రత్యేకంగా పూజిస్తారు. ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం, 2022 సంవత్సరంలో ఫిబ్రవరి ఐదో తేదీన అంటే శనివారం నాడు వసంత పంచమి వచ్చింది.

Basant Panchami 2022:Dos & Don’ts while celebrating Saraswati Puja at Home in Telugu

ఈరోజున సరస్వతి దేవిని పూజిస్తే చీకటి(అజ్ణానం) తొలగిపోతుందని.. తమ జీవితంలో పురోగతి లభిస్తుందని.. ఆ దేవత ఆశీస్సులు దక్కుతాయని చాలా మంది నమ్ముతారు. వసంత పంచమి పండుగను సరస్వతీ పూజ, వాగీశ్వరి జయంతి, రతి కామ మహోత్సవం, వసంత ఉత్సవం ఇంకా అనేక రకాల పేర్లతో జరుపుకుంటారు.

Basant Panchami 2022:Dos & Don’ts while celebrating Saraswati Puja at Home in Telugu

సరస్వతీ దేవిని అనేక సందర్భాల్లో పూజించినప్పటికీ, వసంత పంచమి రోజున అమ్మవారిని పూజించడం వల్ల విశేష ఫలితాలు వస్తాయని చాలా మంది భావిస్తారు. ఈ సందర్భంగా సరస్వతీ పూజ యొక్క శుభ సమయం మరియు ఇంట్లోనే అమ్మవారిని ఎలా ఆరాధించాలి.. సరస్వతీ దేవి ఆశీస్సులు పొందేందుకు వసంత పంచమి రోజున ఏయే పనులు చేయాలి.. ఏయే పనులు చేయకూడదనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

Basant Panchami 2022:మీ రాశిని బట్టి సరస్వతీ దేవిని ఎలా ఆరాధించాలో చూడండి...Basant Panchami 2022:మీ రాశిని బట్టి సరస్వతీ దేవిని ఎలా ఆరాధించాలో చూడండి...

శుభ ముహుర్తం..

శుభ ముహుర్తం..

2022 సంవత్సరంలో ఫిబ్రవరి 5వ తేదీన అంటే శనివారం నాడు తెల్లవారుజామున 5 గంటల 28 నిమిషాలకు శుభ సమయం ఉంటుంది. శాస్త్రం ప్రకారం.. పంచమి తిథి నాడు ఉదయం 7:19 నుండి మధ్యాహ్నం 12:35 గంటల వరకు సరస్వతీ దేవిని పూజించొచ్చు. కొన్ని ప్రాంతాల్లో వసంత పంచమి వసంత రుతువు ఆరంభాన్ని సూచిస్తుంది. ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. హోలీకి 40 రోజుల ముందు నుండే దీన్ని పాటిస్తారు. వసంత పంచమి రోజున పసుపు రంగు దుస్తులు ధరించి, పసుపు పువ్వులను అమ్మవారికి సమర్పించి వాటి నుండి ప్రేరణ పొందుతారు. అందుకే పసుపు రంగు చాలా ముఖ్యమైనది.

చేయాల్సిన పనులు..

చేయాల్సిన పనులు..

* వసంత పంచమి రోజున ప్రతి ఒక్కరూ బ్రహ్మ ముహుర్తంలో అంటే సూర్యోదయానికి కనీసం రెండు గంటల ముందు నిద్రలేవాలి.

* ధ్యానం చేయాలి.

* బ్రహ్మచర్యం పాటించాలి.

* స్నానం చేసిన అనంతరం ఉతికిన దుస్తులనే వేసుకోవాలి. ఈరోజు పసుపు రంగులో ఉన్న బట్టలను ధరించాలి.

* పసుపు రంగులో ఉండే నైవేద్యాలను తయారు చేసి సరస్వతీ దేవికి సమర్పించాలి.

Saraswati Puja 2022: ఇంట్లో సరస్వతీ దేవిని ఎలా పూజించాలో తెలుసా... శుభ ముహుర్తం ఎప్పుడంటే...Saraswati Puja 2022: ఇంట్లో సరస్వతీ దేవిని ఎలా పూజించాలో తెలుసా... శుభ ముహుర్తం ఎప్పుడంటే...

పుస్తకాలను విరాళంగా..

పుస్తకాలను విరాళంగా..

* సరస్వతీ పూజ చేసే సమయంలో మీరు ఒక పుస్తకం, పలక, వైట్ బోర్డ్, పెన్సిల్, మార్కర్, సంగీత వాయిద్యాలు మొదలైన వాటిని కూడా అమ్మవారి పాదాల వద్ద ఉంచాలి.

* సరస్వతీ దేవి పూజ చేసిన అనంతరం స్నేహితులతో, కుటుంబ సభ్యులతో కలిసి మిఠాయిలను మరియు రుచికరమైన ఆహారాన్ని షేర్ చేసుకోవాలి.

* పేద పిల్లలకు పుస్తకాలు మరియు లెర్నింగ్ కిట్లను విరాళంగా ఇవ్వాలి.

* ఈరోజున కొత్త పనిని ప్రారంభించడం, కొత్త వ్యాపారం, వాహనాలు కొనుగోలు చేయడాన్ని శుభప్రదంగా భావిస్తారు.

* ఇంట్లో ఉండే చిన్నారులకు ఈరోజు విద్యారంభం లేదా అక్షరాభ్యాసం చేయించొచ్చు.

చేయకూడని పనులు..

చేయకూడని పనులు..

* ఈరోజున ఉల్లిపాయ, వెల్లుల్లి లేదా మాంసం ఉండే ఆహారాన్ని తీసుకోకూడదు.

* మద్యం మరియు పొగాకు వంటి వాటిని వాడరాదు.

* మీరు వ్రతం చేస్తుంటే.. బియ్యం, గోధుమలు మరియు పప్పులు తినకూడదు.

* పెద్దలను, గురువులను, సలహాలు చెప్పే వారిని మీ మాటలతో అస్సలు బాధపెట్టకూడదు.

* ఎక్కువ డార్క్ కలర్లో ఉండే డ్రస్సులను ఈరోజు వేసుకోవద్దు.

* స్నానానికి ముందు ఏమీ తినకూడదు.

FAQ's
  • 2022 సంవత్సరంలో వసంత పంచమి ఎప్పుడొచ్చింది?

    హిందూ క్యాలెండర్ ప్రకారం, ప్రతి సంవత్సరం మాఘ మాసంలోని శుక్ల పక్షంలో ఐదో రోజున వచ్చే పంచమిని వసంత పంచమి అంటారు. ఈ పవిత్రమైన రోజున సరస్వతీ దేవిని ప్రత్యేకంగా పూజిస్తారు. ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం, 2022 సంవత్సరంలో ఫిబ్రవరి ఐదో తేదీన అంటే శనివారం నాడు వసంత పంచమి వచ్చింది.

  • వసంత పంచమి రోజున చేయాల్సిన పనులేంటి?

    * వసంత పంచమి రోజున ప్రతి ఒక్కరూ బ్రహ్మ ముహుర్తంలో అంటే సూర్యోదయానికి కనీసం రెండు గంటల ముందు నిద్రలేవాలి.

    * ధ్యానం చేయాలి. బ్రహ్మచర్యం పాటించాలి. స్నానం చేసిన అనంతరం ఉతికిన దుస్తులనే వేసుకోవాలి. ఈరోజు పసుపు రంగులో ఉన్న బట్టలను ధరించాలి. పసుపు రంగులో ఉండే నైవేద్యాలను తయారు చేసి సరస్వతీ దేవికి సమర్పించాలి. సరస్వతీ పూజ చేసే సమయంలో మీరు ఒక పుస్తకం, పలక, వైట్ బోర్డ్, పెన్సిల్, మార్కర్, సంగీత వాయిద్యాలు మొదలైన వాటిని కూడా అమ్మవారి పాదాల వద్ద ఉంచాలి. సరస్వతీ దేవి పూజ చేసిన అనంతరం స్నేహితులతో, కుటుంబ సభ్యులతో కలిసి మిఠాయిలను మరియు రుచికరమైన ఆహారాన్ని షేర్ చేసుకోవాలి. పేద పిల్లలకు పుస్తకాలు మరియు లెర్నింగ్ కిట్లను విరాళంగా ఇవ్వాలి. ఈరోజున కొత్త పనిని ప్రారంభించడం, కొత్త వ్యాపారం, వాహనాలు కొనుగోలు చేయడాన్ని శుభప్రదంగా భావిస్తారు. ఇంట్లో ఉండే చిన్నారులకు ఈరోజు విద్యారంభం లేదా అక్షరాభ్యాసం చేయించొచ్చు.

  • వసంత పంచమి రోజున చేయకూడని పనులేంటి?

    * ఈరోజున ఉల్లిపాయ, వెల్లుల్లి లేదా మాంసం ఉండే ఆహారాన్ని తీసుకోకూడదు.

    * మద్యం మరియు పొగాకు వంటి వాటిని వాడరాదు.

    * మీరు వ్రతం చేస్తుంటే.. బియ్యం, గోధుమలు మరియు పప్పులు తినకూడదు.

    * పెద్దలను, గురువులను, సలహాలు చెప్పే వారిని మీ మాటలతో అస్సలు బాధపెట్టకూడదు.

    * ఎక్కువ డార్క్ కలర్లో ఉండే డ్రస్సులను ఈరోజు వేసుకోవద్దు.

    * స్నానానికి ముందు ఏమీ తినకూడదు.

English summary

Basant Panchami 2022:Do's & Don’ts while celebrating Saraswati Puja at Home in Telugu

Here we are talking about the basant panchami 2022:Do's and don'ts while celebrating saraswati puja at home in Telugu. Have a look
Story first published:Friday, February 4, 2022, 16:48 [IST]
Desktop Bottom Promotion